చేనేతను జీఎస్టీ నుంచి మినహాయించాలి
ఎమ్మెల్యే డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీతో చేనేత వస్త్ర పరిశ్రమపై తీవ్ర భారం పడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయం లో ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను డీకే అరుణ, గద్వాల చేనేత ఉత్పత్తిదారుల సంఘం నేతలు కలసి జీఎస్టీ వల్ల వచ్చే ఇబ్బందులపై వినతిపత్రం సమర్పిం చారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ గద్వాల చీరలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచా యని, ఈ పరిశ్రమపై 30 వేల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. జీఎస్టీతో జాబ్ వర్క్‌పై ట్యాక్స్ విధించడం వల్ల ఉత్పత్తుల ధరలు పెరిగి మార్కెట్‌లో అమ్మకాలపై ప్రభావం పడుతుందన్నారు. జీఎస్టీ నుంచి చేనేత పరిశ్రమను మినహా యించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు అక్కల శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు సురేశ్, తిరుమల రవి, ప్రధాన కార్యదర్శి సంగ మహేశ్, దూడం శ్రీనివాస్ పాల్గొన్నారు.