JUPALLY Minister Krishna Rao
-
డ్వాక్రా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్
* పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు * పీపుల్స్ ప్లాజాలో ప్రారంభమైన డ్వాక్రా బజార్ సాక్షి, హైదరాబాద్: స్వయం సహాయక సంఘాల మహిళలు తమ శక్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దేశవ్యాప్తంగా డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ లభిస్తుండటమే ఇందుకు నిదర్శనమని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డ్వాక్రా ఉత్పత్తుల అమ్మకం, ప్రదర్శన నిమిత్తం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) పీపుల్స్ ప్లాజా (హైదరాబాద్)లో ఏర్పాటు చేసిన తెలంగాణ డ్వాక్రా బజార్ (సరస్-2016)ను మంగళవారం మంత్రి జూపల్లి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు బలంగా ఉన్నాయని, ఆయా సంఘాలు తయారు చేసే వస్తువులు, ఆహార ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉందన్నారు. అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఆన్లైన్ ద్వారా డ్వాక్రా ఉత్పత్తులను అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తున్నాయన్నారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి కోసం ఉదారంగా రుణాలను అందించాలని బ్యాంకర్లకు మంత్రి జూపల్లి విజ్ఞప్తి చేశారు. సెర్ప్ సీఈవో అనితా రాంచంద్రన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారి డ్వాక్రా బజార్ నిర్వహిస్తున్నామని.. అక్టోబర్ 7వ తేదీ వరకు ఉదయం 10.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డ్వాక్రా బజార్‌ను ప్రారంభించిన మంత్రి జూపల్లి అన్ని స్టాళ్లను పరిశీలించి వసతుల కల్పన గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, సెర్ప్ డెరైక్టర్లు రాజేశ్వర్‌రెడ్డి, వెంకటేశం, శ్రీనివాస్‌రావు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకుంటున్న డ్వాక్రా బజార్ స్టాల్స్: సెర్ప్ ఏర్పాటుచేసిన డ్వాక్రా బజార్ స్టాళ్లలో తెలంగాణతో పాటు దేశంలోని 17 రాష్ట్రాలకు చెందిన డాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు వినియోగదారులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా సిరిసిల్ల చేనేత, పోచంపల్లి చీరలు, కొండపల్లి బొమ్మలు, సోలార్ లైట్లు, గృహ అలంకరణ వస్తువులు, వెదురు బొమ్మలు, ఆటవస్తువులు సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. డ్వాక్రా బజార్లో ఏర్పాటు చేసిన 325 స్టాళ్లలో మొత్తం రూ.5 కోట్ల విలువైన వస్తువులను ప్రదర్శన, అమ్మకానికి ఉంచినట్లు అధికారులు తెలిపారు. -
చదువుతోనే బంగారు తెలంగాణ
► అంకితభావంతో మంచి ఫలితాలు ► కొల్లాపూర్‌ను ఆదర్శంగా నిలపాలి ► విద్యాశాఖ సమీక్షలో మంత్రి జూపల్లి కొల్లాపూర్‌రూరల్: చదువుతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కలలుగంటున్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని మహబూబ్ ఫంక్షన్హాల్లో నియోజకవర్గ స్థాయి విద్యా శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథులుగా మం త్రి జూపల్లి కృష్ణారావు, డీఈఓ విజయలక్ష్మిబాయి, ఆర్వీఎం పీడీ గోవిందరాజులు హాజరయ్యారు. ఈసందర్భం గా జూపల్లి మాట్లాడుతూ ఉపాధ్యాయులంతా అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. నియోజకవర్గంలోని ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి వందశాతం అక్షరాస్యతను పెంచడానికి కృషిచేయాలని సూచించారు. కొల్లాపూర్‌ను ఆదర్శంగా నిలపాలి... 2016-17లో తెలంగాణ రాష్ట్రానికే కొల్లాపూర్ ఆదర్శవంతంగా ఉండేలా నియోజకవర్గంలోని ఉపాధ్యాయులతోపాటు ప్రజాప్రతినిధులు, ప్ర జలంతా కృషిచేయాలన్నారు. నియోజకవర్గంలో ని పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సమస్యలను పరిష్కరించటానికి తనవంతుగా కోటి రూపాయలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో మాట్లాడి రూ.3 కోట్లు మంజూరు చేయిస్తానన్నారు. గ్రామంలోని సగం మందికి ఉపాధి కల్పించాలన్నారు. ఆగస్ట్ 15 వరకు పాఠశాలల్లో టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి మండలానికి రూ.4 ఇచ్చేలా చూస్తామన్నారు. త్వరలో అన్ని మండలాల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. బెస్ట్ సూపర్వైజర్లుగా హెచ్ఎంలు: డీఈఓ గ్రామాలలో ఉన్న పాఠశాలల హెచ్ఎంలు బెస్ట్ సూపర్వైజర్లుగా వ్యవహరించి ఉపాధ్యాయులను ఐక్యం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని డీఈఓ విజయలక్ష్మిబాయి అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను డిప్యూటేషన్ల ద్వారా భర్తీ చేయాలని ఆమె ఆదేశించారు. సమావేశంలో ఆర్వీఎం పీడీ గోవిందరాజులు, ఎంపీపీలు చిన్న నిరంజన్‌రావు, వెంకటేశ్వర్రావు, రాంమోహన్‌రావు, జెడ్పీటీసీ హన్మంతునాయక్, సింగిల్‌విండో చైర్మన్ రఘుపతిరావు, డిప్యూటీ డీఈఓ రవీందర్, ఎంఈఓలు ఉన్నారు. ఆగస్టు నాటికి 4లక్షల ఎకరాలకు సాగునీరు కొల్లాపూర్ రూరల్: బీమా, జూరాల పెండింగ్ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి వచ్చే ఆగస్ట్ నాటికి 4లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొల్లాపూర్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఖరీఫ్ నాటికి ఎంజీఎల్‌ఐ బీమా పథకం ద్వారా కొల్లాపూర్ నియోజకవర్గ రైతాంగానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. -
జూలై 31 లోపు పూర్తి చేయాలి
► ప్రాజెక్టుల పనులు వేగిరం చేయాలి ► జిల్లాలో 4.5 లక్షల ఎకరాలకు ► సాగునీరు అందించడమే లక్ష్యం ► పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్‌నగర్ న్యూటౌన్: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులను జూలై 31వ తేదీ లోపు పూర్తి చేసి 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మహాత్మాగాంధీ, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్పె సమీక్షానిర్వహించారు. లిఫ్ట్‌లు పూర్తి చేసి మోటార్లు బిగించి ట్రయల్ రన్ చేయాలన్నారు. చివరి ఆయకట్టు పొలాల వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూసేకరణ సమస్య లేకుండా పూర్తి చేయాలన్నారు. రైతులకు పరిహారం అందించడంలో జాప్యం చేయరాదన్నారు. రోడ్ కటింగ్ అవసరమున్న ప్రాంతాల్లో ఆర్ఆండ్బి, పీఆర్ అధికారులతో సమన్వయం చేసుకొని పనులు పూర్తి చేయాలని అన్నారు. సమస్య వచ్చిన ప్రాంతాలకు సంబంధింత ప్రజా ప్రతినిధులను తీసుకెళ్లి సమస్య పరిష్కరించి పనులు సజావుగా జరిగే విధంగా చూడాలన్నారు. ఎంజీఎల్ఐలో 28వ ప్యాకేజీలో మొత్తం ఆయకట్టు 57 వేల ఎకరాలకు గాను 13 వేల ఎకరాలకు సంబందించి ఫీల్డ్ చానెల్ పనులు వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెంట్లవెల్లి, చౌటబట్ల గ్రామాల్లో రైతులను ఒప్పించి ఫీల్డ్ చానెల్ పనులు పూర్తి చేయాలన్నారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పరిధిలో చేపడుతున్న ప్యాకేజీల వారీగా పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, సీఈ ఖగేందర్, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ వనజాదేవి, ఎస్ఈలు, ఈఈలు, ఆర్డీఓలు, వివిధ ప్యాకేజీల్లో పనులు నిర్వహిస్తున్న సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే డీకే అరుణపై ఫిర్యాదు
చైతన్యపురి: రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఎమ్మెల్యే డీకే అరుణ అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలంగాణ అడ్వకేట్ జే ఏసీ నాయకులు ఆదివారం చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాంధీభవన్‌లో జరిగిన ప్రెస్ మీట్లో అరుణ మాట్లాడుతూ మంత్రి జూపల్లి పిల్లిలాంటివాడన్నారని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ప్రజలతో ఎన్నుకోబడి, మంత్రిగా సేవలందిస్తున్న వ్యక్తిని ఉద్దేశించి అనుచితంగా మాట్లాడం వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అడ్వకేట్ జేఏసీ నాయకుడు గోవర్దన్‌రెడ్డి మరికొందరు ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించామని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ గురురాఘవేంద్ర తెలిపారు. -
దమ్ములేకనే తోక ముడిచారు
టీడీపీ నేతలపై భగ్గుమన్న మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టుల విషయంలో తీరని అన్యాయం చేసిన టీడీ పీ నేతలు తమ బండారం ఎక్కడ బయట పడుతుందోనని తోక ముడిచారని మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. ప్రాజెక్టులపై చర్చించే దమ్ములేకనే వారు వెనకడుగు వేశారన్నారు. రెండు రోజులపాటు అసెంబ్లీ కమిటీ హాలులో ఎదురు చూసిన మంత్రి గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎదురుచూశారు. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డిని చర్చకు ఆహ్వానించిన మంత్రి ఆయన గైర్హాజరు కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాజెక్టులకు టీడీపీ చేసిందేమీలేదని, తన తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు పాలమూరు కోసం కనీసం రూ.10 కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఈ వాస్తవాలన్నీ బయట పడతాయన్న ఆందోళనతోనే తెలంగాణ టీడీపీ నేతలు చర్చకు రాకుండా తప్పుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. శ్వేతపత్రం విడుదల చేస్తారా?: రావుల వనపర్తి రూరల్: టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదని శ్వేతపత్రం విడుదల చేస్తావా? అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో విలేకరులతో మాట్లాడారు. రోజుకోతీరున విమర్శలు చేస్తూ మాట్లాడడం తనకు సాధ్యం కాదని, చర్చకు వస్తానంటే ఎన్టీఆర్ భవన్ వద్ద నాలుగు గంటలపాటు ఎదురు చూశానన్నారు. తేదీ, సమయం, స్థలం చెప్పిన మంత్రి.. పారిపోయారని ఎద్దేవా చేశారు. జూపల్లికి ఇక్కడి ప్రాజెక్టుల వివరాలు పూర్తిగా తెలియకపోవడం అమాయకత్వమని ఎద్దేవా చేశారు. -
ప్రజాపక్షమా.. బాబు పక్షమా!
టీటీడీపీ నేతలు తేల్చుకోవాలి: మంత్రి జూపల్లి * పాలమూరు ఎత్తిపోతలపై వైఖరి స్పష్టం చేయాలి సాక్షి, హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుకూలమో కాదో తేల్చకుండా తెలంగాణ టీడీపీ నేతలు ఏపీ సీఎం చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ఈ విషయంలో టీటీడీపీ నేతలు తాము ప్రజల పక్షమో, చంద్రబాబు పక్షమో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జూపల్లి విలేకరులతో మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మంత్రి హరీశ్‌రావుకు బహిరంగ లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. లేఖలో పేర్కొన్నట్లుగా టీడీపీ హయాం లో తెలంగాణకు నీటి ప్రాజెక్టులపై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. భీమా ఎత్తిపోతల పథకానికి 1985లోనే అన్ని అనుమతులు వచ్చినా, 1985 నుంచి 2004 మధ్యలో ఐదేళ్లు మినహా టీడీపీ అధికారంలోనే ఉన్నా ప్రాజెక్టుకు ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదని జూపల్లి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు రూపాయి ఖర్చుపెట్టినట్లు రుజువు చేస్తానంటే శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్దకు వస్తానని, రావుల ఆ రికార్డులతో రావాలని అన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా వంటి ఎత్తిపోతల ప్రాజెక్టులకు కలిపి రూ.10 కోట్లు ఖర్చుపెట్టినట్లు రుజువు చేస్తారా అని సవాల్ చేశారు. చంద్రబాబు 1999 ఎన్నికల ముందు కల్వకుర్తి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, అదే ప్రాజెక్టుకు 2004 ఎన్నికల ముందు మరోసారి కొబ్బరికాయ కొట్టారని జూపల్లి గుర్తు చేశారు. ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదని, బాబు మొరగమంటే మొరగడమే తెలుసని ఎద్దేవా చేశారు. సవాల్‌కు సిద్ధం: రావుల మహబూబ్‌నగర్ జిల్లాలోని భీమా ప్రాజెక్టుకు నాటి ఏపీ సీఎంగా చంద్రబాబు నిధులు ఖర్చు చేశారని రుజువు చేస్తామని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. భీమా ప్రాజెక్టుకు చంద్రబాబు ఒక్క రూపాయి ఖర్చుచేశాడని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని మంత్రి జూపల్లి సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామన్నారు. సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భీమా ప్రాజెక్టులో అంతర్భాగమని మంత్రికి తెలియదా? అని ప్రశ్నించారు. బాబు హయాంలోనే ఈ రిజర్వాయరు నిర్మాణమైందన్నారు. గతంలో టీడీపీలో ఇరిగేషన్ మంత్రులుగా పనిచేసిన కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్రావు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని, టీడీపీ హయాంలో మహబూబ్‌నగర్‌కు సాగునీటి రంగంలో అభివృద్ధి జరగలేదని ఆ ఫిరాయింపు నాయకులతో చెప్పించగలుగుతారా? అని రావుల ప్రశ్నించారు. -
తెలంగాణకు రండి
గాంధీనగర్‌లో తెలంగాణ స్టేట్ ఇన్వెస్టర్స్ మీట్లో మంత్రి జూపల్లి గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల పారిశ్రామికవేత్తలతో భేటీ హైదరాబాద్: తెలంగాణ లో భారీ పరిశ్రమల ఏర్పాటే లక్ష్యంగా గుజరాత్ వెళ్లిన పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మౌలి క వసతులపై భరోసా ఇచ్చారు. నూతన పారిశ్రామిక విధానం గురించి వివరించారు. తన పర్యటనను సద్విని యోగం చేసుకునేందుకు ప్రయత్నిం చారు. గాంధీనగర్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘7వ వైబ్రెంట్ గుజరాత్ సమ్మేళనం’లో పాల్గొన్నారు. మంగళవా రం సాయంత్రం పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, వివిధ పారిశ్రామికవాడల సందర్శనతో బిజీగా గడిపారు. గాంధీనగర్‌లో ‘తెలంగాణ స్టేట్ ఇన్వెస్టర్స్ మీట్’ నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 85 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ సమావేశంలో తెలంగాణలో పరిశ్రమలు స్థాపించడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. నూతన పారిశ్రామిక విధానం టీఎస్- ఐపాస్ పెట్టుబడిదారులకు ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు కు అనువుగా 2.5 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, పరిశ్రమల కోసం సాగునీటి ప్రాజెక్టులో 10 శాతం నీటిని కేటాయించామని, రాబోయే మూడేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తామని పేర్కొన్నారు. ఈ మీట్‌కు గెజియా గ్రూప్ ప్రెసిడెంట్ హెచ్.ఎం.పటేల్, కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ఎండీ సింగ్, గుజరాత్ ప్లాస్టిక్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాజుభాయి, జీఎస్పీఎల్ లిమిటెడ్ తరఫున బోసు బాబు, అదానిగ్రూప్ ఉపాధ్యక్షుడు నాగేంద్ర, గుజరాత్ ఎమ్మె ల్యే, పారిశ్రామిక వేత్త బాల్వార్కర్ తదితరులు హాజరైనట్టు అధికారవర్గాలు తెలిపాయి. బడా కంపెనీల ప్రతినిధులతో భేటీ మంత్రి జూపల్లితో మంగళవారం ఆ రాష్ట్రానికి చెందిన విశాఖ పాలీఫ్యాబ్ ఎండీ జైదీష్ దోషి, మయూర్ పాలీమర్స్ ఎండీ శామ్టిబ్రివాలా, విశాఖ ఇరిగేషన్ ప్రతి నిధి అంకిత్ జోషి, అదాని గ్రూప్ ఉపాధ్యక్షుడు, సీఈవోలు భేటీ అయ్యారు.