Gadwal Dist
-
వెల్లువెత్తిన గద్వాల జిల్లా ఆకాంక్ష
– రెండోరోజు బంద్ సక్సెస్ గద్వాల న్యూటౌన్ : గద్వాల జిల్లా ఆకాంక్ష వెల్లువెత్తింది. జిల్లా ఏర్పాటునకు డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 72గంటల బంద్ రెండోరోజు శనివారం సక్సెస్ అయింది. ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించి పాల్గొన్నారు. సినిమా థియేటర్లు, పాఠశాలలు, పెట్రోల్ బంక్‌లు, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. తెల్లవారుజామున నుంచే జేఏసీ నాయకులు బైక్‌లపై పట్టణంలో తిరుగుతూ బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే డీకే అరుణ జేఏసీ నాయకులతో కలిసి పట్టణంలో తిరిగి, కష్ణవేణి చౌక్ వద్ద నిర్వహించిన మానవహారంలో పాల్గొన్నారు. డీకే అరుణ మాట్లాడుతూ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేపట్టిందని ఆరోపించారు. జనాభా దామాషా ప్రకారం చేపట్టలేదని, కనీస నిబంధనలు, ప్రమాణాలు పాటించలేదని, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని దుయ్యబడ్డారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ప్రభుత్వానికి ప్రజలంతా కలిసికట్టుగా వ్యవహరించి బుద్ది చెప్పాలన్నారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా కొత్తజిల్లాల నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆరోపించారు. గద్వాల జిల్లా సాధించేవరకు ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, వీరభద్రప్ప, వెంకటరాజారెడ్డి, రాజవర్దన్‌రెడ్డి, నాగరాజు, రాజశేఖర్‌రెడ్డి, అతికూర్‌రహ్మన్, మున్నాబాష, గంజిపేట రాములు, గడ్డంకష్ణారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో.. టీఆర్ఎస్ నాయకులు గద్వాల జిల్లా కోసం నదిఅగ్రహారం రోడ్డు మార్గంలోని ఆంజనేయస్వామి ఆలయంలో, జమ్మిచేడులోని జములమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుభాన్, బీఎస్ కేశవ్, వంశీ, మహిమూద్, మురళీ, కోటేష్, విజయ్, మధు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రెండోరోజూ గద్వాల బంద్
–ప్రజల నుంచి స్వచ్ఛందంగా మద్దతు – తెరచుకోని విద్యా, వ్యాపార సంస్థలు, దుకాణాలు – బంద్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే డీకే అరుణ గద్వాల న్యూటౌన్ : గద్వాలను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ.. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 72 గంటల బంద్ రెండోరోజు శనివారం సంపూర్ణంగా జరిగింది. ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. సినిమా థియేటర్లు, పాఠశాలలు, పెట్రోల్ బంక్‌లు, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. తెల్లవారుజాము నుంచే జేఏసీ నాయకులు ద్విచక్రవాహనాలపై పట్టణంలో కలియ తిరుగుతూ బంద్‌కు సహరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ తీసి.. కష్ణవేణి చౌక్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో గద్వాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. చేసిన తప్పును ప్రభుత్వం సరిచేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా గద్వాల జిల్లా సాధించే వరకు ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డీకే అరుణ, పుర చైర్పర్సన్ పద్మావతి, జేఏసీ నాయకులు వెంకట్రాములు, వీరభద్రప్ప, వెంకటరాజారెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, నాగరాజు, రాజశేఖర్‌రెడ్డి, అతికూర్‌రహ్మన్, మున్నాభాష, రాములు, కష్ణారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
రెండోరోజూ గద్వాల బంద్
ప్రజల నుంచి స్వచ్ఛందంగా మద్దతు తెరచుకోని విద్యా, వ్యాపార సంస్థలు, దుకాణాలు బంద్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే డీకే అరుణ గద్వాల న్యూటౌన్ : గద్వాలను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ.. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 72 గంటల బంద్ రెండోరోజు శనివారం సంపూర్ణంగా జరిగింది. ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. సినిమా థియేటర్లు, పాఠశాలలు, పెట్రోల్ బంక్‌లు, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. తెల్లవారుజాము నుంచే జేఏసీ నాయకులు ద్విచక్రవాహనాలపై పట్టణంలో కలియ తిరుగుతూ బంద్‌కు సహరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ తీసి.. కష్ణవేణి చౌక్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో గద్వాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. చేసిన తప్పును ప్రభుత్వం సరిచేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా గద్వాల జిల్లా సాధించే వరకు ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డీకే అరుణ, పుర చైర్పర్సన్ పద్మావతి, జేఏసీ నాయకులు వెంకట్రాములు, వీరభద్రప్ప, వెంకటరాజారెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, నాగరాజు, రాజశేఖర్‌రెడ్డి, అతికూర్‌రహ్మన్, మున్నాభాష, రాములు, కష్ణారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘గద్వాల జిల్లాపై ప్రభుత్వం సానుకూలం’
గద్వాల : నూతన జిల్లాల కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం గద్వాల జిల్లా ఏర్పాటుపై సానుకూల దక్పథంతో ఉందని ఐక్య కార్యాచరణ వేదిక చైర్మన్ నాగర్‌దొడ్డి వెంకట్రాములు, కన్వీనర్ మధుసూదన్‌బాబు, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి రాజశేఖర్‌రెడ్డిలు చెప్పారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మంత్రివర్గ ఉప సంఘం నూతన జిల్లాలపై జరిగిన సమీక్షా సమావేశంలో గద్వాల జిల్లా పట్ల సానుకూల సందేశాలు వ్యక్తమయ్యాయన్నారు. ఇప్పటి వరకు జిల్లాల ప్రకటనలో గద్వాల లేదనే సంకేతాలతో నడిగడ్డ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురై పలు ఉద్యమాలు నిర్వహించారన్నారు. ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో 21 రోజుల పాటు రిలే దీక్షలు కొనసాగించామని చెప్పారు. మంత్రివర్గ ఉప సంఘం కన్వీనర్ మహిమూద్అలీ, మంత్రులు కడియం శ్రీహరి, ఈటెల రాజేందర్, జూపల్లి కష్ణారావులతో పాటు పలువురు ఎమ్మెల్యేలను కలిసి గద్వాల జిల్లా కోసం వినతిపత్రాలు సమర్పించడం జరిగిందన్నారు. జిల్లాల ప్రకటనపై ఎలాంటి ముసాయిదా రాలేదని మంత్రులు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజల అభిప్రాయం మేరకే, పాలనా సౌలభ్యాన్ని దష్టిలో ఉంచుకొని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. ఒకవేళ గద్వాలకు అన్యాయం జరిగితే ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు అంపయ్య, వాల్మీకి, వినోద్‌కుమార్, చిన్నయ్య, కోళ్ల హుసేన్ తదితరులున్నారు.