
ఆదివారం సెలవు సీఎంకేనా?: డీకే
సాక్షి, హైదరాబాద్: గతంలో ఎప్పుడూ లేనివిధంగా అసెంబ్లీ సమావేశాలను ఆదివారం నిర్వహిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సభలో లేకుండా పోయారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీల్లో తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడుతూ ఆదివారం వస్తే నియోజకవర్గానికి పోవడమో లేకుంటే కుటుంబసభ్యులతో గడపటమో సహజమన్నారు.
కేసీఆర్‌కు ఉన్న ఆదివారం సెలవు సభ్యులకు వద్దా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను చర్చించకుండా సభను మొక్కుబడిగా నడిపించడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడం తప్ప ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు.