గద్వాల న్యూటౌన్ : కష్ణవేణి చౌక్‌లో మానవహారం నిర్మించిన నాయకులు
రెండోరోజూ గద్వాల బంద్
Published Sat, Aug 27 2016 7:27 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
–ప్రజల నుంచి స్వచ్ఛందంగా మద్దతు
– తెరచుకోని విద్యా, వ్యాపార సంస్థలు, దుకాణాలు
– బంద్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే డీకే అరుణ
గద్వాల న్యూటౌన్ : గద్వాలను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ.. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 72 గంటల బంద్ రెండోరోజు శనివారం సంపూర్ణంగా జరిగింది. ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. సినిమా థియేటర్లు, పాఠశాలలు, పెట్రోల్ బంక్‌లు, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. తెల్లవారుజాము నుంచే జేఏసీ నాయకులు ద్విచక్రవాహనాలపై పట్టణంలో కలియ తిరుగుతూ బంద్‌కు సహరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ తీసి.. కష్ణవేణి చౌక్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో గద్వాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. చేసిన తప్పును ప్రభుత్వం సరిచేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా గద్వాల జిల్లా సాధించే వరకు ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డీకే అరుణ, పుర చైర్‌పర్సన్ పద్మావతి, జేఏసీ నాయకులు వెంకట్రాములు, వీరభద్రప్ప, వెంకటరాజారెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, నాగరాజు, రాజశేఖర్‌రెడ్డి, అతికూర్‌రహ్మన్, మున్నాభాష, రాములు, కష్ణారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement