తట్టెడు మట్టి ఎత్తకుండా.. 50 వేల కోట్లా!
- అంచనాలు అమాంతం పెంచేశారు
- పాలమూరు ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశం
- టీఆర్‌ఎస్ సర్కారు తీరుపై రాజకీయ పార్టీల మండిపాటు
హైదరాబాద్: నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం నిధుల దోపిడీకి పాల్పడుతోందని రాజకీయ పక్షాల రౌండ్ టేబుల్ సమావేశం మండిపడింది. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం తప్పుడు గణాంకాలను వెల్లడిస్తోందని అభిప్రాయపడింది. ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న అవినీతి ఏరులై పారుతోందని, పరిపాలనలో ఎక్కడా పారదర్శకత లేదని ఆయా పార్టీలు విమర్శించాయి.
పాలమూరు - రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టు విషయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే ఆరుణ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అన్ని రాజకీయ పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు దామోదర రాజనర్సింహ, బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి, టీడీపీ నేత రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంజనీర్లు ఈ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
పాలమూరు రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టు కోసం ఎందుకు గ్లోబల్ టెండర్లు పిలవలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఒక ఇంట్లో కూర్చొని తమకు కావాల్సిన వారికి టెండర్లు ఫైనల్ చేశారని దుయ్యబట్టారు. తట్టెడు మట్టి ఎత్తకుండా ప్రాజెక్ట్ అంచనాలు 50 వేల కోట్ల రూపాయలకు పెంచడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, ఈ రాష్ట్రంలో ప్రాజెక్ట్స్ కట్టింది కాంగ్రెస్ పార్టీ అనీ, ప్రాజెక్టులను అడ్డుకుంటోంది కాంగ్రెస్ అని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో సాగు, తాగు నీటి ప్రాజెక్ట్స్ కట్టేందుకు ప్రభుత్వంతో కలిసి వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రాజెక్ట్స్ పేరుతో దోపిడీ చేయాలనే మీ ఆగడాలను అడ్డుకొని తీరుతామన్నారు. నిపుణుల కమిటీ అభ్యంతరాలు తెలిపినా .. నవయుగ కంపెనీ అడిగిన మేరకే పనులు మంజూరు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
రాష్ట్రం నా జాగీరు తరహాలో కెసిఆర్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. భావి తెలంగాణా ప్రజల భవిష్యత్తు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ప్రాజెక్ట్స్ కడుతున్నప్పుడు .. తప్పులు జరుగుతుంటే ప్రశ్నించడం తప్పా. శాశ్వితంగా రాష్ట్రాన్ని తప్పుల ఉబిలోకి నెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని, ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వం నిజమైన అంకెలు దాచిపెడుతోందని విమర్శించారు. ప్రాజెక్ట్ ల పేరు కేసీఆర్ తెలంగాణ దోపిడీకి పాల్పడుతున్నారని డీకే ఆరుణ విమర్శించారు. జిల్లా లోని పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తే కాంగ్రెస్ కు పేరు వస్తుందని వాటిని పక్కన బెట్టారన్నారు. కొత్త ప్రాజెక్ట్ లు కొత్త కాంట్రాక్టర్లు, కొత్త కమిషన్ ల ఫార్ములతో ప్రభుత్వం దోచుకుంటుంతోందని దుయ్యబట్టారు. సర్కార్ తప్పులను, అవినీతిని ప్రశ్నిస్తే.. అడ్డుకుంటున్నారని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.
అబద్దాలు చెప్పడంలో మామను మించిన అల్లుడు హరీష్ రావు అని, పాలమూరు కు జలకల తెచ్చామంటూ.. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్ట్ లకు హరీష్ ప్రారంభోత్సవాలు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రోజెక్టు ద్వారా ఒక్క విద్యుత భారమే 1600 కోట్లు వాస్తవం కాదా..? పాలమూరు రంగారెడ్డి పార్జిక్ట్స్ అలైన్ మెంట్ తో కల్వకుర్తి ప్రాజెక్ట్ కెలాల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దెబ్బత్న్తుందని .. జూపల్లి తో సహా తెరాస ఎమ్మెల్యేలు సీఎం కు లేఖ రాశారు. కేసీఆర్ ఆంద్ర కాంట్రాక్టర్లతో తెలంగాణ ను దోచుకుంటున్నది వాస్తవం కాదా..? కేసీఆర్ సీఎం లా కాకుండా జోకర్ లా మాట్లాడుతున్నారు. న్యాయం కోసం భూనిర్వాసితులు కోర్ట్ కు వెళితే తప్పా..? తాగునీటి ప్రాజెక్ట్ అని ప్రభుత్వం ఆఫీడౌట్ ఇచ్చింది నిజం కాదా..? పాలమూరు ప్రాజెక్ట్.. త్రాగునీటి ప్రొజెసినా.. సాగునీటి ప్రాజెకట్టా..? ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. పాత డిజైన్ తోనే ప్రాజెక్టు నిర్మాణం జరగాలి. .ప్రాజెక్టు నిర్మాణం పై సమగ్ర చర్చ జరగాలని ఆమె డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది తెలంగాణ రాష్ట్రం కాదు, తన రాజ్యం అనుకుంటున్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే ప్రభుత్వ లోపాల పై ప్రశ్నిస్తున్నామని, ప్రాజెక్ట్ లలో పారదర్శకత ఉండాలనడం నేరమా..? ప్రాజెక్టుల్లో మార్పు పై తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడారా? కేసీఆర్ కు బేతాళ మాంత్రికుడు దగ్గరయ్యాకే.. కేసీఆర్ ప్రాజెక్ట్ ల మార్పును తెరపైకి తెచ్చారని అన్నారు. ప్రభుత్వ తప్పిదాలను సమర్థిస్తే చరిత్ర తమను క్షమించదని వ్యాఖ్యానించారు. దోచుకున్న డబ్బుతో కేసీఆర్ కుటుంబం దేశం విడిచి ఎక్కడికైనా పారిపోయే అవకాశమందన్నారు. అందుకే కేటీఆర్, కవితలు దేశాలు చుట్టొస్తున్నారన్నారు. పది పైసలు వడ్డీకి తీసుకునేందుకు అల్లుడు హరీష్ దగ్గర కోట్ల రూపాయలు మూలుగుతున్నాయని, కేసీఆర్ బ్యాంకుల చుట్టు తిరిగేకంటే హరీష్ ను అడిగితే సరిపోతుందని ఎద్దేవా చేశారు. భూసేకరణ జరగకుండా, 200 కోట్ల బిల్లులను డ్రా చేసిన వారిని బేడీలేసి అరెస్ట్ చేయాలన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ను ఎకరాకు 10లక్ష ల చొప్పున అమ్మేందుకు కేసీఆర్ సిద్ధమా ? డీల్ కు ఒప్పుకుంటే 48 గంటల్లో డబ్బులు ఇచ్చెందుకు తాను సిద్ధమని రేవంత్ సవాలు చేశారు.
పాలమూరు ప్రాజెక్టు విషయంలో అవినీతికి పాల్పడిన కేసీఆర్ కు జైలు తప్పదని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు. ప్రాజెక్టుల విషయంలో తాను వేస్తున్న ప్రశ్నలు తప్పు అని తేల్చితే తాను రాజకీయాలనుండి తప్పుకుంటా..? మధుకోడా, శశికలకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందన్నారు. మెగా కంపెనీ కోసం అర్హతలను మార్చిన ఘనుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. కేసీఆర్ అవినీతిపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు.