సాక్షి, మహబూబ్ నగర్: పాలమూరు ఆశీర్వాదంతో ఎంపీగా గెలిపించిన కేసీఆర్ ఇక్కడి ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాడని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పాలమూరు బిడ్డల ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని చెప్పారు. ఈ మేరకు మహబూబ్‌నగర్ కళాశాల గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లుడుతూ.. గోదావరి, కృష్ణ జీవనదులతో రాష్ట్ర సస్యశ్యామలవుతోందన్నారు. పాలమూరు జిల్లాల్లోని 14 నియోజకవర్గాల్లో ఎక్కడా తాగు, సాగునీటి సమస్య లేదన్నారు.
గతంలో వలసల జిల్లాగా పాలమూరు ఉండేదన్నారు. ఒప్పుడు రైతులు కూలీలు వలస వెళ్లేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాలన ఉంచి వలసలు వస్తున్నారని తెలిపారు. పాలమూరు నాడు మైగ్రేషన్ నేడు ఇరిగేషన్ అన్న చందంగా మారిందన్నారు. ఒకప్పుడు పరిశ్రమలు, ఉద్యోగాలు లేవని నేడు ఇండస్ట్రీయల్ ఖిల్లాగా పాలమూరు అవతరించిందన్నారు. కొత్త సచివాలయంలో మొదటి సమీక్ష పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద నేజరిగిందన్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 33 టీఎంసీలతో ఆగస్టులో నీళ్లు నింపుతున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరిస్తాం. 8,700 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మాణం కాబోతున్నాయి. పాలమూరుకు పొలిటికల్ టూరిస్టులొస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ బిచ్చగాళ్లలా అడుకుంటున్నారు. బండి సంజయ్ మంచోడో, పిచ్చోడో అర్థమైతలేదు. 15 లక్షలు ఖాతాలో వేస్తామని మాట తప్పిన మోదీ గొప్పవాడా. 15 లక్షల వలసలు ఆపిన కేసీఆర్ గొప్పవాడో ఆలోచించండి.
బీజేపీకి ఎన్నికల సమయంలోనే దేవుళ్ళు గుర్తుకొస్తారు. దేవుళ్ళ పేరుతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. పాలమూరు-రంగారెడ్డి రిజర్వాయర్‌కు జాతీయ హోదా కల్పిస్తామన్న ప్రధాని హామీ ఏమైంది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని చూస్తే ప్రతిపక్షాలకు నోట్లో మాట రావడం లేదు. సీఎం వయసు స్థాయి చూడకుండా రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి మాటలు పట్టించుకోనవసరం లేదు. అభివృద్ధి జరుగుతుంటే విమర్శలు వస్తూనే ఉంటాయి. సవాళ్లను దాటుకొని ముందుకు సాగాలి.
Comments
Please login to add a commentAdd a comment