minister kadiyam srihari
-
సీఐఐతో జేఎన్టీయూహెచ్ ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యా భివృద్ధికి జేఎన్టీయూహెచ్ సరికొత్త కార్యచరణకు ఉపక్రమించింది. విద్యార్థులు కోర్సు పూర్తికాగానే ఉద్యోగం పొందాలంటే.. ఇంజనీరింగ్ కొనసాగుతున్న సమయంలోనే వారిలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలని జేఎన్టీయూహెచ్ నిర్ణయించింది. ఇందుకు పరిశ్రమల సహకారాన్ని తీసుకు నేందుకు సిద్ధమైంది. ఈ మేరకు శనివారం ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో సీఐఐ (కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. కోర్సుకు సంబంధించి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సంబంధిత పరిశ్రమల్లో ప్రాజెక్టు, అప్రెంటిస్‌షిప్‌నకు అవకాశం కల్పిస్తారు. పారిశ్రామిక వేత్తలు, సీనియర్లతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జేఎన్టీయూహెచ్, సీఐఐల మధ్య ఒప్పందంతో విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య ఉన్న అంతరాలు తొలగిపోతాయని కడియం శ్రీహరి పేర్కొన్నారు. -
‘దేశంలోనే ఉత్తమ బోర్డుగా తయారు చేస్తాం’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డును దేశంలోనే ఉత్తమమైన బోర్డుగా తయారు చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇప్పటికే దేశంలో బెస్ట్ డిజటలైజ్డ్ బోర్డుగా వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో తెలంగాణ బోర్డుకు అవార్డు లభించిందన్నారు. ఇందుకు కృషి చేసిన ఇంటర్ బోర్డు అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. అయితే ఇంతటితో సంతృప్తి చెందకుండా మరింత కష్టపడాలన్నారు. నేడు ఇంటర్మీటియెట్ బోర్డు 2వ సమావేశంలో కడియం శ్రీహరి పాల్గొని బోర్డు ప్రవేశ పెట్టిన తీర్మాణాలను ఆమోదించారు. ఇంటర్ బోర్డు సభ్య సమావేశంలో ప్రతి ఆరు నెలలకొకసారి జరగాల్సి ఉండగా రాష్ట్ర విభజన, బోర్డు పదో షెడ్యూల్లో ఉన్నందున నిర్ణీత సమయంలో సమావేశం నిర్వహించలేక పోయామని ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఇప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకొకసారి ఇంటర్ బోర్డు సభ్య సమావేశం జరుగుతుందన్నారు. అదే విధంగా బోర్డు సభ్యులను కూడా ప్రస్తుత అవసరాల మేరకు మార్చుతామన్నారు. వృతివిద్య కోర్సులను మరింత పటిష్టం చేసి, కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగం వచ్చే విధంగా కోర్సులను డిజైన్ చేస్తామన్నారు. ఇందుకోసం జేఎన్టీయు, వైద్య, ఆరోగ్య శాఖ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్చన్ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే రెండు నెలల్లో ఈ కమిటీ తనకు నివేదిక ఇవ్వాలని, దానికనుగుణంగా కోర్సులు రూపొందించి వచ్చే సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొస్తామన్నారు. అదే సమయంలో ఆదరణలేని వృతి విద్య కోర్సులను కూడా తొలగిస్తామని చెప్పారు. బోర్డు పిరిధిలో 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయన్నారు. వీటన్నింటిలో ఉన్న వసతులు, అధ్యాపకులు, సిబ్బంది వివరాలతో ఒక్కో కాలేజీకి ఒక్కో ప్రొఫైల్ తయారు చేయిస్తామన్నారు. వాటిని ఇంటర్ వెబ్ సైట్లో పొందుపరుస్తామని, తద్వారా తల్లిదండ్రులు, విద్యార్థులు ఏయే కాలేజీల్లో ఎలాంటి కోర్సులు, వసతుల ఉన్నాయో తెలుసుకోవచ్చన్నారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీల అనుమతుల్లో బోర్డు కఠినంగా ఉంటుందని తెలిపారు. సరైన వసతులు లేని కాలేజీలకు అనుమతుల ఇవ్వడం లేదన్నారు. ఈ క్రమంలో బోర్డుపై ఆరోపణలు కూడా వస్తున్నాయని చెప్పారు. గతంలో ప్రైవేట్ కాలేజీలు బోర్డును ఆజమాయిషీ చేసేవని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ కాలేజీలపై బోర్డు పట్టు సాధించిందన్నారు. నిబంధనల మేరకు నడవని కాలేజీల నుంచి భారీ ఎత్తున పెనాల్టీలు కూడా వసూలు చేశామన్నారు. -
యూనివర్సిటీ అభివృద్ధికి కృషి
నల్లగొండ రూరల్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం నల్లగొండ మండలం అన్నెపర్తి పరిధిలోని ఎంజీయూలో 6 కోట్ల రూపాయలతో నిర్మించిన గ్రంథాలయాన్ని, రూ. 3.2 కోట్లతో సీసీ రోడ్లను, రూ.14 కోట్ల కోట్లతో నిర్మించే ఇంజనీరింగ్ కాలేజీకి, 7.5 కోట్లతో నిర్మించే పరీక్షల విభాగం భవనాలకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ యూనివర్సిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అన్ని యూనివర్సిటీలకు పూర్తి స్థాయిలో వీసీలను నియమించామని పేర్కొన్నారు. ఉన్నత విద్యను విద్యార్థులకు మెరుగైన రీతిలో అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అనంతరం ఎంజీయూ ఆవరణలో మొక్కలు నాటారు. అంతకు ముందు శాసన మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, ఎన్. భాస్కర్‌రావు, గాదరి కిషోర్‌కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎంజీయూ వైస్ ఛాన్స్లర్ అల్తాఫ్ హుస్సేన్‌లు డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఇరువర్గాల నినాదాలతో ఉద్రిక్తత ఎంజీయూలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి వచ్చిన డిప్యూటీ సీఎం శ్రీహరి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎంజీయూ గ్రంథాలయ ఆవరణలో టీఆర్ఎస్వీ వర్సెస్ కోమటిరెడ్డి అనుచరుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. కోమటిరెడ్డి జిందాబాద్ అని ఆయన అనుచరులు నినాదాలు చేయగా ... దానికి ప్రతిగా సీఎం కేసీఆర్, మంత్రులు కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి జిందాబాద్ అం టూ టీఆర్ఎస్వీ నాయకులు నినాదాలు చేయడంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొని ఉద్రిక్తతలకు దారితీసింది. మొదట మంత్రులతో కలిసి మెయిన్ రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొన్న కోమటిరెడ్డి ఆ తరువాత తన అనుచరులతో నడుచుకుంటూ వస్తుండగా ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇలా గ్రంథాలయం వరకు చేరుకునేసరికి అప్పటికే మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు గ్రంథాలయం ప్రారంభించి లోపలికి వెళ్లారు. కోమటిరెడ్డి గ్రంథాలయం వరకు వచ్చే ఆయన అనుచరులు నినాదాలు చేయడంతో అక్కడే టీఆర్ఎస్వీ నాయకులు కోమటిరెడ్డి డౌన్, డౌన్.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇరు వర్గాల నినాదాలతో ఎంజీయూ ఆవరణ మార్మోగింది. పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. అక్కడే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి ఎంజీ యూ సమస్యలపై కోమటిరెడ్డి వినతిపత్రం అందజేశారు. మంత్రులు వెళ్లిన తరువాత సెమినార్ హాల్లో కోమటిరెడ్డి అనుచరులు మంత్రుల పేర్లతో ఉన్న ప్లెక్సీలను తొలగించారు. బీసీ విద్యార్థి సంఘాల నాయకుల నిరసన గురుకుల పాఠశాలలో పోస్టుల భర్తీలో టెట్ అర్హత లేకుండా అవకాశం కల్పించాలని, మార్కుల శాతం నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘాల నాయకులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దాంతో వారిని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం డిప్యూటీ సీఎం దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడించడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం ఎంజీయూలో సమస్యలపై పలు విద్యార్థి సంఘాలు వినతిపత్రాలు అందజేశారు. అన్నెపర్తి సర్పంచ్ పుష్పలత యూనిర్సిటీకి భూములు ఇచ్చిన వారికి ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు కల్పించాలని, వ్యవసాయ భూములకు నష్ట పరిహారం ఇప్పించాలని డిప్యూటీ సీఎంకు వినతిపత్రం అందజేశారు. -
మంత్రి ఎదుట ముంపు బాధితుల నిరసన
వరంగల్: తమ గ్రామాన్ని ముంచేసే రిజర్వాయర్ వద్దంటూ రైతులు ఆందోళనకు దిగారు. హన్మకొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ముల్కనూర్‌లో సాగు నీటి జలాశయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం తలపెట్టింది. అయితే, ఈ రిజర్వాయర్ కారణంగా తమ గ్రామం ముంపునకు గురవుతుందంటూ ఆ గ్రామస్తులు మూడు లారీల్లో తరలివచ్చారు. హన్మకొండలోని సర్క్యూట్‌హౌజ్‌లో ఉన్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎదుట ఆందోళనకు దిగారు. డిప్యూటీ సీఎం గ్రామస్తులకు నచ్చజెప్పి వెనక్కి పంపేశారు. సోమవారం ఈ విషయమై మాట్లాడుదామంటూ వారికి సర్దిచెప్పారు. -
తెలంగాణకు సాహిత్య అకాడమీ అవసరం
మంత్రి కడియం శ్రీహరి హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన, ఊహించని సాహిత్యం వెలుగులోకి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలుగు వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరిం చుకుని శుక్రవారం రాత్రి ఇక్కడ ప్రముఖ కవి నందిని సిధారెడ్డికి సాహితీరంగంలో విశిష్ట పురస్కారం ప్రదానం చేశారు. కడియం మాట్లాడుతూ సాహిత్య పరిశోధన, నిరంతర అధ్యయనం కోసం తెలంగాణకు ఒక సాహిత్య అకాడమీ అవసరమన్నారు. తెలంగాణ ఉద్య మం వేళ వచ్చిన సాహిత్యాన్ని పుస్తక రూపంలోకి తీసుకురావాలని తెలుగు వర్సిటీకి సూచిం చారు. తెలంగాణ ఉద్యమంలో ఉపన్యాసాల కంటే ఆయుధాల లాంటి పాటలే ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేశాయని, వాటిని సీడీ రూపంలో తీసుకువస్తే బాగుంటుందన్నారు. మలిదశ ఉద్యమానికి సిద్ధిపేట కేంద్రంగా వ్యవహరించిందని, ఈ ప్రాంతానికి చెందిన ఎంతో మంది ఉద్య మానికి నాయకత్వం వహించారని పేర్కొ న్నారు. మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ సిధారెడ్డి జీవితం ఎంతో నిరాడంబ రంగా ఉంటుందని, వ్యక్తిగతంగా ఆయన తనకు ఎన్నో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని అన్నారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయని, అప్పుడు తెలంగాణ వ్యతిరేకుల ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు సిధారెడ్డి ఇచ్చిన స్ఫూర్తి మరవలేని దన్నారు. తెలంగాణ రచరుుతల వేదికను స్థాపించి కవులందరినీ ఒక వేదికపైకి తీసుకు వచ్చారన్నారు. వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ వెలుగులోనికి వచ్చిన తెలంగాణ సాహిత్యాన్ని గ్రంథం చేస్తామని, తెలుగు ప్రాచీన కేంద్రాన్ని మైసూరు నుంచి హైదరాబాదుకు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. కన్నీళ్లు, కష్టాలే తనను నడిపించాయని సిధారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కవి దేశపతి శ్రీనివాస్, విద్యావేత్త వెల్చాల కొండలరావు, నమస్తే తెలంగాణ దినపత్రిక సంపాదకులు కట్టా శేఖర్‌రెడ్డి, వర్సిటీ రిజిస్ట్రార్ వి.సత్తిరెడ్డి పాల్గొన్నారు. -
సమాజం తిరగబడే పరిస్థితి తెచ్చుకోకండి
ఖమ్మం: ప్రభుత్వోపాధ్యాయుల తీరుపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. సమాజం తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దని వారిని హెచ్చరించారు. అటువంటి దుస్థితి ఉపాధ్యాయులకు రాకూడదన్నారు. గతంలో ఉపాధ్యాయుడు సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండేవాడని, కానీ ఇప్పుడు ప్రజలే ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించి పాఠశాలలకు పంపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మంలోని పువ్వాడ ఆడిటోరియంలో జరిగిన ఉపాధ్యాయుల మోటివేషన్ కార్యక్రమానికి కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. హెచ్ఎం అంకితభావంతో పని చేస్తేనే. పాఠశాల హెడ్మాస్టర్ (హెచ్ఎం) అంకితభావంతో పనిచేస్తే ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, ఉత్తమ ఫలితాలు కూడా సాధించవచ్చని కడియం పేర్కొన్నారు. అంకితభావం కొరవడిన చోటే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకన్నా అన్ని అర్హతలు కలిగిన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఎందుకు కుంటుపడుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఉపాధ్యాయ సంఘాలు 50కి పైగా ఉన్నాయని, ఆయా సంఘాల నాయకులు చేతిలో డైరీలు పట్టుకుని డీఈవో కార్యాలయాల చుట్టూ తిరగడం శోచనీయమన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతోపాటు విద్యా వ్యవస్థలోని మార్పులకు ఉపాధ్యాయ సంఘాలు సూచనలివ్వాలని, ఇందుకోసం సెమినార్లు నిర్వహించాలని కడియం సూచించారు. సమయమంతా ప్రయాణాల్లోనే... ఉపాధ్యాయుల సమయమంతా బస్సులు, రైళ్లలోనే (స్కూళ్లకు రాకపోకల కోసం ప్రయాణాల్లోనే) గడిచిపోతోందన్నారు. మహిళా ఉపాధ్యాయులైతే ఇంట్లో పనిచేసుకొని హడావుడిగా పాఠశాలకు వెళ్లే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితిలో వెళ్లిన ఉపాధ్యాయులు ఏం బోధిస్తారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉండాలని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉపాధ్యాయులకంటే విద్యార్థులు తెలివైన వారిగా ఉంటున్నారన్నారు. సన్నాహం కాకుండా తరగతికి వెళ్లే ఉపాధ్యాయుడు బోధించడం కష్టమన్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోందని, మౌలిక వసతుల కల్పనకు ఎన్ని కోట్లు అయినా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నిధులు విడుదల చేసే పూచీ ప్రభుత్వానిదని, సక్రమంగా పాఠాలు చెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్ తదితరులు పాల్గొన్నారు. అవమానించడం తగదు: ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం కడియం చేసిన వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆయన వ్యాఖ్యలను ఖండించాయి. బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి ఉపాధ్యాయులను బహిరంగ వేదికపై అవమానించేలా మాట్లాడటం కడియం శ్రీహరికి తగదని ఖమ్మం జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. ఉపాధ్యాయ సంఘాలు డైరీలు పట్టుకుని తిరుగుతున్నాయని పేర్కొనడంతోపాటు ఉపాధ్యాయినులను కూడా కించపరిచేలా మంత్రి మాట్లాడటం శోచనీయమన్నాయి. ఏకీకృత సర్వీసుల రూపకల్పనలో కాలయాపన చేయడమే కాకుండా ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం...దాన్ని కప్పిపుచ్చుకుని ఉపాధ్యాయులను విమర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాయి. ప్రత్యేక తెలంగాణ కోసం అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమించాయని, ఈ విషయాన్ని మరిచిన మంత్రి ఇష్టారీతిన మాట్లాడి అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఖమ్మంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పీఆర్టీయూ, యూటీఎఫ్, ఎస్టీఎఫ్, టీఎన్‌యూఎస్, టీపీటీఎఫ్ సంఘాల నాయకులు మాట్లాడారు. -
మీది అత్యుత్సాహం
► నర్సరీ నుంచే అడ్మిషన్లు ఎందుకు తీసుకున్నారు? ► నిబంధనలు మార్చలేదు.. టీచర్లు లేరు.. పుస్తకాల్లేవు ► ఇంగ్లిష్ మీడియం బోధించడం ఎట్లా సాధ్యం? ► జిల్లా విద్యాశాఖ సమీక్షలో డీఈవోపై డిప్యూటీ సీఎం ఆగ్రహం ► మంచి ఉద్దేశ ంతో కలెక్టరే జీవో ఇచ్చారన్న జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ► అయితే కలెక్టరే బాధ్యత తీసుకోవాలన్న కడియం ► కలెక్టర్ ఫండ్ నుంచి పుస్తకాలు కొనాలని సూచన ► పాఠశాలల్లో వసతుల కల్పనకు రెండు దశల్లో రూ.130 కోట్ల విడుదలకు హామీ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : సర్కారు పాఠశాలల్లో నర్సరీ నుంచి ఆంగ్లమాధ్యమం బోధిస్తామంటూ విద్యార్థులను చేర్చుకోవడంపై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారంటూ డీఈవోపై మండిపడ్డారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో బడిబాటకు అనూహ్య స్పందన వచ్చిందని, ఇతర జిల్లాలతో పోలిస్తే కరీంనగర్‌లోనే అధిక సంఖ్యలో విద్యార్థులు చేరారని డీఈవో శ్రీనివాసాచారి తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో న ర్సరీ నుంచి పిల్లలను చేర్చుకున్నారని, వాళ్ల ప రిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కడియం శ్రీహరి నర్సరీ నుంచి ఎందుకు దరఖాస్తులు స్వీకరించారని ప్రశ్నించారు. ‘మేం ఈ ఏడాది ఒకటో తరగతికి మాత్రమే ఇంగ్లిష్ మీడియం పరిమితం చే స్తూ అడ్మిషన్లు తీసుకోవాలని చెప్పాం. కొందరు డీఈవోలు అత్యుత్సాహం ప్రదర్శించి నర్సరీ నుంచి 5వ తరగతి వరకు ఆంగ్లంలో బోధిస్తామంటూ విద్యార్థులను చేర్చుకున్నారు. వాస్తవానికి ఐదేళ్లు నిండిన పిల్లలను మాత్రమే పాఠశాలల్లో చేర్చుకోవాలని కేంద్ర, రాష్ర ప్రభుత్వాల నిబంధులు చెబుతున్నాయి. ఆ నిబంధనలను మార్చకుండా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో విద్యాబోధన ఎట్లా సాధ్యం? పైగాా ఇంగ్లిష్‌లో బోధించే టీచర్లు లేరు. ఉన్న వారికి శిక్షణ ఇవ్వలేదు. ఇప్పటివరకు కరిక్యులమ్ కూడా తయారు కాలేదు. పుస్తకాలు లేవు. అట్లాంటప్పుడు నర్సరీ నుంచి పిల్లలను ఎట్లా చేర్చుకున్నారు’ అని మండిపడ్డారు. జీవన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ తల్లిదండ్రులంతా తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించాలని కోరుకుంటున్న నేపథ్యంలో మంచి ఉద్దేశంతో కలెక్టర్ జీవో ఇచ్చారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. జిల్లావ్యాప్తంగా 15 వేలకుపైగా విద్యార్థులు చేరారని, వారి పరిస్థితి ఏమిటని అడిగారు. వెంటనే కడియం స్పందిస్తూ ‘విద్యార్థులను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించి అంగన్వాడీల ద్వారా ప్రీప్రైమరీ విద్య అందించొచ్చు. అంగన్‌వాడీలన్నీ కలెక్టర్ పరిధిలోనే ఉంటారుు కాబట్టి ఆ బాధ్యతను కలెక్టరే తీసుకోవాలి’ అన్నారు. పుస్తకాలే లేనప్పుడు చదువెట్లా చెబుతారని జీవన్‌రెడ్డి ప్రస్తావించగా మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ‘ఈ ఏడాది వరకు ప్రైవేటు స్కూళ్లలో అమలవుతున్న సిలబస్‌ను బోధించండి. అందుకోసం ఆయా పుస్తకాలను కొనుగోలు చేస్తే సరిపోతుంది. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వమే కరిక్యులమ్ రూపొందిస్తుంది కాబట్టి సమస్య ఉండదు’ అని సూచించారు. ఆయా పుస్తకాలకయ్యే ఖర్చును కలెక్టర్ నిధి నుంచి చెల్లించాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. అందుకు అంగీకరించిన కలెక్టర్ నీతూప్రసాద్ రూ.10 లక్షల వరకు పుస్తకాల కొనుగోలుకు చెల్లిస్తానని పేర్కొన్నారు. సర్కారు బడుల్లో సౌకర్యాలకు రూ.130 కోట్లు ప్రభుత్వ పాఠశాలల సంఖ్య ఎక్కువగా ఉండటంతో మౌలిక సదుపాయల కొరత తీవ్రంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ సమకూర్చాలంటే రూ.239 కోట్లు అవసరమని చెప్పారు. జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి, కలెక్టర్ సహకరిస్తే ఆ సమస్యను పరిష్కరించవచ్చునన్నారు. ‘పాఠశాలల్లో ఏయే సమస్యలున్నాయో నియోజకవర్గాల వారీగా అంచనా వేసి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతారు. ఈ ఏడాది ఒక్కో నియోజకవర్గంలో రూ.5 కోట్లు ఖర్చు చేద్దాం. అందుకు ఎమ్మెల్యే నిధి నుంచి రూ.కోటి ఇవ్వండి. కలెక్టర్, మంత్రి కోటా నుంచి మరో రూ.కోటి ఇవ్వండి. మిగిలిన రూ.3 కోట్లు విద్యాశాఖ సమకూరుస్తుంది. మీరు ఎంత తొందరగా ప్రతిపాదనలు పంపితే అంత తొందరగా నిధులు మంజూరు చేయిస్తా’ అని ప్రతిపాదించారు. దీనిపై మంత్రి ఈటల స్పందిస్తూ ‘నియోజకవర్గానికి రూ.5 కోట్లు కాదు, రూ.10 కోట్లు ఖర్చు చేద్దాం. రెండేళ్లలో అన్ని పాఠశాలల్లో సౌకర్యాలన్నీ కల్పిద్దాం. అందుకోసం జిల్లాలోని ప్రజాప్రతినిధులమంతా కలిసి నియోజకవర్గానికి రూ.3 కోట్ల చొప్పున 13 నియోజకవర్గాలకు రూ.39 కోట్లు ఇస్తాం. మీ శాఖ నుంచి నియోజకవర్గానికి రూ.7 కోట్ల చొప్పున రూ.91 కోట్లు ఇవ్వండి’ అని సూచించారు. ఇందుకు ఎమ్మెల్యేలంతా అంగీకరిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈటల సూచనను కడియం సైతం స్వాగతించారు. ‘విద్యాశాఖ ఒకేసారి రూ.7 కోట్లు చెల్లించాలంటే కాస్త ఇబ్బంది. రెండు దశల్లో ఆ మెత్తాన్ని చెల్లిస్తాం’ అని హామీ ఇచ్చారు. కాలేజీల్లో ఫర్నీచర్‌కు రూ.15 కోట్లు : మంత్రి ఈటల రాజేందర్ జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ఫర్నీచర్‌ను సమకూర్చేందుకు రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. డిగ్రీ కళాశాలల్లో సౌకర్యాల ప్రస్తావన వచ్చినప్పుడు ఈటల మాట్లాడుతూ విద్యాశాఖ మంజూరు చేసే నిధులకు అదనంగా మరో రూ.25 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల శిథిలావస్థలో ఉన్నందున కొత్త భవనాలు నిర్మించాలని, ఎస్సారార్ కళాశాల ఆడిటోరియం నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రతిపాదనకు కడియం సానుకూలంగా స్పందించారు. వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. పాఠ శాల ల్లో పార్ట్‌టైం స్వీపర్ల సమస్య వేధిస్తోందని, వెంటనే పరిష్కరించాలని జీవన్‌రెడ్డి సూచించగా ఆర్థిక శాఖ వద్ద ఫైలు ఉందని, త్వరలో పరిష్కరిస్తామని ఈటల పేర్కొన్నారు. ఈసారి ఎన్రోల్మెంట్ పెంచుతాం : డీఈవో హామీ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా విద్యార్థుల ఎన్రోల్మెంట్ పడిపోతుండగా, ప్రైవేటు పాఠశాలల్లో పెరుగుతోందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. గత ఏడాది విద్యార్థుల ఎన్రోల్మెంట్ పడిపోతే ఉపాధ్యాయ పోస్టులు పోతాయనే భయంతోనే కాకిలెక్కలతో ఎన్రోల్మెంట్ సంఖ్యను పెంచి చూపారని అన్నారు. ఈసారి వాస్తవిక సంఖ్య బయటకు వస్తోందన్నారు. దీనిపై డీఈవో స్పందిస్తూ గత ఏడాదితో పోలిస్తే ఈసారి విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచుతామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను నిరంతరం తనిఖీలు చేస్తేనే సరైన ఫలితాలొస్తాయని, ఈ విషయంలో కలెక్టర్, అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. ప్రజాప్రతినిధులు సైతం విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పాఠశాలలను సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు పుట్ట మధు, బొడిగె శోభ, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య, జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ వాణీప్రసాద్, ఇంటర్మీడియట్ కమిషనర్ అశోక్, పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జి.కిషన్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోరుట్ల పాలిటెక్నిక్‌లో రూ.5.80కోట్లతో బాలుర వసతిగ ృహం, సీసీ రోడ్డు, ప్రహరీ నిర్మాణాలకు భూమిపూజ చేశారు. బాలికల జూనియర్ కళాశాలలో రూ.81 లక్షలతో అదనపు తరగతి గదులు, బాలుర జూనియర్ కళాశాలలో రూ.98లక్షలతో ల్యాబ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. కోరుట్ల జూనియర్ కళాశాలకు రెండంతస్థుల భవన నిర్మాణానికి రూ.కోటి మంజూరుకు హామీ ఇచ్చారు. పాలిటెక్నిక్‌లో బాలికల వసతిగృహం కోసం ప్రతిపాదనలు పంపాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో రూ.2.42 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. మెట్‌పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలను సందర్శించారు. కళాశాలలకు ఆధునిక భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళశాలను ప్రారంభించారు. ఓ తరగతి గదిలో విద్యార్థులకు ఇవ్వాల్సిన పుస్తకాలు ఉండటం చూసి ప్రిన్సిపాల్ సంతోష్‌కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చదువుతోనే బంగారు తెలంగాణ
► అంకితభావంతో మంచి ఫలితాలు ► కొల్లాపూర్‌ను ఆదర్శంగా నిలపాలి ► విద్యాశాఖ సమీక్షలో మంత్రి జూపల్లి కొల్లాపూర్‌రూరల్: చదువుతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కలలుగంటున్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని మహబూబ్ ఫంక్షన్హాల్లో నియోజకవర్గ స్థాయి విద్యా శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథులుగా మం త్రి జూపల్లి కృష్ణారావు, డీఈఓ విజయలక్ష్మిబాయి, ఆర్వీఎం పీడీ గోవిందరాజులు హాజరయ్యారు. ఈసందర్భం గా జూపల్లి మాట్లాడుతూ ఉపాధ్యాయులంతా అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. నియోజకవర్గంలోని ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి వందశాతం అక్షరాస్యతను పెంచడానికి కృషిచేయాలని సూచించారు. కొల్లాపూర్‌ను ఆదర్శంగా నిలపాలి... 2016-17లో తెలంగాణ రాష్ట్రానికే కొల్లాపూర్ ఆదర్శవంతంగా ఉండేలా నియోజకవర్గంలోని ఉపాధ్యాయులతోపాటు ప్రజాప్రతినిధులు, ప్ర జలంతా కృషిచేయాలన్నారు. నియోజకవర్గంలో ని పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సమస్యలను పరిష్కరించటానికి తనవంతుగా కోటి రూపాయలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో మాట్లాడి రూ.3 కోట్లు మంజూరు చేయిస్తానన్నారు. గ్రామంలోని సగం మందికి ఉపాధి కల్పించాలన్నారు. ఆగస్ట్ 15 వరకు పాఠశాలల్లో టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి మండలానికి రూ.4 ఇచ్చేలా చూస్తామన్నారు. త్వరలో అన్ని మండలాల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. బెస్ట్ సూపర్వైజర్లుగా హెచ్ఎంలు: డీఈఓ గ్రామాలలో ఉన్న పాఠశాలల హెచ్ఎంలు బెస్ట్ సూపర్వైజర్లుగా వ్యవహరించి ఉపాధ్యాయులను ఐక్యం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని డీఈఓ విజయలక్ష్మిబాయి అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను డిప్యూటేషన్ల ద్వారా భర్తీ చేయాలని ఆమె ఆదేశించారు. సమావేశంలో ఆర్వీఎం పీడీ గోవిందరాజులు, ఎంపీపీలు చిన్న నిరంజన్‌రావు, వెంకటేశ్వర్రావు, రాంమోహన్‌రావు, జెడ్పీటీసీ హన్మంతునాయక్, సింగిల్‌విండో చైర్మన్ రఘుపతిరావు, డిప్యూటీ డీఈఓ రవీందర్, ఎంఈఓలు ఉన్నారు. ఆగస్టు నాటికి 4లక్షల ఎకరాలకు సాగునీరు కొల్లాపూర్ రూరల్: బీమా, జూరాల పెండింగ్ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి వచ్చే ఆగస్ట్ నాటికి 4లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొల్లాపూర్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఖరీఫ్ నాటికి ఎంజీఎల్‌ఐ బీమా పథకం ద్వారా కొల్లాపూర్ నియోజకవర్గ రైతాంగానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. -
ఉదయం 6గంటలకు ఎంసెట్ 'కోడ్' విడుదల
హైదరాబాద్: ఎంసెట్ - 2016 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2:30 నుంచి మెడిసిన్ పరీక్ష జరగనుంది. ఈమేరకు పరీక్షా పత్రాల సెట్ కోడ్ లను మంత్రులు విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 6 గంటలకు ఎంసెట్ క్వశ్చన్ పేపర్ సెట్ కోడ్ ను మంత్రి కడియం శ్రీహరి విడుదల చేస్తారని జేఎన్ టీయూహెచ్ ఒక ప్రకటనలో తెలిపింది. మెడిసిన్ ప్రశ్నాపత్నం కోడ్ ను వైద్య మంత్రి లక్ష్మారెడ్డి ఉదయం 9:30 గంటలకు వెల్లడిస్తారు. (చదవండి: రేపే ఎంసెట్, ఉదయం ఇంజనీరింగ్ పరీక్ష) -
డెప్యూటీ సీఎం ‘కడియం’కు వినతులు
తిమ్మాపూర్ : తిమ్మాపూర్, మానకొండూర్ మండలాల పరిధిలో జరుగుతున్న కాకతీయ కాలువల ఆధునికీకరణ పనులను పరిశీలించేందుకు డెప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సోమవారం వచ్చారు. ఈ సందర్భంగా ఎల్ఎండీ గెస్ట్‌హౌస్‌లో ఎస్సారెస్పీ అధికారులతో సమావేశమై కాల్వ ఆధునికీకరణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి వివిధ సమస్యలపై పలువురు వినతిపత్రాలు సమర్పించారు. తిమ్మాపూర్ మండలంలో మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేయూలంటూ జెడ్పీటీసీ పద్మ, ఎంపీపీ ప్రేమలత, సర్పంచ్ స్వరూప వినతిపత్రం ఇవ్వగా... స్థలం ఇస్తే మంజూరు ఇప్పిస్తానని హామీచ్చారు. జీతాలు పెంచాలని వీఆర్ఏలు డెప్యూటీ సీఎంకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి శాసనసభలో మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు హర్షణీయమని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం(ఎస్జీటీయూ) జిల్లా అధ్యక్షుడు కరివేద మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
విద్యావ్యవస్థ పటిష్టానికి చర్యలు
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హైదరాబాద్: నిర్లక్ష్యం, నిర్వీర్యానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, పటిష్టపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఇందులో భాగంగానే కేజీ టు పీజీ విద్యను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతోందన్నారు. అయినా అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని, అది పూర్తిస్థాయిలో అమలు జరగాలంటే మరో రెండేళ్ల సమయం పడుతుందని అన్నారు. సోమవారం సాయంత్రం రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ(ఆర్‌సీటీఏటీ) హైదరాబాద్ తిలక్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయ ప్రారంభోత్సవంలో శ్రీహరి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. విద్యావ్యవస్థను పటిష్ట పరిచేందుకు విశ్రాంత ఉపాధ్యాయులు సేవలు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సీబీఎస్ఈ సిలబస్‌తో కూడిన రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారని, ఈ నెల 14న మరికొన్ని రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుపై సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ కేజీ టు పీజీ విద్యను స్వాగతిస్తున్నామని, దీనిని నిర్ధిష్టమైన ప్రణాళికతో అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆర్‌సీటీఏటీ అధ్యక్షుడు సీహెచ్ విద్యాసాగర్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో విశ్రాంత ఉద్యోగుల సేవలు ఉపయోగించుకోవాలని, తమ సేవలకు ఎలాంటి వేతనం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ పి. సుధాకర్‌రెడ్డి, ఏఐఎప్ఆర్యూసీటీఏ ప్రధాన కార్యదర్శి కేటీ వెంకటాచార్యులు, ఆర్‌సీటీఏటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కేఎస్ఎన్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘కడియం’ ప్రకటన సరికాదు
► పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి ► పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జీవన్ ఆదిలాబాద్ టౌన్ : విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అసెంబ్లీలో చేసిన ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు దారట్ల జీవన్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని పీఆర్టీయూ సంఘ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి ఎంఈవో, పీజీ హెచ్ఎం పోస్టులను నేరుగా భర్తీ చేస్తామని గురువారం అసెంబ్లీలో పేర్కొన్నారని, దీంతో ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందన్నారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేసే పోస్టులను నేరుగా భర్తీ చేస్తామనడం సరికాదన్నారు. ఏకీకృత సర్వీస్రూల్ తీసుకొచ్చిన తర్వాత ఎంఈవో, ఉప విద్యాధికారి, డైట్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సర్కార్ బడుల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడుతామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తోందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమ సంఘం అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిసి గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ నుంచి ఐదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు బోధిస్తామన్నారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలన్నారు. పంచాయతీకి ఒక పాఠశాలను కొనసాగిస్తే తమ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 9నెలల ఏరియర్స్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈనెల 10న మంచిర్యాలలోని పద్మావతి గార్డెన్లో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల సంఘ బాధ్యులు హాజరుకావాలని కోరారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మెట్టు ప్రహ్లాద్, సత్యనారాయణగౌడ్, రాజన్న, రమేశ్, ప్రకాశ్, రాజన్న, జిల్లా బాధ్యులు రవి కుమార్, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. -
'త్వరలో నూతన విద్యా విధానం'
హైదరాబాద్ : తెలంగాణలో ఈ ఏడాది నుంచి నూతన విద్యా విధానం అమల్లోకి తెస్తామని డిప్యూటి సీఎం కడియం శ్రీహరి అన్నారు. అసెంబ్లీలో మంగళవారం విద్యావిధానంపై చర్చ సందర్భంగా కడియం ఉద్వేగభరితంగా మాట్లాడారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ సరిదిద్దుకునే అవకాశాలున్నాయని, ఈ ఏడాది నుంచే ప్రైవేట్ పాఠశాలను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించామని, తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, నూతన భవనాల నిర్మాణాల కోసం రూ.1500 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి కడియం సభకు తెలిపారు. సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్‌లలో మంచి ఫలితాలు సాధిస్తున్నాయని కితాబిచ్చారు. వీసీల నియామకాలపై స్పందిస్తూ..వీసీలు, సరిపడా సిబ్బంది లేక యూనివర్శిటీలు అస్తవ్యస్తంగా మారాయని, ఏప్రిల్ 2లోగా అన్ని వర్సిటీలకు వీసీలను నియమిస్తామని కడియం పేర్కొన్నారు. -
వేసవిలో జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులు
♦ 3,670 మంది కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ ♦ జేఎల్స్ సంఘం డైరీ ఆవిష్కరణలో మంత్రి కడియం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేసే జూనియర్ లెక్చరర్లకు వేసవి సెలవుల్లో పదోన్నతులు, బదిలీలు కల్పించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కడియం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 3,670 మంది కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ప్రస్తుత పీఆర్సీ ద్వారా అందరికి వేతనాలు బాగున్నాయని, కాలేజీల్లో సరిపడా సిబ్బంది ఉంటారని, అందరూ బాగా పని చేయాలన్నారు. ప్రజల సొమ్మే వేతనాలుగా పొందుతున్నారు కాబట్టి ఉద్యోగులు కూడా ప్రజలకు జవాబుదారులేనని అన్నారు. ఇక ఇంటర్మీయెట్ బోర్డులో ఇప్పటికే 22 సేవలను ఆన్లైన్ చేశామని, త్వరలోనే మొత్తం సేవలను ఆన్లైన్ చేస్తున్నట్లు వెల్లడించారు. నేను ఇదే కుటుంబ సభ్యుడిని.. ‘మొదట జూనియర్ లెక్చరర్‌గా పని చేశాను కాబట్టి నేను ఇదే కుటుంబ సభ్యుడిని. ఇంటర్ విద్యాభివృద్ధి కోసం చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేటు కాలేజీలతో పోటీ పడలేకపోతున్నాయి. అందుకే ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్మీడియెట్ విద్యను ఉచితంగా అందిస్తున్నాం’ అని కడియం తెలిపారు. రూ.200 కోట్లతో భవనాలు, తాగునీరు, టాయిలెట్ వంటి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. 2 లక్షలకు పెరగాలి.. ప్రస్తుతం ప్రభుత్వ కాలేజీల్లో 1.5 లక్షల మంది చదువుకుంటున్నారని, లెక్చరర్లు బాగా పని చేసి వచ్చే ఏడాది ఈ సంఖ్యను 2 లక్షలకు పెంచాలని కడియం శ్రీహరి సూచించారు. కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాల పెంపునకు సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం అమలుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వచ్చే 2 నెలల్లో వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ, వసతుల కల్పన, లెక్చరర్ల నియామకం, ఉచిత విద్యతో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇంటర్మీడియెట్ విద్యతో 408 ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఈసారి ఒక్కరూ చేరలేదని, ప్రభుత్వ చర్యల వల్లే ఇది సాధ్యమైందని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. -
‘ఇన్చార్జి’ పాలనతో ఇబ్బందులు
49మండలాలకు ఇన్చార్జి ఎంఈవోలే దిక్కు గాడి తప్పుతున్న విద్యావ్యవస్థ కురవి : ‘పాఠశాల విద్యను బలోపేతం చేస్తాం.. కనీస సౌకర్యాలు కల్పిస్తాం.. ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించి నాణ్యమైన విద్య అందిస్తా’మంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలకు వాస్తవ రూపంలో కనిపించడంలేదు. రేషనలైజేషన్ బదిలీలు పూర్తయ్యూరుు. అన్ని బడులకు పంతుళ్లు చేరారు. కానీ, పర్యవేక్షించే ఎంఈవోలే లేరు. వారిస్థానంలో ఇన్చార్జీలు బాధ్యలు నిర్వర్తించడం తో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారి పోతోంది. డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇలాఖాలోనే ఇన్చార్జీ పాలతో విద్యావ్యవస్థ గాడితప్పుతోంది. జిల్లాలోని మైదాన ప్రాంతాల్లో 489 జెడ్పీ హైస్కూళ్లు, ఏజెన్సీలో 22 ఉన్నారుు. మైదాన ప్రాంతాల్లో ప్రాథమికోన్నత పాఠశాలలు 318, ఏజెన్సీలో 38, ప్రాథమిక పాఠశాలలు ఏజెన్సీలో 181, మైదాన ప్రాంతంలో 1,881 నిర్వహిస్తున్నారు. వీటితోపాటు కస్తూర్బాగాంధీ, ఆదర్శ, ఆశ్రమ, గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటి పనితీరు పర్యవేక్షణకు ఎంఈవో వ్యవస్థ ఉండాలి. మండలానికి ఎంఈవో, డివిజన్లో డిప్యూటీ విద్యాశాఖాధికారి ఉంటారు. అరుుతే, జిల్లాలోని 51 మండలాలకు గాను 49 మండలాల్లో పీజీ హెచ్ఎంలను ఇన్చార్జి ఎంఈవోలుగా నియమించారు. వీరు పాఠశాల పనులు చక్కబెట్టుకున్నాక ఎంఈవో బాధ్యలు నిర్వర్తించడం తలకు మించిన భారమవుతోంది. ఆరోపణలు ఎదుర్కొన్న వారే విచారణకు..? మానుకోట డివిజన్లోని కొందరు ఇన్చార్జి ఎంఈవోలు పై పలు అవినీతి, ఆరోపణలు ఉన్నారుు. వీరిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తి కాకముందే ఇతర మండలానికి హెచ్ఎంలుగా బదిలీపై వెళ్లారు. అక్క డ విచారణ పూర్తి కాకముందే కొందరికి ఇన్చార్జి ఎంఈ వోల గా బాధ్యలు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. విచారణ ఎదుర్కొంటున్న వారిని ఆ హోదాలో ఎలా నియమిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీని పై వారే బదులు చెప్పాలని వారు అంటున్నారు. టీచర్ల బదిలీల్లో అక్రమాలపై విచారణ విద్యారణ్యపురి : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఫిర్యాదు మేరకు ఇటీవల జిల్లాలో చేపట్టిన టీచర్ల బదిలీల్లో చోటుచేసుకున్న అవకతకవలపై పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ టి.చిరంజీవులు ఆదేశం మేరకు విద్యాశాఖ అడిషనల్ డెరైక్టర్ సత్యనారాయణెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. ఈమేరకు హన్మకొండ డీఈవో కార్యాలయంలో జనగామ ఇన్చార్జి ఎంఈవో రాజనర్సింహాచారి నుంచి వివరాలు సేకరించారు. లింగాలఘనపూర్ ఇన్చార్జి ఎంఈవో చంద్రారెడ్డి నుంచి సైతం వాంగ్మూలం తీసుకున్నారు. పలువురు ప్రధానోపాయుల నుంచి వివరాలు సేకరించారు. స్పౌజ్కేటగిరీని రెండుసార్లు వినియోగించుకున్నారనే ఆరోపణపైనా విచారణ జరిపారు. ఇతర వివరాలపైనా ఆయన ఆరా తీశారు. డిప్యూటీ ఈవోల పరిధిలో వచ్చిన ఆరోపణలపైనా సమాచారం సేకరించారు. రికార్డులు, పలు ఫైళ్లను తన వెంట తీసుకెళ్లారు. డీఈవో వివరణను రికార్డు చేశారు. ఇన్చార్జి ఎంఈవోల నియూమకంలో జాప్యం విద్యారణ్యపురి : జిల్లాలో ఇటీవల చేపట్టిన పీజీ హెచ్ఎంల బదిలీల్లో సుమారు 20మంది ఇన్చార్జి ఎంఈ వోలకు స్థానచలనం కలిగింది. వారిస్థానాల్లో నేటికీ ఎవరినీ నియమించలేదు. ఫలితంగా పాలనా పరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కురవి, మహబూబాబాద్, నెల్లికుదరు, గూడూరు, కొత్తగూడ, పర్వతగిరి, సంగెం, రాయపర్తి, కొడకండ్ల, ఘనపూర్, రఘునాథపెల్లి, మద్దూరు, నర్మెట్ట, చేర్యాల, ఆత్మకూరు, గోవిం దరావుపేట, తాడ్వాయ్, మంగపేట, మొగుళ్లపెల్లి, నర్సింహులపేట ఇన్చార్జి ఎంఈవోలుగా వ్యవహరిస్తున్న పీజీ హెచ్ఎంలు ఈనెల 7 ఇతర మండలాల్లోని ఉన్నత పాఠశాలలకు పీజీహెచ్‌ఎంలుగా బదిలీ అయ్యారు. ఈనెల 8న విధుల్లో చేరారు. వీరిస్థానాల్లో నేటికీ ఎవరినీ నియమించలేదు. ఫలితంగా విద్యావ్యవస్థ గాడితప్పింది. ప్రధానంగా పాఠ్యపుస్తకాలు, కొన్ని టైటిల్స్, ఇతర సామగ్రి ఎంఈవోలే తీసుకెళ్లాల్సి ఉంటుంది. కనీసం ఇన్చార్జీలు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నారుు.