కరువు నివారణలో విఫలం: డీకే అరుణ
పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లాలో కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ధ్వజమెత్తారు. సోమవారం ఆమె మహబూబ్‌నగర్ డీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని, గ్రామాల్లో పశువులకు, మనుషులకు తాగునీరు లేదని, సీఎం కేసీఆర్ కరువు, రైతులపైన మాట్లాడకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ పనులు గ్రామాల్లో సక్రమంగా జరగడం లేదని, పాలమూరు ఎత్తిపోతల పథకం సర్వేకు పిలిచిన టెండర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.