సాక్షి, నాగర్‌కర్నూల్: కృష్ణా జలాల సాధనలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి విమర్శించారు. నాగం జనార్ధన్ రెడ్డి ఓ సమావేశంలో మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అనుభవం లేని వారికి కాంట్రాక్టులు ఇచ్చి అసలుకే మోసం తెచ్చారని విమర్శించారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపకల్పనలో కేసీఆర్ అంతా తెలుసని అంటారు, కానీ దోపిడి తప్ప ఆయనకు ఏమీ తెలియదని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి, కృష్ణా జలాలను ఆంధ్రకు తాకట్టు పెట్టారని విమర్శించారు. కేసీఆర్‌కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు పోరాడి ప్రాణాలర్పించింది ఇందు కోసమేనా అని ప్రశ్నించారు. కృష్ణా జలాల వాటా దక్కించుకునేందుకు పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు సమాయత్తం కావాలని నాగం జనార్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment