భూ పరిహారంపై స్పష్టత ఇవ్వాలి | land given as compensation to the resolution :- MLA MEKAPATI Gautam Reddy, | Sakshi
Sakshi News home page

భూ పరిహారంపై స్పష్టత ఇవ్వాలి

Published Sat, Apr 23 2016 4:54 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

భూ పరిహారంపై స్పష్టత ఇవ్వాలి - Sakshi

భూ పరిహారంపై స్పష్టత ఇవ్వాలి

ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి

సోమశిల: అనంతసాగరం మండలం లో పీకేపాడు, కమ్మవారిపల్లి గ్రామాలకు చెందిన రైతుల పొలాల్లో హైలెవల్ కాలువ నిర్మాణం చేపడుతున్నారని,వారికి భూ పరిహారంపై స్పష్టత ఇవ్వాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలుగుగంగ ప్రత్యేక కలెక్టర్ మార్కండేయులను కోరారు. శుక్రవారం నెల్లూరులో ఆయా గ్రామాల రైతులతో కలసి ఆయన స్పెషల్  కలెక్టర్‌ను కలిశారు. హైలెవల్ కాలువ నిర్మాణాలకు రైతులెవరూ వ్యతిరేకం కాదన్నారు. కాని కాలువ నిర్మాణాలకు ముందు వారి పొలాలను సర్వే చేసి ఏ మేరకు భూమి నష్టపోతారో స్పష్టత ఇవ్వాలన్నారు.

రైతలను ఇబ్బందులు గురి చేయకుండా చూడాలని సూచించారు. స్పందించిన ప్రత్యేక కలెక్టర్ రైతులకు నష్టం లేకుండా చూస్తానని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మర్రిపాడు వైఎస్సార్‌సీపీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు నాయుడు, నాయకులు మందా రామచంద్రారెడ్డి, దుగ్గిరెడ్డి రత్నారెడ్డి , కె.వెంకటేశ్వరరెడ్డి, రైతులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement