గద్వాలను జిల్లాగా ప్రకటించకుంటే ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ స్పష్టం చేశారు.
మహబూబ్‌నగర్ : గద్వాలను జిల్లాగా ప్రకటించకుంటే ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ స్పష్టం చేశారు. జిల్లా నడిగడ్డగా ఉన్న గద్వాలకు జిల్లా అయ్యేందుకు అవసరమైన అన్ని అర్హతలున్నాయని చెప్పారు. కొత్తగా జిల్లాలను ఏర్పాటుచేయతలపెట్టిన ప్రభుత్వం గద్వాలను కూడా జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.
గద్వాలను జిల్లా చేయాలని కోరుతూ ఆమె శుక్రవారం బీచుపల్లి ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. విద్య, వైద్య, రవాణాతోపాటు తాగు, సాగు నీటి వసతులన్నీ ఉన్నాయని ఆమె చెప్పారు. గద్వాలను జిల్లా కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.