MLA DK Aruna
-
ప్రజలకు సేవలందించడం వరం
గద్వాల : ప్రజలకు సేవలందించే అవకాశం తనకు భగవంతుడు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. శుక్రవారం తన పుట్టిన రోజు సందర్భంగా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడి ప్రజలకు స్వయంగా సేవలందించే అవకాశం కలగడం వరంగా భావిస్తున్నానన్నారు. అధికారంలో ఉన్నంత కాలం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి, వివిధ అభివృద్ధి పనులను చేపట్టి నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచేందుకు యత్నిస్తున్నానన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ వంతు బాధ్యతగా గ్రామాల్లో సామాజిక సేవలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బండల పద్మావతి, గద్వాల మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణవేణి, వైస్‌చైర్మన్ శంకర్, పార్టీ నాయకులు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, వేణుగోపాల్, సలాం, బండల వెంకట్రాములు, రామంజనేయులు, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డీకే అరుణకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 121 మంది రక్తదానం మొదట ఇంట్లో పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే డీకే అరుణ కేక్ కట్ చేసి జన్మదినాన్ని జరుపుకొన్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యేకి పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన స్వగృహ ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో పార్టీ నాయకులతోపాటు పలువురు కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు 121మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరుణ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్తదానంతో కాపాడొచ్చన్నారు. రక్తదానాన్ని ఇతరులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్ ఆధ్వర్యంలో జిల్లా ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బీచుపల్లిలో ప్రత్యేక పూజలు.. ఇటిక్యాల (అలంపూర్) : తన జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ బీచుపల్లి పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆంజనేయస్వామి ఆలయ పూజారి మారుతీచారి, ఈఓ రామన్‌గౌడ్, వాల్మీకి పూజరులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. -
మాటలొద్దు.. ఆచరణ కావాలి
ఊకదంపుడు ఉపన్యాసాలు కాకుండా..పురుషులతో సమానంగా అవకాశాలు కల్పిస్తేనే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. మహిళలు విద్య, ఆర్థిక, సామాజిక రాజకీయరంగాల్లో ఎదగాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ఆకాంక్షించారు. ఆడపిల్లల పెంపకంపై తల్లిదండ్రులు, సమాజంలో మార్పు రావాలని కోరారు. గద్వాల ఎమ్మెల్యేగా మూడుసార్లు వరుసగా విజయం సాధించి, గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం తపిస్తూనే.. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్న ఆమె శనివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి, గద్వాల: ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడాలి. నేటి సమాజంలో మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.. అన్నిరంగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. అంతరిక్షంలోనూ అడుగుపెడుతున్నారు. అయినప్పటికీ మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ఏదో మూలన దాడులు, అత్యాచారాలు, హింస, వేధింపులు చోటుచేసుకుంటున్నాయి. స్త్రీలను బలహీనులుగా చూడడం సమాజానికి అలవాటుగా మారింది. అసమానతలకు అడ్డుకట్టవేయాలంటే మహిళలు నిర్ణయాత్మకశక్తిగా అవతరించాలి. పుట్టినిల్లు, మెట్టినిల్లు రాజకీయ నేపథ్యమే.. పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండూ కూడా రాజకీయ నేపథ్యం ఉన్నవే. మా నాన్న దివంగత నర్సిరెడ్డి మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నక్సల్స్ కాల్పుల్లో చనిపోయారు. నేను మొదటి సంతానం కాబట్టి నాన్న చాలా గారాబంగా పెంచారు. పెంపకంలోనూ మా తమ్ముళ్లతో సమానంగా చూశారు. ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు భరతసింహారెడ్డితో నా వివాహమైంది. అప్పటికే మామ సత్యారెడ్డి, బావ సమరసింహారెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. భరతసింహారెడ్డి గద్వాల ఎమ్మెల్యేగా పనిచేశారు. నా భర్త ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో రాణిస్తున్నాను. ప్రతి నిర్ణయంలోనూ ఆయన సలహాతో పాటు నియోజకవర్గ ప్రజలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాను. రాజకీయ రంగప్రవేశం 1999లో మొదటగా జెడ్పీచైర్మన్ అభ్యర్థిగా పాన్‌గల్ నుంచి జెడ్పీటీసీగా పోటీచేసి విజయం సాధించాను. రెండుసీట్ల తేడాతో జెడ్పీచైర్మన్ కాలేపోయాను.. జెడ్పీటీసీగా ఉన్నప్పుడే జిల్లా ప్రాజెక్టుల కోసం పాదయాత్ర చేశాను.. హైదరాబాద్ వరకు జరిగిన ఈ యాత్రలో అప్పట్లో వైఎస్సార్ కూడా పాల్గొన్నారు. వేలాది మంది ప్రజలు, మహిళలు ఇందులో భాగస్వాములయ్యారు. ఆర్డీఎస్‌పైనా ఆరురోజుల పాటు ఆమరణదీక్ష చేపట్టాను. 2004లో ఇండిపెండెంట్‌గా గద్వాల ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందాను. ప్రాజెక్టుల కోసం చేసిన పాదయాత్ర, నిరాహారదీక్ష చేయడంతోనే ప్రజలు ఆదరించారు. అలాగే 2009, 2014లోనూ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను.. మంత్రిగా పనిచేశాను. ఎన్నో సాధించా.. జిల్లాకు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించి 2012నుంచి సాగుకు నీళ్లు ఇస్తున్నా.. హైడల్ పవర్ ప్రాజెక్టులు, మహిళా డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాఠశాలలు, అన్ని మండలాలకు జూనియర్ కళాశాలలు, హాస్టళ్లు, ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు. బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేయించాం. మహిళా ప్రజాప్రతినిధిని అయినప్పటికీ నిబద్ధత, పట్టుదలతో పనిచేసి అన్నిరంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. కుటుంబ వ్యవస్థలో మార్పురావాలి కుటుంబ వ్యవస్థ నుంచే మార్పు రావాలి. కొడుకులతో సమానంగా కూతుళ్లను తల్లిదండ్రులు చదివించాలి. ఆసక్తి ఉన్న రంగంలో రాణించే విధంగా ప్రోత్సహించాలి. సమాజంలోనూ మార్పురావాలి. ‘మహిళల కోసం అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం..’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో ఒరిగేదేమీ ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించింది. కాబట్టే నేడు మహిళలు రాజకీయాల్లో రాణించగలుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్లో ఆరుగురు మంది మహిళా మంత్రులుగా ఉన్నాం. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. ప్రభుత్వ ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలి దేశంలో మహిళల కోసం ఎన్నోచట్టాలు ఉన్నా వాటిని అమలు చేయడంలోనే నిర్లక్ష్యం ఉంది. ఎన్ని బలమైన చట్టాలు వచ్చినా మహిళలపై ప్రతి రోజూ ఎక్కడో అక్కడ దాడులు, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని అరికట్టాలంటే వ్యవస్థ, సమాజంలోని అందరి ఆలోచనల్లో మార్పురావాలి. విద్యార్థి దశనుంచే మగపిల్లల ఆలోచనల్లో స్త్రీపట్ల గౌరవాన్ని పెంపొందించే విధంగా విద్యావ్యవస్థను రూపొందాలి. మహిళలను ప్రోత్సహిస్తే మహిళలు సమాజంలో పురుషులతో సమానంగా రాణిస్తారు. మహిళలు రాజకీయాల్లోకి రావాలి మహిళలు, ప్రధానంగా యువ మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలకు నిబద్ధత, అంకితభావం ఎక్కువగా ఉంటాయి. మహిళ తన కుటుంబాన్ని చక్కదిద్దుకున్నట్లుగానే రాజకీయాల్లోకి వస్తే తన పరిధిలో ఉన్న వ్యవస్థనూ చక్కదిద్దుతారు. దీనిని ఎంతో మహిళామూర్తులు నిరూపించారు. చక్కటిపాలన అందించే శక్తి ఉం దని నిరూపించారు. చట్టసభల్లో మహిళల సంఖ్యాబలం ఉన్నప్పుడే హ క్కులు సాధించుకోవడానికి వీలవుతుంది. నేను మహిళా ప్రజాప్రతినిధిగా ఉండటంతో ఎంతోమంది మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారు. పాల నావ్యవస్థలో మహిళలు భాగస్వాములైతేనే వ్యవస్థలో మార్పు వస్తుంది. -
రైతుల ఆందోళన కనపడదా: డీకే అరుణ
పంటలు కొనుగోలు చేసేవారు లేక రైతులు ఆందోళన పడుతున్నారని, రైతుల గోస టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనపడదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ ప్రశ్నించారు. రైతును రాజు చేస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్, వారి సమస్యలను ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. వేరుశనగ ధర గతేడాది ఇదే సమయంలో క్వింటాలుకు రూ.4,600 ఉందని, ఇప్పుడు గద్వాల మార్కెట్లో రూ.1,600కే కొంటున్నారని అన్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు అప్పుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
చేనేతను జీఎస్టీ నుంచి మినహాయించాలి
ఎమ్మెల్యే డీకే అరుణ సాక్షి, హైదరాబాద్: జీఎస్టీతో చేనేత వస్త్ర పరిశ్రమపై తీవ్ర భారం పడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయం లో ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను డీకే అరుణ, గద్వాల చేనేత ఉత్పత్తిదారుల సంఘం నేతలు కలసి జీఎస్టీ వల్ల వచ్చే ఇబ్బందులపై వినతిపత్రం సమర్పిం చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ గద్వాల చీరలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచా యని, ఈ పరిశ్రమపై 30 వేల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. జీఎస్టీతో జాబ్ వర్క్‌పై ట్యాక్స్ విధించడం వల్ల ఉత్పత్తుల ధరలు పెరిగి మార్కెట్లో అమ్మకాలపై ప్రభావం పడుతుందన్నారు. జీఎస్టీ నుంచి చేనేత పరిశ్రమను మినహా యించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు అక్కల శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు సురేశ్, తిరుమల రవి, ప్రధాన కార్యదర్శి సంగ మహేశ్, దూడం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
డీకే అరుణ భర్తకు నేతల పరామర్శ
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ భర్త భరత్ సింహారెడ్డిని పలువురు నేతలు పరామర్శించారు. మంత్రి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డిలు గురువారం భరత సింహారెడ్డిని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భరతసింహారెడ్డి త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. కాగా భరత్‌సింహారెడ్డి బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న కారులో బెలూన్లు సకాలంలో తెరుచుకోవడంతో ప్రాణా పాయం తప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అప్పటికే రెండు కార్లు ఢీ కొనగా, భరతసింహా రెడ్డి ప్రమాణిస్తున్న కారు అందులో ఓ కారును ఢీ కొంది. దీంతో ఆయన ప్రయాణిస్తున్న కారు పూర్తిగా ధ్వంసం కాగా, భరతసింహారెడ్డి ఎడమ చేతికి గాయమైంది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. -
ఎమ్మెల్యే డీకే అరుణ భర్తకు గాయాలు
మరికల్ మండలం జక్లేర్ వద్ద ఎదురెదురుగా రెండు కార్లు ఢీ - ఆ కార్లలో ఒకదానిని ఢీకొట్టిన భరతసింహారెడ్డికారు.. - బెలూన్లు తెరుచుకోవడంతో తప్పిన ప్రాణాపాయం - మొత్తం ఏడుగురికి గాయాలు మహబూబ్‌నగర్ క్రైం/మరికల్: గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ భర్త భరత్‌సింహారెడ్డి బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారులో బెలూన్లు సకాలంలో తెరుచుకోవడంతో ప్రాణా పాయం తప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అప్పటికే రెండు కార్లు ఢీ కొనగా, భరతసింహా రెడ్డి ప్రమాణిస్తున్న కారు అందులో ఓ కారును ఢీ కొంది. దీంతో ఆయన ప్రయాణిస్తున్న కారు పూర్తిగా ధ్వంసం కాగా, భరతసింహారెడ్డి ఎడ మ చేతికి గాయమైంది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలం ఎలిగండ్ల స్టేజీ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగింది. హైదరాబాద్ బల్కంపేటకు చెందిన అనురాగ్, మనుశ్రీతోపాటు వారి డ్రైవర్ యాదగిరిలు కర్ణాటక రాష్ట్రం రాయిచూర్‌లో మనుశ్రీ ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్స రం ఫీజు చెల్లించి తిరిగి ఏపీ 09 సీఎం 1181 నంబరు కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. మిర్యాలగూడకు చెందిన సబిత ఆమె డ్రైవర్ మిర్యాలగూడ నుంచి రాయిచూర్ కు టీఎస్ 09 ఈఎన్ 4347 కారులో వెళ్తున్నారు. మరికల్ మండలం ఎలిగండ్ల సమీపంలోకి రాగానే ఈ రెండు కార్లు అతివేగంగా ఎదురెదురుగా ఢీకొ న్నాయి. దీంతో టీఎస్09 ఈఎస్4347 కారు పక్కనే ఉన్న గుంతలోకి దూసుకుపోయింది. మక్తల్ మండలం జక్లెర్లో ఓ బంధువు అంత్యక్రియలకు వెళ్లిన భరత్‌సింహారెడ్డి కారులో తిరిగి గద్వాలకు వెళ్తుండగా ఎలిగండ్ల స్టేజీ సమీపంలో అప్పటికే ప్రమాదానికి గురైన ఏపీ 09 సీఏం 1181 కారును ఢీకొట్టి పంటపొలా ల్లోకి దూసుకుపోయింది. దీంతో భరత్ సింహా రెడ్డికి ఎడమ చెయ్యి, డ్రైవర్ భాస్కర్‌కు కుడి చెయ్యికి గాయాలయ్యాయి. వీరిద్దరిని చికిత్స కోసం ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా ఏపీ 09సీఏం1181కారులో ఉన్న అనురాగ్, మనుశ్రీ, యాదగిరిలకు గాయాలు కావడంతో జనరల్ ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న ఇద్దరినీ ఎస్వీఎస్కు తరలించారు. -
'టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి'
గద్వాల: త్వరలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలను ప్రదర్శిస్తోందని, ఈ కుటిల రాజకీయాలను అడ్డుకోవాలని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓడించి తగిన బుద్ది చెప్పాలన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయాలు చేయలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం నిబంధనలను తుంగలో తొక్కుతూ నీతిమాలిన రాజకీయాలకు దిగుతుందని ఆరోపించారు. సాధారణ ఎన్నికల మాదిరిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను సవాల్‌గా తీసుకుంటూ ఈ ఎన్నికలకు రాజకీయ రంగు పులుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులకు, గతంలో పనిచేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు టీఆర్ఎస్ కండువాలు కప్పుతూ పార్టీలోకి ఆవాహ్వనించడంతో పాటు స్వయంగా ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గోనడం విడ్డురంగా ఉందని విమర్శించారు. తమ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని, ఓటేయకపోతే ఇబ్బందులు తప్పవనే ధోరణికి పాల్పడుతూ ఉపాధ్యాయులను భయందోళనకు గురిచేస్తున్నారని ఆమె విమర్శించారు. మేధావి వర్గం అయిన ఉపాధ్యాయులకు తమ నాయకుడిని ఎన్నుకునే సత్తా ఉందని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీని ఎన్నుకునే భాద్యతను ఉపాధ్యాయులకే వదిలివేయాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ బకాయిలు, డీఎస్సీ నోటిఫీకేషన్, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, నియమకాలు వంటి హమీలను అమలు చేయకుండా నాన్చుడు దోరణిని అవలంభిస్తున్న ప్రభుత్వ తీరును ఎక్కడిక్కడ ఎండగట్టాలని ఆమె పిలుపునిచ్చారు. దక్షిణ తెలంగాణపై సీఎం దృష్టి సారించాలి అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ సమన్యాయం చేయాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గజ్వేల్ నియోజకవర్గానికే పరిమితం అవుతూ ఇతర ప్రాంతాలకు మొండి చెయ్యి చూపుతున్నారని డీకే అరుణ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను కూడా అభివృద్ది బాటలో నడిపించి ఆదర్శ నియోజకవర్గాలుగా తీర్చిదిద్దాలన్నారు. గజ్వేల్‌తో పాటు గద్వాల్‌ను కూడా ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని కోరారు. సీఎం ఉత్తర తెలంగాణనే కాదు అన్నింట్లో వెనకబడిన దక్షిన తెలంగాణపై దృష్టిసారించి ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ది చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్, మహబూబ్‌నగర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్లోర్ లీడర్ కట్ట రవికిషన్‌రెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మణ్‌యాదవ్, ఖాజాపాష, గంజి ఆంజనేయులు, షబ్బిర్, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తట్టెడు మట్టి ఎత్తకుండా.. 50 వేల కోట్లా!
అంచనాలు అమాంతం పెంచేశారు పాలమూరు ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశం టీఆర్ఎస్ సర్కారు తీరుపై రాజకీయ పార్టీల మండిపాటు హైదరాబాద్: నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం నిధుల దోపిడీకి పాల్పడుతోందని రాజకీయ పక్షాల రౌండ్ టేబుల్ సమావేశం మండిపడింది. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం తప్పుడు గణాంకాలను వెల్లడిస్తోందని అభిప్రాయపడింది. ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న అవినీతి ఏరులై పారుతోందని, పరిపాలనలో ఎక్కడా పారదర్శకత లేదని ఆయా పార్టీలు విమర్శించాయి. పాలమూరు - రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టు విషయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే ఆరుణ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అన్ని రాజకీయ పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు దామోదర రాజనర్సింహ, బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి, టీడీపీ నేత రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంజనీర్లు ఈ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టు కోసం ఎందుకు గ్లోబల్ టెండర్లు పిలవలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఒక ఇంట్లో కూర్చొని తమకు కావాల్సిన వారికి టెండర్లు ఫైనల్ చేశారని దుయ్యబట్టారు. తట్టెడు మట్టి ఎత్తకుండా ప్రాజెక్ట్ అంచనాలు 50 వేల కోట్ల రూపాయలకు పెంచడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, ఈ రాష్ట్రంలో ప్రాజెక్ట్స్ కట్టింది కాంగ్రెస్ పార్టీ అనీ, ప్రాజెక్టులను అడ్డుకుంటోంది కాంగ్రెస్ అని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో సాగు, తాగు నీటి ప్రాజెక్ట్స్ కట్టేందుకు ప్రభుత్వంతో కలిసి వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రాజెక్ట్స్ పేరుతో దోపిడీ చేయాలనే మీ ఆగడాలను అడ్డుకొని తీరుతామన్నారు. నిపుణుల కమిటీ అభ్యంతరాలు తెలిపినా .. నవయుగ కంపెనీ అడిగిన మేరకే పనులు మంజూరు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రం నా జాగీరు తరహాలో కెసిఆర్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. భావి తెలంగాణా ప్రజల భవిష్యత్తు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ప్రాజెక్ట్స్ కడుతున్నప్పుడు .. తప్పులు జరుగుతుంటే ప్రశ్నించడం తప్పా. శాశ్వితంగా రాష్ట్రాన్ని తప్పుల ఉబిలోకి నెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని, ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వం నిజమైన అంకెలు దాచిపెడుతోందని విమర్శించారు. ప్రాజెక్ట్ ల పేరు కేసీఆర్ తెలంగాణ దోపిడీకి పాల్పడుతున్నారని డీకే ఆరుణ విమర్శించారు. జిల్లా లోని పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తే కాంగ్రెస్ కు పేరు వస్తుందని వాటిని పక్కన బెట్టారన్నారు. కొత్త ప్రాజెక్ట్ లు కొత్త కాంట్రాక్టర్లు, కొత్త కమిషన్ ల ఫార్ములతో ప్రభుత్వం దోచుకుంటుంతోందని దుయ్యబట్టారు. సర్కార్ తప్పులను, అవినీతిని ప్రశ్నిస్తే.. అడ్డుకుంటున్నారని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అబద్దాలు చెప్పడంలో మామను మించిన అల్లుడు హరీష్ రావు అని, పాలమూరు కు జలకల తెచ్చామంటూ.. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్ట్ లకు హరీష్ ప్రారంభోత్సవాలు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రోజెక్టు ద్వారా ఒక్క విద్యుత భారమే 1600 కోట్లు వాస్తవం కాదా..? పాలమూరు రంగారెడ్డి పార్జిక్ట్స్ అలైన్ మెంట్ తో కల్వకుర్తి ప్రాజెక్ట్ కెలాల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దెబ్బత్న్తుందని .. జూపల్లి తో సహా తెరాస ఎమ్మెల్యేలు సీఎం కు లేఖ రాశారు. కేసీఆర్ ఆంద్ర కాంట్రాక్టర్లతో తెలంగాణ ను దోచుకుంటున్నది వాస్తవం కాదా..? కేసీఆర్ సీఎం లా కాకుండా జోకర్ లా మాట్లాడుతున్నారు. న్యాయం కోసం భూనిర్వాసితులు కోర్ట్ కు వెళితే తప్పా..? తాగునీటి ప్రాజెక్ట్ అని ప్రభుత్వం ఆఫీడౌట్ ఇచ్చింది నిజం కాదా..? పాలమూరు ప్రాజెక్ట్.. త్రాగునీటి ప్రొజెసినా.. సాగునీటి ప్రాజెకట్టా..? ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. పాత డిజైన్ తోనే ప్రాజెక్టు నిర్మాణం జరగాలి. .ప్రాజెక్టు నిర్మాణం పై సమగ్ర చర్చ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది తెలంగాణ రాష్ట్రం కాదు, తన రాజ్యం అనుకుంటున్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే ప్రభుత్వ లోపాల పై ప్రశ్నిస్తున్నామని, ప్రాజెక్ట్ లలో పారదర్శకత ఉండాలనడం నేరమా..? ప్రాజెక్టుల్లో మార్పు పై తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడారా? కేసీఆర్ కు బేతాళ మాంత్రికుడు దగ్గరయ్యాకే.. కేసీఆర్ ప్రాజెక్ట్ ల మార్పును తెరపైకి తెచ్చారని అన్నారు. ప్రభుత్వ తప్పిదాలను సమర్థిస్తే చరిత్ర తమను క్షమించదని వ్యాఖ్యానించారు. దోచుకున్న డబ్బుతో కేసీఆర్ కుటుంబం దేశం విడిచి ఎక్కడికైనా పారిపోయే అవకాశమందన్నారు. అందుకే కేటీఆర్, కవితలు దేశాలు చుట్టొస్తున్నారన్నారు. పది పైసలు వడ్డీకి తీసుకునేందుకు అల్లుడు హరీష్ దగ్గర కోట్ల రూపాయలు మూలుగుతున్నాయని, కేసీఆర్ బ్యాంకుల చుట్టు తిరిగేకంటే హరీష్ ను అడిగితే సరిపోతుందని ఎద్దేవా చేశారు. భూసేకరణ జరగకుండా, 200 కోట్ల బిల్లులను డ్రా చేసిన వారిని బేడీలేసి అరెస్ట్ చేయాలన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ను ఎకరాకు 10లక్ష ల చొప్పున అమ్మేందుకు కేసీఆర్ సిద్ధమా ? డీల్ కు ఒప్పుకుంటే 48 గంటల్లో డబ్బులు ఇచ్చెందుకు తాను సిద్ధమని రేవంత్ సవాలు చేశారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో అవినీతికి పాల్పడిన కేసీఆర్ కు జైలు తప్పదని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు. ప్రాజెక్టుల విషయంలో తాను వేస్తున్న ప్రశ్నలు తప్పు అని తేల్చితే తాను రాజకీయాలనుండి తప్పుకుంటా..? మధుకోడా, శశికలకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందన్నారు. మెగా కంపెనీ కోసం అర్హతలను మార్చిన ఘనుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. కేసీఆర్ అవినీతిపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. -
గద్వాల ప్రజల ఆకాంక్ష ఫలించింది
సీఎంకు ధన్యవాదాలు: డీకే అరుణ గద్వాల: నడిగడ్డ ప్రజల చిరకాలవాంఛ తీరిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. గద్వాల జిల్లా ప్రజల ఆకాంక్షను టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించిందని, జిల్లా ఏర్పాటుకు అంగీకరించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఆమె మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలోని తన నివాసంలో అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు స్థానిక రాజీవ్ సర్కిల్లో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తన రాజీనామా ద్వారా ప్రజల ఆకాంక్షను సీఎం మనస్ఫూర్తితో ఆలోచించి జిల్లా ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారన్నారు. తుది ముసాయిదాలో గద్వాల కేంద్రంగా జోగుళాంబ జిల్లా చేయాలని ఆమె కోరారు. నవరాత్రి ఉత్సవాల్లో గద్వాల జిల్లా ప్రకటన రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వానికి, గద్వాల జిల్లా ప్రజలకు జోగుళాంబ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయన్నారు. గద్వాల జిల్లా సాధన కోసం అన్ని విధాలుగా ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో సఫలమయ్యామని తెలిపారు. ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు, వేల సంఖ్యలో అభ్యంతరాలతో జిల్లా ఆకాంక్షను చాటిచెప్పి చివరి అస్త్రంగా రాజీనామా చేశామన్నారు. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్‌ను తప్పుదోవ పట్టించడం వల్లనే ముసాయిదా నోటిఫికేషన్లో గద్వాల జిల్లా ప్రస్తావన లేదన్నారు. పదవులు శాశ్వతం కాదు.. ప్రజలే శాశ్వతమని కేసీఆర్ పేర్కొనడంపై ఆమె హర్షం వ్యక్తంచేశారు. -
రెండోరోజూ గద్వాల బంద్
–ప్రజల నుంచి స్వచ్ఛందంగా మద్దతు – తెరచుకోని విద్యా, వ్యాపార సంస్థలు, దుకాణాలు – బంద్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే డీకే అరుణ గద్వాల న్యూటౌన్ : గద్వాలను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ.. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 72 గంటల బంద్ రెండోరోజు శనివారం సంపూర్ణంగా జరిగింది. ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. సినిమా థియేటర్లు, పాఠశాలలు, పెట్రోల్ బంక్‌లు, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. తెల్లవారుజాము నుంచే జేఏసీ నాయకులు ద్విచక్రవాహనాలపై పట్టణంలో కలియ తిరుగుతూ బంద్‌కు సహరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ తీసి.. కష్ణవేణి చౌక్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో గద్వాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. చేసిన తప్పును ప్రభుత్వం సరిచేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా గద్వాల జిల్లా సాధించే వరకు ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డీకే అరుణ, పుర చైర్పర్సన్ పద్మావతి, జేఏసీ నాయకులు వెంకట్రాములు, వీరభద్రప్ప, వెంకటరాజారెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, నాగరాజు, రాజశేఖర్‌రెడ్డి, అతికూర్‌రహ్మన్, మున్నాభాష, రాములు, కష్ణారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
రెండోరోజూ గద్వాల బంద్
ప్రజల నుంచి స్వచ్ఛందంగా మద్దతు తెరచుకోని విద్యా, వ్యాపార సంస్థలు, దుకాణాలు బంద్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే డీకే అరుణ గద్వాల న్యూటౌన్ : గద్వాలను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ.. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 72 గంటల బంద్ రెండోరోజు శనివారం సంపూర్ణంగా జరిగింది. ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. సినిమా థియేటర్లు, పాఠశాలలు, పెట్రోల్ బంక్‌లు, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. తెల్లవారుజాము నుంచే జేఏసీ నాయకులు ద్విచక్రవాహనాలపై పట్టణంలో కలియ తిరుగుతూ బంద్‌కు సహరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ తీసి.. కష్ణవేణి చౌక్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో గద్వాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. చేసిన తప్పును ప్రభుత్వం సరిచేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా గద్వాల జిల్లా సాధించే వరకు ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డీకే అరుణ, పుర చైర్పర్సన్ పద్మావతి, జేఏసీ నాయకులు వెంకట్రాములు, వీరభద్రప్ప, వెంకటరాజారెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, నాగరాజు, రాజశేఖర్‌రెడ్డి, అతికూర్‌రహ్మన్, మున్నాభాష, రాములు, కష్ణారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
గద్వాల జిల్లా కోసం పాదయాత్ర
ఎమ్మెల్యే డీకే అరుణ గద్వాల : నడిగడ్డ ప్రజల చిరకాల వాంఛ అయి న గద్వాలను జిల్లా సాధన కోసం జూలై 1వ తే దీన జాతీయ రహదారి దిగ్బంధం.. మొదటి వారంలో అలంపూర్‌లోని జోగుళాంబ ఆలయం నుంచి గద్వాలలోని జములమ్మ ఆలయం వరకు పాదయాత్ర చేపడుతామని ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. శుక్రవారం డీకే బంగ్లా ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ సంఘాలు, రాజకీయ పక్షాల నాయకుల సమావేశంలో ఆమె పా ల్గొని మాట్లాడారు. గద్వాల జిల్లా కోసం మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు, నర్వ తదితర ప్రాంతాల ప్రజలు కూడా మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. అల్లుడు కోసం.. కొడుకు కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజా ఆమోదం ఉన్న గద్వాలను జిల్లా చేయడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఒక వ్యక్తి కోసం వనపర్తిని జిల్లా చేయడంలో చూపిస్తున్న ఆసక్తి.. మూడు నియోజకవర్గాల ప్రజలు కోరుతున్న గద్వాలను జిల్లా చేయడానికి ఎందుకు ఆసక్తి చూపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్వాల జిల్లా ఏర్పాటును విస్మరిస్తే కేసీఆర్ జోగుళాంబ అమ్మవారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలపై ఒత్తిడి పెంచి ఉద్యమంలో భాగస్వాములను చేయాలని తీర్మానించారు. సమావేశంలో చైర్పర్సన్ పద్మావతి, చుక్కా లింగారెడ్డి, కొంకల నాగేశ్వర్‌రెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, నందిన్నె ప్రకాష్‌రావు, నాగరా జు, వివిధ మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. స్వార్థపూరితంగా జిల్లాల ఏర్పాటు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం.. స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ నూతన జిల్లాలను ఏర్పాటు చేయడానికి కుట్ర పన్నుతుందని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డీకే అరుణతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ప్రభుత్వం వివక్ష చూపుతుందని మండిపడ్డారు. జిల్లాల ఏర్పాటుపై అధికారులు ఏ ప్రాంతంపై వివక్ష చూపకుండా నిష్పక్షపాతంగా ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సూచించారు. గద్వాల జిల్లా సాధన కోసం జూలై 1 నుంచి చేపట్టే ఆందోళనలకు అలంపూర్ నియోజకవర్గ ప్రజల పక్షాన తమవంతు సంపూర్ణ సహకారాలు అందిస్తామన్నారు. -
దమ్ముంటే రాజీనామా చేసి గెలువు
సోదరుడు చిట్టెంకు డీకే అరుణ సవాల్ మక్తల్ : తన సోదరుడు, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పార్టీ మారినంత మాత్రాన కాంగ్రెస్‌కు నష్టమేమి జరగదని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ఆదివారం ఆమె మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో సోదరుడిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘ మేం గెలిపిస్తే నీవు ఎమ్మెల్యే అయ్యావ్.. లేకుంటే నీకు ఆ పదవి ఎక్కడి నుంచి వచ్చింది.. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో’ అని పేర్కొన్నారు. తమ తండ్రి నర్సిరెడ్డి ఆశయ సాధనకు పార్టీ మారానని చెప్పుకోవడం సిగ్గుచేటని, వచ్చే ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గంపై కాంగ్రెస్ జెండా ఎగరాలే.. కార్యకర్తలు ఇప్పటి నుంచి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
కరువు నివారణలో విఫలం: డీకే అరుణ
పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లాలో కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ధ్వజమెత్తారు. సోమవారం ఆమె మహబూబ్‌నగర్ డీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని, గ్రామాల్లో పశువులకు, మనుషులకు తాగునీరు లేదని, సీఎం కేసీఆర్ కరువు, రైతులపైన మాట్లాడకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ పనులు గ్రామాల్లో సక్రమంగా జరగడం లేదని, పాలమూరు ఎత్తిపోతల పథకం సర్వేకు పిలిచిన టెండర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. -
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న డీకే అరుణ
బాలరాజు, వెంకటేశ్వర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జి.బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే తమకు పుట్టగతులుండవనే ఉద్దేశంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో వారు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవులకు రాజీనామా చేయకుండా డీకే అరుణ పారిపోయారని, జూపల్లి కృష్ణారావు త్యాగం చేశారని, అలాంటి చరిత్ర ఉన్న ఆమె మంత్రి జూపల్లిపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తనకు, చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి ఎలాంటి విభేదాలు లేవని, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సంఘటన అనుకోకుండా జరిగిందని బాలరాజు తెలిపారు. -
ఎమ్మెల్యే డీకే అరుణపై ఫిర్యాదు
చైతన్యపురి: రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఎమ్మెల్యే డీకే అరుణ అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలంగాణ అడ్వకేట్ జే ఏసీ నాయకులు ఆదివారం చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాంధీభవన్‌లో జరిగిన ప్రెస్ మీట్లో అరుణ మాట్లాడుతూ మంత్రి జూపల్లి పిల్లిలాంటివాడన్నారని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ప్రజలతో ఎన్నుకోబడి, మంత్రిగా సేవలందిస్తున్న వ్యక్తిని ఉద్దేశించి అనుచితంగా మాట్లాడం వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అడ్వకేట్ జేఏసీ నాయకుడు గోవర్దన్‌రెడ్డి మరికొందరు ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించామని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ గురురాఘవేంద్ర తెలిపారు. -
జూపల్లి... జూలో పిల్లి: డీకే అరుణ
హైదరాబాద్: జూలో పిల్లి లాంటి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే డి.కె.అరుణ వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత అవసరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారే జూపల్లికి తన ను విమర్శించే స్థాయి లేదన్నారు. స్థాయి, వ్యక్తిత్వం లేని ఆయన మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడితే స్పందిస్తానని అరుణ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, రీడిజైన్లు, అంచనాలు వంటి వాటిలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపించారు. అక్ర మాలు అడ్డుకోవడానికి కాపలా కుక్కల్లా పనిచేస్తామని ఆమె అన్నారు. -
ఉనికి కోసమే పిచ్చి ఆరోపణలు
డి.కె.అరుణపై జూపల్లి మండిపాటు సాక్షి, హైదరాబాద్: కేవలం ఉనికి చాటుకోవడం కోసమే కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. టీఆర్ఎస్లో చేరడం కంటే బిచ్చమెత్తుకుని బతుకుతానని డి.కె.అరుణ చే సిన ప్రకటనపైనా మంత్రి స్పందించారు. ‘బిచ్చం ఎత్తుకోవడం కాదు, బిచ్చం ఎత్తుకునే వాళ్లను కూడా దోచుకునే నైజం వారిది’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మాజీ ఎంపీ మందా జగన్నాథం, ఎమ్మెల్యే అంజయ్యతో కలసి విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ను చూసి కాదని, కాంగ్రెస్ మాటలను చూసే రాష్ర్ట ప్రజలు సిగ్గుపడుతున్నారని జూపల్లి అన్నారు. అధికారం, పదవులే నైజంగా బతికిన వాళ్లు కాంగ్రెస్ నాయకులని విమర్శించారు. తరతరాలకు తరగని డబ్బులు సంపాదించుకున్నారని, తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ఏనాడూ కలసి రాని వాళ్లు తమకు చెప్పేదేందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. డి.కె. అరుణ సోదరుడు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్లో చేరినా విమర్శిస్తున్నారని, చిట్టెం చేరికపై డి.కె.అరుణ, జానారెడ్డి ఎక్కడ లేని బాధను వెళ్లగక్కుతున్నారని మండి పడ్డారు. సీఎల్పీ పదవో, లేక పీసీసీ పదవో వస్తుందనే ఆశతోనే అరుణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారని, ఆ ఆశకూడా పోతే వారి దారికూడా ఇటే అని మంత్రి జూపల్లి వ్యాఖ్యానించారు. మరికొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. కాగా, నైతిక విలువలు ఉన్న వారు వాటి గురించి మాట్లాడితే మంచిదని మాజీ ఎంపీ మందా జగన్నాథం సూచించారు. -
విత్తన పత్తి రైతులకు పరిహారం చెల్లించాలి
► ఎమ్మెల్యే డీకే ఆరుణ ► చలో అసెంబ్లీని భగ్నం చేసిన పోలీసులు దోమలగూడ : నష్టపోయిన గద్వాల విత్తన పత్తి రైతులకు కంపెనీలు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతాంగ సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు నుంచి రైతులు చేపట్టిన చలో అసెంబ్లీని పోలీసులు అడ్డుకొని అరెస్టులతో భగ్నం చేశారు. తెలంగాణ రైతాంగ సమితి, రైతు సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద వేర్వేరుగా రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం తెలంగాణ రైతాంగ సమితి ఆధ్వర్యంలో రైతులు ప్రదర్శనగా చలో అసెంబ్లీ చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు అనుమతి లేదంటూ రైతులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు బలవంతంగా రైతులను అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ధర్నాలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం, ఎమ్మెల్యే డీకే అరుణ, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం ఉపాధ్యక్షుడు టి. సాగర్, ప్రసాదరావు తదితరులు, రైతాంగ సమితి ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముడుపు నర్సింహరెడ్డి, సహాయ కార్యదర్శి జక్కుల వెంకటయ్య, నాయకులు సాయన్న, జి గోపాల్, పి రామిరెడ్డి, గోవింద్, శంకర్‌రెడ్డి మాట్లాడారు. గద్వాల డివిజన్లో ఆరు మండలాల్లో దాదాపు 50వేల ఎకరాల్లో 20వేల మంది రైతులు పత్తి విత్తనాలను పండిస్తారని, వీరికి కావేరి, అంకుర్, రాశి, బయోసీడ్, నూజివీడు, జేకే అగ్రి జెనిటిక్స్, సత్య తదితర కంపెనీలు విత్తనాలు సరఫరా చేస్తాయని అన్నారు. విత్తనపత్తికి కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం ప్రకారం రైతుకు, కంపెనీకి రాతపూర్వక ఒప్పందం ప్రకారంగా జరగాలని, రైతుకు గిట్టుబాటు ధర, పెట్టుబడి, సాంకేతిక సహకారం కంపెనీ ఇవ్వాలని అన్నారు. రైతులను దోచుకుంటున్నారు విత్తన కంపెనీలు దళారుల ద్వారా రైతులకు విత్తనాలు సరఫరా చేస్తారని, వీరు రైతులు పండించిన విత్తనాల ధర విషయంలోనూ, పెట్టుబడి కోసం ఇచ్చిన డబ్బులపై వడ్డీరూపంలో రైతులను దోచుకుంటున్నారని అన్నారు. రెండు దశాబ్దాలుగా గద్వాలలో కొనసాగుతున్న దోపిడి ఇది అని వాపోయారు. విత్తన బాంఢాగారం గురించి హోరె త్తిస్తున్న ప్రభుత్వం విత్తన కంపెనీల వల్ల మోసపోయిన రైతుల గురించి నోరు మెదపక పోవడం శోచనీయమన్నారు. గద్వాలలో విత్తన కంపెనీలు, దళారులు కలిసి రైతులపై కొనసాగిస్తున్న దోపిడీ, దౌర్జన్యాలకు బంగారు తెలంగాణలోనూ అంతం లేదా? అంటూ ప్రశ్నించారు. కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం ఇచ్చిన జీఓ 458ని అమలు చేయక పోవడాన్ని చూస్తే కంపెనీల ప్రభుత్వమా, ప్రజా ప్రభుత్వమా అనే సందేహం కలుగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం కంపెనీలు రైతులకు 60 శాతం పెట్టుబడి న ష్టాన్ని పరిహారంగా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ఇంటింటికీ నల్లానీరు
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి వనపర్తి టౌన్ : మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఆగస్టు చివరి నాటికి మొదటి విడతగా వనపర్తి, గద్వాల, అలంపూర్, కొల్లాపూర్ నియోజకవర్గాలకు ఇంటింటికి నల్లానీరు అందిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పట్టణంలోని మహిళా సంఘాలకు సిలిండర్లను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. వనపర్తిని జిల్లా చేయాలని పదేళ్ల కిందటే టీఆర్ఎస్లోతాను ప్రతిపాదన చేశాననీ, ఎన్నికల ప్రచారంలో వనపర్తికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా చేస్తామని హామీఇచ్చారని గుర్తుచేశారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, మరి కొందరు తాత్కాలిక ప్రయోజనాల కోసం చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని, లేనిపోని డిమాండ్లు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. వనపర్తిలో రోడ్ల విస్తరణకు సంబంధించిన ఫైల్ మునిసిపల్ శాఖలో సిద్ధంగా ఉందని, త్వరలోనే నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వనపర్తి పుర చైర్మన్ పలుస రమేష్‌గౌడ్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గట్టుయాదవ్, పుర మాజీ చైర్మన్ లక్ష్మయ్య, కౌన్సిలర్లు ఆర్. లోక్‌నాథ్‌రెడ్డి, ఆవుల రమేష్, సతీష్‌యాదవ్, పాకనాటి కృష్ణ, పీడీ కమలమ్మ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివారం సెలవు సీఎంకేనా?: డీకే
సాక్షి, హైదరాబాద్: గతంలో ఎప్పుడూ లేనివిధంగా అసెంబ్లీ సమావేశాలను ఆదివారం నిర్వహిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సభలో లేకుండా పోయారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీల్లో తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడుతూ ఆదివారం వస్తే నియోజకవర్గానికి పోవడమో లేకుంటే కుటుంబసభ్యులతో గడపటమో సహజమన్నారు. కేసీఆర్‌కు ఉన్న ఆదివారం సెలవు సభ్యులకు వద్దా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను చర్చించకుండా సభను మొక్కుబడిగా నడిపించడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడం తప్ప ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు. -
గద్వాల.. ఆకాంక్షను గుర్తించాలి
గద్వాల : గద్వాల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా టీఆర్ఎస్ నాయకులు వ్యవహరించడం లేదని ఎమ్మెల్యే డీకే అరుణ ధ్వజమెత్తారు. గద్వాల జిల్లా సాధన కోసం ఉద్యమించకపోతే గ్రామాల్లో తిరగలేని పరిస్థితిని టీఆర్ఎస్ నాయకులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గద్వాల జిల్లా కాంక్షిస్తూ చేపట్టిన నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే డీకే అరుణ సందర్శించి మాట్లాడారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులకు సంపాదన, స్వలాభం తప్ప ప్రజల ఆకాంక్ష పట్టడం లేదని విమర్శించారు. వ్యక్తిగత సంపాదనపై చూపిస్తున్న శ్రద్ధ నడిగడ్డ ప్రగతిపై చూపడం లేదనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను, మనోభావాలను సీఎం కేసీఆర్ పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. జిల్లా ఆకాంక్షను చాటి చెప్పడానికే దీక్షలను కొనసాగిస్తున్నామన్నారు. దీక్షలో ఆర్టీసీ ఈయూ గౌరవ అధ్యక్షుడు రామాంజనేయులు, నాయకులు భాస్కర్, గౌస్, శేఖర్, కేకే రెడ్డి, రాములు, కిరణ్‌కుమార్, సత్యారెడ్డి, రామచంద్రుడులతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
‘పుర’ పోరు పట్టించుకోవద్దు
పీసీసీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వరుసగా వస్తున్న ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి రాష్ట్ర స్థాయిలో సమగ్ర వ్యూహం, పార్టీ నిర్దిష్ట కార్యక్రమాలకు దిశానిర్దేశం లేకుండా చేస్తున్నాయని కాంగ్రెస్ ముఖ్యులు భావిస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పీసీసీని నడిపించాల్సి ఉందని, ఎప్పటికప్పుడు వస్తున్న ఇలాంటి ఎన్నికలతో పార్టీకి ఇబ్బందులు వస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. ప్రతి పక్షంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న ఈ సమయంలో టీఆర్ఎస్పై రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేయడానికి చాలా అంశాలున్నాయని, వాటి నుంచి దృష్టిని మళ్లించే మరే ఇతర విషయాలను పట్టించుకోకుండా ఉండటమే మంచిదనే నిర్ణయానికి పీసీసీ వచ్చింది. ఖమ్మం, వరంగల్ నగర పాలక సంస్థల ఎన్నికల బాధ్యతలను ఆయా జిల్లాల ముఖ్యులకే అప్పగించాలని నిర్ణయించింది. స్థానిక ఎన్నికల్లో పార్టీ టికెట్లు, ప్రచార వ్యూహం, ఇతర ముఖ్యమైన అంశాల కోసం పరిశీలకులను ఖరారు చేసింది. ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో పరిశీలకులుగా ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ల ను, వరంగల్ కోసం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టివిక్రమార్క, మాజీ ఎమ్మెల్యే ఎం.కోదండరెడ్డిని నియమించారు. అచ్చంపేట మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యతలను ఎమ్మెల్యే డీకే అరుణతోపాటు జిల్లా పార్టీ నేతలకు అప్పగించారు. స్థానిక ఎన్నికల ఫలితాల్లో గెలుపోటముల నుంచి పార్టీ దృష్టిని మళ్లించే విధంగా కార్యక్రమాలకు పీసీసీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. మధ్యమధ్యలో వచ్చే ఎన్నికలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించకుండా ఎక్కడికక్కడ కార్యాచరణను నిర్దేశించాలని పీసీసీ సమన్వయ కమిటీ నిర్ణయించింది. ‘తమిళనాడులో ఏఐడీఎంకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపఎన్నికల్లో పోటీచేయలేదు. అయినా ఆ తరువాత వచ్చిన సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. అయితే పార్టీ అభ్యర్థులను, శ్రేణులను కాపాడుకోవడానికి పోటీచేయాల్సి వస్తోంది’ అని టీపీసీసీ ముఖ్యుడు వెల్లడించారు. -
'గద్వాలను జిల్లాగా చేయకుంటే యుద్ధమే'
మహబూబ్‌నగర్ : గద్వాలను జిల్లాగా ప్రకటించకుంటే ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ స్పష్టం చేశారు. జిల్లా నడిగడ్డగా ఉన్న గద్వాలకు జిల్లా అయ్యేందుకు అవసరమైన అన్ని అర్హతలున్నాయని చెప్పారు. కొత్తగా జిల్లాలను ఏర్పాటుచేయతలపెట్టిన ప్రభుత్వం గద్వాలను కూడా జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. గద్వాలను జిల్లా చేయాలని కోరుతూ ఆమె శుక్రవారం బీచుపల్లి ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. విద్య, వైద్య, రవాణాతోపాటు తాగు, సాగు నీటి వసతులన్నీ ఉన్నాయని ఆమె చెప్పారు. గద్వాలను జిల్లా కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జలదృశ్యం కాదు.. ఆత్మహత్యల దృశ్యం చూడండి
గవర్నర్‌కు డీకే అరుణ సూచన సాక్షి, హైదరాబాద్: ‘జలదృశ్యం కాదు, ముందుగా రైతు ఆత్మహత్యల దృశ్యాన్ని చూడండి’ అని రాష్ట్ర గవర్నర్‌కు మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ సూచించారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలు, రుణమాఫీపై చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం వంటివాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ జలదృశ్యం అంటున్నారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల సినిమాను ముందుగా చూపించి, ఆ తరువాత ఇంకే సినిమానైనా చూపించుకోవచ్చునన్నారు. రుణమాఫీని ఒకేసారి చేసేవరకు అసెంబ్లీలోనూ, ప్రజా క్షేత్రంలోనూ పోరాడుతామని హెచ్చరించారు. జలదృశ్యం అంటూ అసెంబ్లీలో సినిమాను చూపించడానికి గవర్నర్ అనుమతి ఇవ్వొద్దని కోరారు.