ఎమ్మెల్యే డీకే అరుణపై ఫిర్యాదు | reported on MLA DK Aruna | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే డీకే అరుణపై ఫిర్యాదు

Published Mon, Apr 18 2016 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

ఎమ్మెల్యే డీకే అరుణపై ఫిర్యాదు

ఎమ్మెల్యే డీకే అరుణపై ఫిర్యాదు

చైతన్యపురి: రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఎమ్మెల్యే డీకే అరుణ అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలంగాణ అడ్వకేట్ జే ఏసీ నాయకులు ఆదివారం చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.   గాంధీభవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో అరుణ మాట్లాడుతూ మంత్రి జూపల్లి పిల్లిలాంటివాడన్నారని జేఏసీ నాయకులు పేర్కొన్నారు.

ప్రజలతో ఎన్నుకోబడి, మంత్రిగా సేవలందిస్తున్న వ్యక్తిని ఉద్దేశించి అనుచితంగా మాట్లాడం వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అడ్వకేట్ జేఏసీ నాయకుడు గోవర్దన్‌రెడ్డి మరికొందరు ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించామని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ గురురాఘవేంద్ర తెలిపారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement