
నవాబుపేట (జడ్చర్ల): భూపరిహారం అందకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కారుకొండ గ్రామపంచాయతీ పరిధిలోని శామగడ్డ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నవాబుపేట మండల సమీపంలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్‌లో నాలుగు గ్రామాల రైతుల భూములు ముంపునకు గురవుతున్నాయి.
ఇందులో పూర్తిగా ముంపునకు గురవుతున్న శామగడ్డ తండాకు చెందిన ఆశిలమ్మ (76)కు సర్వేనంబర్ 97లో 2.10 ఎకరాల భూమి ఉంది. నలభై ఏళ్లకు పైగా ఆమె కాస్తులో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నా.. పట్టా మాత్రం మహబూబ్‌నగర్ మండలం ఫత్తేపూర్‌కు చెందిన జహంగీర్ పేరిట ఉంది. దీంతో కారుకొండ గ్రామ రెవెన్యూ కార్యదర్శి వెంకట్‌రెడ్డి ఖాస్తుదారును విస్మరించి ఆమెకు తెలియకుండా పట్టాదారు పేరుతో దాదాపుగా రూ.13.80 లక్షల పరిహారం చెక్కు సిద్ధం చేశాడు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూమి ముంపునకు గురవుతుండగా పరిహారం అందుతుందని ఎదురు చేస్తున్న ఆశిలమ్మకు.. అసలు విషయం తెలియడంతో ఆందోళనకు గురైంది.
చెక్కులు పెండింగ్‌లో పెట్టాం: తహసీల్దార్
అశిలమ్మ కాస్తులో ఉన్నా పట్టా మాత్రం జహంరీర్ పేరిట ఉంది. కాస్తుదారులు అప్పుడే పట్టా చేయించుకోవాల్సి ఉండేది. తాజాగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పూర్తి విచారణ కోసం చెక్కులను పెండింగ్‌లో పెట్టాం.
Comments
Please login to add a commentAdd a comment