
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్జీటీ స్టే ఇవ్వడం దక్షిణ తెలంగాణకు మరణ శాసనమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో దక్షిణ తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని.. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సరైన న్యాయ కోవిదులను పెట్టకపోవడంతోనే స్టే వచ్చిందన్నారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టుకు 10 రోజుల్లో పర్యావరణ అనుమతులు ఇప్పించాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డి, సంజయ్‌ల మీద ఉందని చెప్పారు. కేసీఆర్, జగన్‌లు మొదటి నుంచీ కవలపిల్లల్లా కలిసి వెళుతున్నారని, ఇలాంటి కుట్రలను ప్రజలు సహించబోరని అన్నారు.