'టీడీపీకి ఉత్తమ్ వంతపాడటం సిగ్గుచేటు'
హైదరాబాద్: ఇప్పటికే ఎన్నికల హామీలు నెరవేర్చలేక ఆంధ్ర ప్రజల నుంచి టీడీపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటుందని తెలంగాణ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఆయన గురువారం రాత్రి మీడియాతో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ ఏపీ మంత్రి దేవినేని ఉమ కేంద్రాన్ని కోరడాన్ని హరీష్ తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే బదులు ఏపీలో హామీలు నెరవేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు దృష్టిపెడితే మంచిదని హరీష్ సూచించారు. పాలమూరును అడ్డుకోవాలన్న టీడీపీ ప్రయత్నాలకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి వంతపాడటం సిగ్గుచేటు అని విమర్శించారు.