Land compensation
-
పనులు వేగిరం.. పరిహారం దూరం!
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు మద్దూరి శ్రీనివాసరావు. చర్ల మండలం కుదునూరు గ్రామపంచాయతీ పరిధిలో 36 గుంటల భూమే ఈయనకు జీవనాధారం. ఈ స్థలం సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణం కారణంగా ముంపునకు గురవుతోంది. దీంతో పరిహారంగా రూ.7.20 లక్షలు అందిస్తామని ప్రకటించారు. కానీ నేటికీ ఒక్క పైసా అందలేదు. సదరు భూమి శ్రీనివాసరావు తల్లి పేరు మీద ఉండటం, ఆమె గతేడాది చనిపోవడంతో.. పట్టాపై ఉన్న భూయజమాని లేరనే కారణంతో పరిహారం నిలిపేశారు. ఈయన చీకటి కిశోర్. సీతమ్మసాగర్ కింద ఇతని కుటుంబానికి సంబంధించిన భూమి ముంపునకు గురవుతోంది. దీంతో ఏడాది క్రితమే రూ.3.50 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. కానీ ఆ స్థలం పట్టా కిశోర్ తండ్రి శాంతయ్య పేరిట ఉంది. ఆయన ఇటీవల మరణించారు. శాంతయ్య లేడనే కారణంతో ఆ కుటుంబానికి నేటికీ పరిహారం అందించలేదు. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వడంతో పాటు 320 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సీతమ్మ సాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ఇందుకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం, అశ్వాపురం మండలాల మధ్య గోదావరి నదిపై బ్యారేజీ నిర్మిస్తోంది. దీనివల్ల ఇటు దుమ్ముగూడెం, చర్ల, అటు మణుగూరు, అశ్వాపురం మండలాల్లో సుమారు 3,267 ఎకరాలు మంపునకు గురయ్యే అవకాశం ఉందని గుర్తించారు. నిర్వాసితులకు పరిహారం అందించేందుకు రూ.160 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే కోర్టు వివాదాలు, పట్టా పుస్తకం ఎవరి పేరుతో ఉందో ఆ భూ యజమానులు మరణించడం, ఇతర సాంకేతిక కారణాల వల్ల సుమారు 100 మంది రైతులకు నేటికీ పరిహారం అందలేదు. సమస్యలు పరిష్కరించి ముంపు బాధితులకు పరిహారం అందజేయాల్సిన రెవెన్యూ అధికారులు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ముప్పు తిప్పలు పెడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు పనులు మొదలు కావడంతో భూమి సాగు చేసేందుకు వీలుకాక, మరోవైపు పరిహారం అందక నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆందోళనలకు దిగుతున్నారు. ధ్రువీకరణ పత్రాలు సమర్పించినా.. ఇటీవల సీతమ్మసాగర్ బ్యారేజీ, ఫ్లడ్‌బ్యాంక్, వరద కాలువ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. పరిహారం చెల్లించిన భూముల్లో జోరుగా కొనసాగుతున్నాయి. భారీ యంత్రాలు తిరిగేందుకు వీలుగా పొలాల్లో తాత్కాలిక రోడ్లు వేస్తున్నారు. ఎక్కడిక్కడ కందకాలు తీశారు. దీంతో చాలా పొలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పరిహారం అందని రైతుల భూములు కూడా ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్‌ను రైతులు నష్టపోగా ఇప్పుడు రబీ సీజన్లో అదే పరిస్థితి నెలకొంది. దీంతో ముంపు రైతులు తమకు వెంటనే పరిహారం చెల్లించాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలోనే బుధవారం చర్లలో బ్యారేజీ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఆందోళనకు దిగారు. తమ తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు, అలాగే సంబంధిత వారసత్వ ధ్రువీకరణ పత్రాలు సమర్పించినా నేటికి కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయలేదని ముంపు బాధితులు వాపోతున్నారు. పరిహారం అందకపోయినా ఇన్నాళ్లూ భూములు సాగు చేస్తూ జీవించామని, ఇప్పుడు పనులు మొదలు కావడంతో సాగుకు అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు. ఉన్న ఒక్క జీవనాధారం కోల్పోవడంతో కడుపు నింపుకునేందుకు కూలీ పనులకు వెళుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిక్కుతోచనిస్థితిలో కొందరు రైతులు పట్టణాలకు వలస వెళ్తుంటే, ఆసరా కోల్పోయిన వృద్ధులు ఆదుకునే హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. రెండు వారాల్లో నష్ట పరిహారం పెండింగ్‌లో ఉన్న పరిహారం ఫైళ్లు పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ముంపు బాధితులకు రెండు వారాల్లో పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – భరణిబాబు, తహసీల్దార్, చర్ల -
అందని పరిహారం.. ఆగని ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు భూ పరిహారం విషయంలో జరుగుతున్న జాప్యం రైతుల్లో ఆందోళనను పెంచుతోంది. సేకరణకు సమ్మతించిన భూ ములపై ప్రభుత్వం అవార్డు ప్రకటించి ఎనిమిది నెలలైనా పరిహారం ఇవ్వకపోవడంతో వారంతా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా నిరసనలకు దిగుతున్నారు. ప్రత్యామ్నాయ భూములు కొనేలా సత్వరమే పరిహారం ఇప్పించా లంటూ ప్రభుత్వ శాఖల చుట్టూ తిరుగుతూ ఒత్తిడి పెంచుతుండటంతో నీటిపారుదల శాఖ నిధుల విడుదలకోసం ప్రభుత్వానికి మొరపెట్టుకుంటోంది. 961 ఎకరాలు..8 నెలలు.. పూర్వ మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరా లకు సాగునీరిచ్చే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కింద రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు నిర్మించేందుకు 12,082 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని గుర్తించారు. ఇప్పటికే 10,980 ఎకరాల భూమిని సేకరించేలా వివిధ రకాల ప్రక్రియలను పూర్తి చేశారు. ఇందులో 10,019 ఎకరాలకు పరిహారం చెల్లించగా, 961 ఎకరాలను తీసుకోవడానికి ప్రభుత్వం అవార్డు చేసింది. ఈ భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించి వాటిని పూర్తిగా స్వాధీనపరచుకొని నిర్మాణ పనులు కొనసాగించాల్సి ఉంటుంది. అయితే ఈ 961 ఎకరాల భూమిని ఈ ఏడాది మే నెలలో అవార్డు చేసినా వీటికి సంబంధించిన రూ.62 కోట్లు పరిహారం మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు. దీంతో కొందరు రైతులు కోర్టులను ఆశ్రయించగా, మరికొందరు ప్రాజెక్టు పనులు జరుగనీయకుండా అడ్డుకుంటున్నారు. రైతుల డిమాండ్‌పై ఏదో ఒకటి తేల్చితే కానీ పనులు ముందుకుసాగే అవకాశం లేకపోవడంతో నీటిపారుదల శాఖ దీనిపై ప్రభుత్వానికి లేఖ రాసింది. -
పరిహారం ఇచ్చి కదలండి..
సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్) : తమకు పరిహారం ఇచ్చిన అనంతరం ప్రాజెక్టు పనులు సాగించాలని ఉదండాపూర్, వల్లూరు రైతులు ఆందోళన చేపట్టారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి మండలంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను శుక్రవారం నిర్వాసితులు అడ్డుకున్నా రు. ప్రాజెక్ట్ పనులకు మట్టిని, కంకరను తీసుకెళ్తున్న టిప్పర్లను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. సేకరించిన భూములకు పరిహారం ఇప్పటి వరకు అందలేదని, మల్లన్నసాగర్, కొండపోచమ్మ నిర్వాసితులకు ఇచ్చిన విధంగా తమకు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముంపుకు గురవుతున్న వల్లూరు, ఉదండాపూర్ పునరావాసానికి సంబధించి శంకరాయపల్లి, కావేరమ్మపేట పరిధిలో ఇళ్ల స్థలాలను వెంటనే ఖరారు చేసి పునరావాసాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. వల్లూరు ప్రధాన రహదారిపై గ్రామస్తులు, విద్యార్థులు లు రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. నిర్లక్ష్యం వీడని ప్రభుత్వం.. రిజర్వాయర్ నిర్మాణానికి సానుకూలంగా స్పం దించి భూములు అప్పగించినా ప్రభుత్వం తమ ను చిన్న చూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశా రు. బహిరంగ మార్కెట్లో ఎకరంగా కనీసంగా రూ.25 లక్షలు పలుకుతుందని, తమ భూములకు మాత్రం ప్రభుత్వం కేవలం రూ.5.50, రూ.6.50 లక్షలు మాత్రమే ఖరారు చేసిందని అన్నారు. తమ భూములకు ఆ విలువలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తేగాక తమకు రైతుబంధు పథకం సైతం నిలిపి వేశారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇక ఉదండాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గ్రామస్తులు సమావేశమై ఆందోళనకు సిద్దమయ్యారు. రూ.32 కోట్లు విడుదల భూపరిహారం కోసం శుక్రవారం రూ.32 కోట్లు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్సి లక్ష్మారెడ్డి తెలిపారు. సమస్యలను సీఎం కేసీఆర్‌ను కలిసి వివరించామని,సమస్యల పరిశ్కారానికి సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. వల్లూరు, ఉదండాపూర్‌లో అదికారులు పర్యటించి ఇండ్ల నష్టపరిహారాన్ని అంచనా వేసి ఆయా విలువను అందజేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వల్లూరు, ఉదండాపూర్ గ్రామాలకు సంబందించి ఖరారు చేసిన ఇళ్ల స్థలాలను కేటాయించి పునరావాసానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రక్రియను వేగవంతం చేసేందుకు గతంలో ఆర్డీఓగా పనిచేసి బదిలీపై వెళ్లిన లక్ష్మినారాయణను కూడా డిప్యుటేషన్‌పై తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు సంయమనం పాటించాలని అందరికీ న్యాయం జరిగే విదంగా తాము సముచితమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అందరూ సహకరిస్తేనే అభివృద్ధివిశయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు సుదర్శన్‌గౌడ్, తదితరులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ఫోన్ చేసి విశయాన్ని వివరించారు. దీంతో ఆయన ఫోన్లో మైక్ ద్వారా గ్రామస్తులనుద్దేశించి మాట్లాడారు. రిజర్వాయర్‌నిర్మాణానికి అందరు సహకరించాలని,సమస్యల పరిశ్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వెంటనేపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా రిజర్వాయర్‌పనులకు తరలిస్తున్న కంకరను వల్లూరు సమీపంలో డంప్ చేయించారు. కంకరను విక్రయించి ఆసొమ్ముద్వారా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈసందర్భంగా పేర్కొన్నారు. -
భూ పరిహారం అందక మనస్తాపం
నవాబుపేట (జడ్చర్ల): భూపరిహారం అందకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కారుకొండ గ్రామపంచాయతీ పరిధిలోని శామగడ్డ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నవాబుపేట మండల సమీపంలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్‌లో నాలుగు గ్రామాల రైతుల భూములు ముంపునకు గురవుతున్నాయి. ఇందులో పూర్తిగా ముంపునకు గురవుతున్న శామగడ్డ తండాకు చెందిన ఆశిలమ్మ (76)కు సర్వేనంబర్ 97లో 2.10 ఎకరాల భూమి ఉంది. నలభై ఏళ్లకు పైగా ఆమె కాస్తులో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నా.. పట్టా మాత్రం మహబూబ్‌నగర్ మండలం ఫత్తేపూర్‌కు చెందిన జహంగీర్ పేరిట ఉంది. దీంతో కారుకొండ గ్రామ రెవెన్యూ కార్యదర్శి వెంకట్‌రెడ్డి ఖాస్తుదారును విస్మరించి ఆమెకు తెలియకుండా పట్టాదారు పేరుతో దాదాపుగా రూ.13.80 లక్షల పరిహారం చెక్కు సిద్ధం చేశాడు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూమి ముంపునకు గురవుతుండగా పరిహారం అందుతుందని ఎదురు చేస్తున్న ఆశిలమ్మకు.. అసలు విషయం తెలియడంతో ఆందోళనకు గురైంది. చెక్కులు పెండింగ్‌లో పెట్టాం: తహసీల్దార్ అశిలమ్మ కాస్తులో ఉన్నా పట్టా మాత్రం జహంరీర్ పేరిట ఉంది. కాస్తుదారులు అప్పుడే పట్టా చేయించుకోవాల్సి ఉండేది. తాజాగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పూర్తి విచారణ కోసం చెక్కులను పెండింగ్‌లో పెట్టాం. -
పరిహారం ఇవ్వకుంటే పనులు సాగనివ్వం
లావేరు : మండలంలోని రావివలస గ్రామానికి చెందిన పలువురు రైతులు సోమవారం తోటపల్లి కాలువ పనులను అడ్డుకున్నారు. భూములకు పరిహారం చెల్లించిన తరువాతే కాలువ తవ్వాలని స్పష్టం చేశారు. రావివలస, శీర్లపాలెం రెవెన్యూ పరిధిలోని భూములను తోటపల్లి కాలువ కోసం అధికారులు సేకరించారు. ఇంతవరకురైతులకు పరిహారం చెల్లించలేదు. రావివలస గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ మండల ప్రధాన కార్యదర్శి దేశెట్టి తిరుపతిరావు, దేశెట్టి దుర్గారావు, దేశెట్టి ఆదినారాయణ, రాంబాబు, బంగారప్పడు, రమణ, పసుపురెడ్డి అప్పారావు, పందిరిపల్లి తిరుపతిరావు తదితరులు సోమవారం తోటపల్లి కాలువ పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మార్చి నెలాఖరు నాటికి రైతులకు పరిహారం చెల్లిస్తామని గతంలో భూసేరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, లావేరు తహసీల్దారు హామీ ఇచ్చారని, నేటికీ అతీగతీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మాట తప్పడం భావ్యంగా లేదని అన్నారు. కాలువ కల్వర్టు పనులు చేపట్టకుండా రైతులు అడ్డుకోవడంతో కూలీలు వెనుతిరిగారు. -
భూ పరిహారంపై స్పష్టత ఇవ్వాలి
ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమశిల: అనంతసాగరం మండలం లో పీకేపాడు, కమ్మవారిపల్లి గ్రామాలకు చెందిన రైతుల పొలాల్లో హైలెవల్ కాలువ నిర్మాణం చేపడుతున్నారని,వారికి భూ పరిహారంపై స్పష్టత ఇవ్వాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలుగుగంగ ప్రత్యేక కలెక్టర్ మార్కండేయులను కోరారు. శుక్రవారం నెల్లూరులో ఆయా గ్రామాల రైతులతో కలసి ఆయన స్పెషల్ కలెక్టర్‌ను కలిశారు. హైలెవల్ కాలువ నిర్మాణాలకు రైతులెవరూ వ్యతిరేకం కాదన్నారు. కాని కాలువ నిర్మాణాలకు ముందు వారి పొలాలను సర్వే చేసి ఏ మేరకు భూమి నష్టపోతారో స్పష్టత ఇవ్వాలన్నారు. రైతలను ఇబ్బందులు గురి చేయకుండా చూడాలని సూచించారు. స్పందించిన ప్రత్యేక కలెక్టర్ రైతులకు నష్టం లేకుండా చూస్తానని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మర్రిపాడు వైఎస్సార్సీపీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు నాయుడు, నాయకులు మందా రామచంద్రారెడ్డి, దుగ్గిరెడ్డి రత్నారెడ్డి , కె.వెంకటేశ్వరరెడ్డి, రైతులు ఉన్నారు. -
పాలమూరు పరిహారంలో.. ‘తోడేళ్ల ’ ఫలహారం!
* పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూపరిహారంలో భారీగా అక్రమాలు * భూమి రకం గుర్తింపు, విలువ మదింపులో రెవెన్యూ అధికారులు, దళారుల హస్తలాఘవం * రెండేసి పంటలు పండుతున్నట్లు నకిలీ రికార్డులు * రక్షిత కౌలుదారు రికార్డులను దాచి కోట్లు దండుకుంటున్న అక్రమార్కులు * అక్రమాలపై ఇంటలిజెన్స్ నిఘా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూపరిహారం చెల్లింపులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం కాకముందే భూపరిహారం మదింపు, చెల్లింపులో కోట్ల రూపాయలు పక్కదారి పడుతున్నాయి. ముంపు గ్రామాల్లో ఇష్టారీతిన భూముల వర్గీకరణతో అధికారులు అడ్డగోలుగా దండుకుంటున్నారు. దళారుల అవతారమెత్తిన స్థానిక నేతలు రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి... బీడు భూముల్లో రెండేసి పంటలు పండుతున్నట్లు, అసలు బోరుబావి కనెక్షనే లేనిచోట్ల పదుల ఎకరాల్లో నీరు పారుతున్నట్లు, పది అడుగులు కూడా లేని గుంతలను బోరు బావులుగా చూపిస్తూ తప్పుడు రికార్డులు సృష్టించి కోట్లు మింగేస్తున్నారు. అసలు రక్షిత కౌలుదారు చట్టం రికార్డులను దాచిపెట్టి మరీ అర్హులకు అందాల్సిన పరిహారాన్ని స్వాహా చేస్తున్నారు. ఇలా ఒక్క కర్వెన రిజర్వాయర్ ముంపు గ్రామాల్లోనే రూ. 50 కోట్లకు పైగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు అంచనా. ఈ అవకతవకలను వెలుగులోకి తెచ్చేందుకు పోలీసు ఇంటెలిజెన్స్ విభా గం రంగంలోకి దిగి వివరాలను సేకరించింది. ఇప్పటికే రూ.300 కోట్ల పరిహారం చెల్లింపు పాలమూరు ప్రాజెక్టులో భాగంగా అనంతగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కురుమూర్తిరాయ(కర్వెన), ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా మిగతా ఐదు రిజర్వాయర్ల పరిధిలో 20,884.86 ఎకరాల భూమి సేకరించాలని అధికారులు గుర్తించారు. అందులో 15,889.99 ఎకరాలు పట్టా భూమికాగా.. మిగతాది ప్రభుత్వ భూమి. పట్టాభూముల్లో ఇప్పటికే 15 వేల ఎకరాల వరకు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో 123 ప్రకారం ఈ ప్రాజెక్టు కింద భూసేకరణ జరుగుతోంది. ఏటా రెండు పంటలు పండే భూములకు ఎకరాకు రూ. 5.5 లక్షలు, ఒక పంట పండే భూమికి రూ. 4.5 లక్షలు, బీడు భూములకు రూ. 3.5 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. ఇక చెట్లు, స్థలాలు, వ్యవసాయ బావులు ఇతర నిర్మాణాలు వంటివేమున్నా వాటికి ప్రభుత్వం నిర్ధారించిన రేట్లతో పరి హారం చెల్లిస్తారు. భూములకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 390 కోట్లు విడుదల చేయగా... అందులో రూ. 300.26 కోట్ల వరకు పరిహారం చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే భూముల రకాన్ని మదింపు చేసే విషయంలో, బోరు బావులు, బోర్లను గుర్తించి వాటికి రేటు నిర్ధారణ చేయడంలో అక్రమాలు జరుగుతున్నాయి. నీళ్లు రాని బోర్లకూ పరిహారం కర్వెన రిజర్వాయర్ పరిధిలో భూత్పూర్ మండల పరిధిలోని కర్వెన, తాటిపర్తి, కొత్తూరు, ఎల్కిచర్ల గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ నాలుగింటిలో కలిపి 3,561 ఎకరాల ముంపు భూమి ఉండగా, అందులో పట్టా భూములు 3,285.5 ఎకరాలు. ఒక్కో గ్రామ పరిధికి సంబంధించి భూమిని మూడు విడతలుగా కలెక్టర్ ఆమోదానికి పంపుతున్నారు. ఇందులో కర్వెన గ్రామానికి సంబంధించి తొలి విడతలో 275 ఎకరాలను పంపగా... అందులో 80 ఎకరాలు రెండు పంటలు, 43 ఎకరాలు ఒక పంట భూములను చూపారు. రెండో విడతలో 152 ఎకరాల బీడు భూములను చూపారు. మూడో విడతలో 133 ఎకరాల వివరాలు పంపగా... అందులో 40 ఎకరాలు రెండు పంటల భూమి, 35 ఎకరాలు ఒక పంట భూమి, 59 ఎకరాలు బీడుగా చూపించారు. ఇక్కడ బీడు భూములు, ఒక పంట పండే భూములను రెండేసి పంటలు పండే భూములుగా చూపి లెక్కలు కట్టారు. ఇలా లెక్క కట్టేందుకు రెవెన్యూ అధికారులు దళారుల సహాయంతో లబ్ధిదారుల వద్ద ఎకరాకు రూ. 50వేల చొప్పున వసూలు చేసినట్లు తెలుస్తోంది. రెండు పంటల భూమిగా అర్హత ఉండాలంటే ఒక బోరు కింద మూడెకరాలు మాత్రమే ఉండాలి. కానీ కర్వెన గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడికి చెందిన సర్వే నంబర్లుగా భావిస్తున్న 144, 145, 133, 156, 235, 244ల కింద మొత్తంగా 40 ఎకరాలను రెండు పంటల భూమిగా చూపారు. కానీ ఈ భూముల్లో ఒక పంట మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. సర్వే నంబర్లు 169, 170, 190, 191, 192, 193లలో మొత్తంగా 70 ఎకరాల వరకు భూమి ఉండగా... ఇక్కడ 13 బోర్లు, 3 బోరుబావులు ఉన్నాయని రెవెన్యూ అధికారులు రికార్డుల్లో పేర్కొన్నారు. అయితే ఇక్కడ విద్యుత్ శాఖ రికార్డుల ప్రకారం మూడు బోరుబావులు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ఆధారంగా చూసినా... బోరుకు 3 ఎకరాల చొప్పున 39 ఎకరాలకు మించి సాగు ఉండదు. అయినా ఈ 70 ఎకరాలనూ రెండు పంటల భూమిగా లెక్కించారు. వాస్తవానికి ఇక్కడ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు లేకుండానే, అసలు బోరు వేయకుండానే నడుస్తున్నట్లుగా అధికారులు లెక్కగట్టారు. గతంలో బోర్లు వేసి నీరుపడని వాటిల్లో కూడా ఒక పైపు మాత్రం ఏర్పాటు చేసి.. బోర్లు ఉన్నట్లుగా నిర్ధారించి పరిహారం లెక్కించారు. ఇంకొన్ని చోట్ల అసలు బోరే లేకున్నా... 10 అడుగుల మేర తవ్వి అందులో పైపులు దించి బోరు ఉందన్నట్లుగా సృష్టించారు. అక్రమాలకు పరాకాష్ట కర్వెనలో సర్వే నంబర్ 246లో ఎకరా 2 గుంటల భూమి, 247లో రెండెకరాల 20 గుంటలు, 248లో రెండెకరాల ఆరు గుంటల భూమి ఉంది. ఇదంతా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడిదే. ఇందులో సర్వే నంబర్ 246లోని భూమిలో 22 గుంటలు, 247లోని రెండెకరాల 20 గుంటలు, 248లోని రెండెకరాల 3 గుంటల భూమిని దళితులకు భూపంపిణీ పథకం కోసం ఆ నాయకుడు ఎస్సీ కార్పొరేషన్‌కు అమ్మేశారు. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ డబ్బు చెల్లిస్తూ గెజిట్‌ను సైతం విడుదల చేసింది. ఆ భూమిని స్వాధీనం చేసుకుని.. అదే గ్రామంలోని దళితులకు పంపిణీ చేసి పాస్‌బుక్‌లు సైతం అందజేసింది. కానీ సదరు నాయకుడు పంపిణీ చేసిన ఈ భూమిపై తిరిగి పాస్‌బుక్కులు సృష్టించి, రూ. 9.88 లక్షలు పరిహారం కింద పొందారు. ఇక ఎల్కిచర్ల పరిధిలోని సర్వే నంబర్ 378లో ఎనిమిది ఎకరాలను 2 పంటల భూమిగా లెక్కించారు. ఇక్కడ ఇంటలిజెన్స్ విచారణ చేయగా... కేవలం రెండెకరాల్లో ఉల్లి సాగు చేశారని, మిగతాది బీడు భూమి అని తేలింది. ఇక సర్వే నంబర్ 373లో 11 ఎకరాలు 2 పంటల భూమిగా చూపగా... అక్కడ అసలు పంటలే లేవు. ఇలా ఇష్టారీతిన మదింపు చేస్తూ అధికారులు భూత్పూర్ మండల పరిధిలోనే సుమారు రూ. 50 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. భూత్పూర్ మండల పరిధిలో ఇంకా చాలానే అవకతవకలు జరిగినట్లుగా సమాచారం. -
‘యాదాద్రి’ భూ పరిహారం రూ. 285 కోట్లు !
► దామరచర్ల విద్యుత్ కేంద్రం భూ సేకరణ పరిహారం మంజూరు ► భూ పరిహారం కింద రూ.162 కోట్లు.. ► పునరావాసానికి మరో రూ.102 కోట్లు ► నల్లగొండ జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేయనున్న జెన్కో సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్లలో 4000 మెగావాట్ల భారీ సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం అవసరాల కోసం సేకరించనున్న భూములకు పరిహారంగా తెలంగాణ జెన్కో రూ.285.81 కోట్ల ప్యాకేజీని మంజూరు చేసింది. 2013లో అమల్లోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్టం కింద ఈ ప్యాకేజీని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అవసరాల కోసం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, జెన్కోకు దామరచర్ల మండలం వీర్లపాలెం, దిలావర్పూర్, గంగాదేవిగట్టు గ్రామాల పరిధిలోని 1892.35 హెక్టార్ల అటవీ భూములను పరస్పర భూముల బదలాయింపు పద్ధతిలో కేటాయించింది. ఈ భూముల్లోనే 879.09 ఎకరాల పట్టా/డీ-ఫారం పట్టా/యూడీఏఎఫ్ఏ/అసైన్డ్ భూములతో పాటు 920.25 ఎకరాల ఆర్ఓఎఫ్ఆర్ పట్టా(సాగులో ఉన్న అటవీ భూములు) భూములున్నాయి. స్థానిక గిరిజన కుటుంబాలు ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యాదాద్రి విద్యుత్ కేంద్రం అవసరాల కోసం ఈ భూములను సేకరించేందుకు జెన్కో తాజా ప్యాకేజీని మంజూరు చేసింది. ఇందులో పరిహారం కింద రూ.162.81 కోట్లు, బాధిత కుటుంబాలకు పునరావసం కల్పించడానికి రూ.102.80 కోట్లను కేటాయించింది. మౌలిక వసతుల అభివృద్ధికి రూ.16 కోట్లు, పరిపాలన, ఇతర అవసరాల కోసం రూ.4 కోట్లను ఈ ప్యాకేజీలో కేటాయించింది. బాధితులకు పరిహారం చెల్లించి తక్షణమే భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఖాతాలో ఈ నిధులను జమ చేయనుంది. మొడుగులకుంట, కపూర తండాల పరిధిలో 181 కుటుంబాల నుంచి భూముల సేకరణ కోసం జిల్లా కలెక్టర్ గత అక్టోబర్ 4న ప్రకటన జారీ చేశారు. యాదాద్రి విద్యుత్ కేంద్రం ప్రాజెక్టు అంచనాల్లో భూ సేకరణ అవసరాల కోసం మొత్తం రూ.845 కోట్ల నిధులను జెన్కో కేటాయించింది. అందులో స్థానిక గిరిజనులకు ప్రకటించిన రూ.285.81 కోట్ల ప్యాకేజీని ఈ కింది అవసరాల కోసం వినియోగించనున్నారు. -
భూపరిహారం కోసం ఆత్మహత్యాయత్నం
నిజామాబాద్: తనకు రావాల్సిన భూ పరిహారం ఇప్పించాలని కోరుతూ కలెక్టరేట్ సాక్షిగా వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కలక్టరేట్లో చోటుచేసుకుంది. బైపాస్ రోడ్డు నిర్మాణం సమయంలో తన నుంచి భూమిని తీసుకున్న ప్రభుత్వం కేవలం 25 శాతం పరిహారమే ఇచ్చి చేతులు దులుపుకుందని మిగతా పరిహారాన్ని ఇప్పించాలని గాదే కృష్ణ(35) అనే వ్యక్తి సోమవారం ఉదయం కలెక్టరేట్ ముందు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తన వెంట తీసుకొచ్చుకున్న టర్పెంటాయిల్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు.