ఎన్‌జీటీ విశ్రాంత సభ్యులు ప్రొఫెసర్ యూసెఫ్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిషన్‌లో కేంద్ర అటవీ, పర్యావరణశాఖ జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి, కేంద్ర జలవనరులశాఖ అధికారులు, రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు, పిటిషనర్ సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఎం.ఎస్.నంబియార్, పి.ఎస్.రావులతో కూడిన ధర్మాసనం మంగళ వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహా రంలో అంతిమ నిర్ణయానికి రావడానికి కమిషన్ సహాయం తమకు అవసరమని, అందువల్లే పిటిషనర్ అభ్యర్థనను ఆమోదిస్తు న్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 19కి వాయిదా వేసింది.
‘పాలమూరు’పై స్వతంత్ర కమిషన్
Published Wed, May 31 2017 2:03 AM | Last Updated on Fri, Mar 22 2019 3:19 PM
జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్) ప్రాజె క్టుకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ చట్ట ఉల్లంఘనలు, ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరుతెన్నులు, అటవీ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలు తదితర విషయాల్లో నిజా నిజాలను తేల్చేందుకు నిపుణులతో స్వతంత్ర కమిషన్‌ను నియమించింది.

Advertisement
Advertisement