49మండలాలకు ఇన్‌చార్జి ఎంఈవోలే దిక్కు
గాడి తప్పుతున్న విద్యావ్యవస్థ
కురవి : ‘పాఠశాల విద్యను బలోపేతం చేస్తాం.. కనీస సౌకర్యాలు కల్పిస్తాం.. ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించి నాణ్యమైన విద్య అందిస్తా’మంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలకు వాస్తవ రూపంలో కనిపించడంలేదు. రేషనలైజేషన్ బదిలీలు పూర్తయ్యూరుు. అన్ని బడులకు పంతుళ్లు చేరారు. కానీ, పర్యవేక్షించే ఎంఈవోలే లేరు. వారిస్థానంలో ఇన్‌చార్జీలు బాధ్యలు నిర్వర్తించడం తో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారి పోతోంది. డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇలాఖాలోనే ఇన్‌చార్జీ పాలతో విద్యావ్యవస్థ గాడితప్పుతోంది. జిల్లాలోని మైదాన ప్రాంతాల్లో 489 జెడ్పీ హైస్కూళ్లు, ఏజెన్సీలో 22 ఉన్నారుు.
మైదాన ప్రాంతాల్లో ప్రాథమికోన్నత పాఠశాలలు 318, ఏజెన్సీలో 38, ప్రాథమిక పాఠశాలలు ఏజెన్సీలో 181, మైదాన ప్రాంతంలో 1,881 నిర్వహిస్తున్నారు. వీటితోపాటు కస్తూర్బాగాంధీ, ఆదర్శ, ఆశ్రమ, గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటి పనితీరు పర్యవేక్షణకు ఎంఈవో వ్యవస్థ ఉండాలి. మండలానికి ఎంఈవో, డివిజన్‌లో డిప్యూటీ విద్యాశాఖాధికారి ఉంటారు. అరుుతే, జిల్లాలోని 51 మండలాలకు గాను 49 మండలాల్లో పీజీ హెచ్‌ఎంలను ఇన్‌చార్జి ఎంఈవోలుగా నియమించారు. వీరు పాఠశాల పనులు చక్కబెట్టుకున్నాక ఎంఈవో బాధ్యలు నిర్వర్తించడం తలకు మించిన భారమవుతోంది.
ఆరోపణలు ఎదుర్కొన్న వారే విచారణకు..?
మానుకోట డివిజన్‌లోని కొందరు ఇన్‌చార్జి ఎంఈవోలు పై పలు అవినీతి, ఆరోపణలు ఉన్నారుు. వీరిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తి కాకముందే ఇతర మండలానికి హెచ్‌ఎంలుగా బదిలీపై వెళ్లారు. అక్క డ విచారణ పూర్తి కాకముందే కొందరికి ఇన్‌చార్జి ఎంఈ వోల గా బాధ్యలు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. విచారణ ఎదుర్కొంటున్న వారిని ఆ హోదాలో ఎలా నియమిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీని పై వారే బదులు చెప్పాలని వారు అంటున్నారు.
టీచర్ల బదిలీల్లో అక్రమాలపై విచారణ
విద్యారణ్యపురి : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఫిర్యాదు మేరకు ఇటీవల జిల్లాలో చేపట్టిన టీచర్ల బదిలీల్లో చోటుచేసుకున్న అవకతకవలపై పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ టి.చిరంజీవులు ఆదేశం మేరకు విద్యాశాఖ అడిషనల్ డెరైక్టర్ సత్యనారాయణెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. ఈమేరకు హన్మకొండ డీఈవో కార్యాలయంలో జనగామ ఇన్‌చార్జి ఎంఈవో రాజనర్సింహాచారి నుంచి వివరాలు సేకరించారు.
లింగాలఘనపూర్ ఇన్‌చార్జి ఎంఈవో చంద్రారెడ్డి నుంచి సైతం వాంగ్మూలం తీసుకున్నారు. పలువురు ప్రధానోపాయుల నుంచి వివరాలు సేకరించారు. స్పౌజ్‌కేటగిరీని రెండుసార్లు వినియోగించుకున్నారనే ఆరోపణపైనా విచారణ జరిపారు. ఇతర వివరాలపైనా ఆయన ఆరా తీశారు. డిప్యూటీ ఈవోల పరిధిలో వచ్చిన ఆరోపణలపైనా సమాచారం సేకరించారు. రికార్డులు, పలు ఫైళ్లను తన వెంట తీసుకెళ్లారు. డీఈవో వివరణను రికార్డు చేశారు.
ఇన్‌చార్జి ఎంఈవోల నియూమకంలో జాప్యం
విద్యారణ్యపురి : జిల్లాలో ఇటీవల చేపట్టిన పీజీ హెచ్‌ఎంల బదిలీల్లో సుమారు 20మంది ఇన్‌చార్జి ఎంఈ వోలకు స్థానచలనం కలిగింది. వారిస్థానాల్లో నేటికీ ఎవరినీ నియమించలేదు. ఫలితంగా పాలనా పరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కురవి, మహబూబాబాద్, నెల్లికుదరు, గూడూరు, కొత్తగూడ, పర్వతగిరి, సంగెం, రాయపర్తి, కొడకండ్ల, ఘనపూర్, రఘునాథపెల్లి, మద్దూరు, నర్మెట్ట, చేర్యాల, ఆత్మకూరు, గోవిం దరావుపేట, తాడ్వాయ్, మంగపేట, మొగుళ్లపెల్లి, నర్సింహులపేట ఇన్‌చార్జి ఎంఈవోలుగా వ్యవహరిస్తున్న పీజీ హెచ్‌ఎంలు ఈనెల 7 ఇతర మండలాల్లోని ఉన్నత పాఠశాలలకు పీజీహెచ్‌ఎంలుగా బదిలీ అయ్యారు. ఈనెల 8న విధుల్లో చేరారు. వీరిస్థానాల్లో నేటికీ ఎవరినీ నియమించలేదు. ఫలితంగా విద్యావ్యవస్థ గాడితప్పింది.
ప్రధానంగా పాఠ్యపుస్తకాలు, కొన్ని టైటిల్స్, ఇతర సామగ్రి ఎంఈవోలే తీసుకెళ్లాల్సి ఉంటుంది. కనీసం ఇన్‌చార్జీలు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నారుు.
‘ఇన్‌చార్జి’ పాలనతో ఇబ్బందులు
Published Thu, Jul 30 2015 4:30 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM
Advertisement
Advertisement