మంత్రి ఎదుట ముంపు బాధితుల నిరసన
Published Sat, Feb 11 2017 4:12 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM
వరంగల్: తమ గ్రామాన్ని ముంచేసే రిజర్వాయర్ వద్దంటూ రైతులు ఆందోళనకు దిగారు. హన్మకొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ముల్కనూర్‌లో సాగు నీటి జలాశయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం తలపెట్టింది. అయితే, ఈ రిజర్వాయర్ కారణంగా తమ గ్రామం ముంపునకు గురవుతుందంటూ ఆ గ్రామస్తులు మూడు లారీల్లో తరలివచ్చారు. హన్మకొండలోని సర్క్యూట్‌హౌజ్‌లో ఉన్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎదుట ఆందోళనకు దిగారు. డిప్యూటీ సీఎం గ్రామస్తులకు నచ్చజెప్పి వెనక్కి పంపేశారు. సోమవారం ఈ విషయమై మాట్లాడుదామంటూ వారికి సర్దిచెప్పారు.
Advertisement
Advertisement