సాక్షి,హైదరాబాద్: రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ ఒక్కటేనని కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఈ విషయమై బండి సంజయ్ శుక్రవారం(నవంబర్ 8) హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు.
‘బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా రేవంత్,నేను కొట్లాడాం. అందుకే మేమిద్దరం కేటీఆర్ కలలోకి వస్తున్నాం. డైవర్షన్,కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసే అలవాటు కేటీఆర్‌కే ఉంది. జన్వాడా ఫార్మ్ హౌస్ కేసు,ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కేసుల్లో హంగామా చేసి చివరకు కాంగ్రెస్,బీఆర్‌ఎస్ కాంప్రమైజ్ అయ్యాయి.
కేటీఆర్ ట్విటర్‌లో తప్ప ఎక్కడా కనిపించడు. కేటీఆర్ కళ్లు నెత్తికెక్కాయి. బీఆర్‌ఎస్‌లో క్రెడిబిలిటీ ఉన్న లీడర్ హరీశ్‌రావు మాత్రమే’అని బండి సంజయ్ అన్నారు. ఎక్కడో భువనగిరిలో కాకుండా మూసీ పక్కన ఇల్లు కూలగొట్టే దగ్గర సీఎం రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి పాద యాత్ర చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: హ్యాపీ బర్త్‌డే రేవంత్: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment