జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్: వ్యవసాయ రంగం అభివృద్ధిలో భాగంగా రైతులకు ఉచిత విద్యుత్‌తోపాటు పాలమూరు కరువును శాశ్వతంగా రూపుమాపాలన్న ఉద్దేశంతో రూ.35,200 కోట్లతో చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కలెక్టరేట్ భవన సముదాయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా కర్వెన రిజర్వాయర్ నుంచి సాగునీటిని తీసుకువచ్చి జిల్లా మొత్తం సస్యశ్యామలం చేస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు జిల్లాలో 2.18 లక్షల ఎకరాల సాగు మాత్రమే ఉండగా.. గత తొమ్మిదేళ్లలో సాగు విస్తీర్ణం 3.50 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment