సాక్షి, హైదరాబాద్: పార్టీ మారే విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెనక్కి తగ్గినట్ల తెలుస్తోంది. ఆమె పార్టీని వీడకుండా కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన ప్రయత్నలు ఫలించాయి. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో సబిత సమావేశం కానున్నారు. కాగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సబిత ఇటీవల భేటీ అయినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఆమె కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, ఆయన తనయుడు కార్తిక్ రెడ్డితో పాటు టీఆర్‌ఎస్‌లో చేరుతారని వార్తలు వినిపించాయి.
దీంతో వెంటకే తేరుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేసింది. అదే రోజు రాత్రి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి సబిత ఇంటికెళ్లి పార్టీలోనే కొనసాగాలని, తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎంతకీ ఆమె ససేమీరా అనడంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని రంగంలోకి దించింది కాంగ్రెస్ హైకమాండ్. పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న సబితకు పార్టీ మారకుండా నచ్చచెప్పిన రేవంత్ నేడు ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆమె తనయుడు కార్తిక్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment