సాక్షి, నాగర్ కర్నూలు : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన వట్టెం రిజర్వాయర్ భూనిర్వాసితులు చేపట్టిన ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. ప్రభుత్వం తమకు న్యాయమైన పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ వారు చేపట్టిన ఆందోళన మంగళవారానికి 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేటలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు ప్రభుత్వం ఏవిధమైన పరిహారం ఇచ్చిందో.. అదేమొత్తంలో పాలమూరు-రంగారెడ్డి భూ నిర్వాసితులకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఇదే చివరి హెచ్చరిక అని, వెంటనే భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించకపోతే.. అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసి ఉద్యమిస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లాపైన అమితమైన ప్రేమను చూపుతూ.. పాలమూరు జిల్లా రైతన్నలపై సవతి తల్లి ప్రేమ ఎలా చూపిస్తారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment