చదువుతోనే బంగారు తెలంగాణ
► అంకితభావంతో మంచి ఫలితాలు
► కొల్లాపూర్‌ను ఆదర్శంగా నిలపాలి
► విద్యాశాఖ సమీక్షలో మంత్రి జూపల్లి
కొల్లాపూర్‌రూరల్: చదువుతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కలలుగంటున్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని మహబూబ్ ఫంక్షన్‌హాల్‌లో నియోజకవర్గ స్థాయి విద్యా శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథులుగా మం త్రి జూపల్లి కృష్ణారావు, డీఈఓ విజయలక్ష్మిబాయి, ఆర్వీఎం పీడీ గోవిందరాజులు హాజరయ్యారు. ఈసందర్భం గా జూపల్లి మాట్లాడుతూ ఉపాధ్యాయులంతా అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. నియోజకవర్గంలోని ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి వందశాతం అక్షరాస్యతను పెంచడానికి కృషిచేయాలని సూచించారు.
కొల్లాపూర్‌ను ఆదర్శంగా నిలపాలి...
2016-17లో తెలంగాణ రాష్ట్రానికే కొల్లాపూర్ ఆదర్శవంతంగా ఉండేలా నియోజకవర్గంలోని ఉపాధ్యాయులతోపాటు ప్రజాప్రతినిధులు, ప్ర జలంతా కృషిచేయాలన్నారు. నియోజకవర్గంలో ని పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సమస్యలను పరిష్కరించటానికి తనవంతుగా కోటి రూపాయలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో మాట్లాడి రూ.3 కోట్లు మంజూరు చేయిస్తానన్నారు. గ్రామంలోని సగం మందికి ఉపాధి కల్పించాలన్నారు. ఆగస్ట్ 15 వరకు పాఠశాలల్లో టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి మండలానికి రూ.4 ఇచ్చేలా చూస్తామన్నారు. త్వరలో అన్ని మండలాల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.
బెస్ట్ సూపర్‌వైజర్లుగా హెచ్‌ఎంలు: డీఈఓ
గ్రామాలలో ఉన్న పాఠశాలల హెచ్‌ఎంలు బెస్ట్ సూపర్‌వైజర్లుగా వ్యవహరించి ఉపాధ్యాయులను ఐక్యం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని డీఈఓ విజయలక్ష్మిబాయి అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను డిప్యూటేషన్ల ద్వారా భర్తీ చేయాలని ఆమె ఆదేశించారు. సమావేశంలో ఆర్వీఎం పీడీ గోవిందరాజులు, ఎంపీపీలు చిన్న నిరంజన్‌రావు, వెంకటేశ్వర్‌రావు, రాంమోహన్‌రావు, జెడ్పీటీసీ హన్మంతునాయక్, సింగిల్‌విండో చైర్మన్ రఘుపతిరావు, డిప్యూటీ డీఈఓ రవీందర్, ఎంఈఓలు ఉన్నారు.
ఆగస్టు నాటికి 4లక్షల ఎకరాలకు సాగునీరు
కొల్లాపూర్ రూరల్: బీమా, జూరాల పెండింగ్ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి వచ్చే ఆగస్ట్ నాటికి 4లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొల్లాపూర్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఖరీఫ్ నాటికి ఎంజీఎల్‌ఐ బీమా పథకం ద్వారా కొల్లాపూర్ నియోజకవర్గ రైతాంగానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.