తెలంగాణకు సాహిత్య అకాడమీ అవసరం
మంత్రి కడియం శ్రీహరి
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన, ఊహించని సాహిత్యం వెలుగులోకి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలుగు వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరిం చుకుని శుక్రవారం రాత్రి ఇక్కడ ప్రముఖ కవి నందిని సిధారెడ్డికి సాహితీరంగంలో విశిష్ట పురస్కారం ప్రదానం చేశారు. కడియం మాట్లాడుతూ సాహిత్య పరిశోధన, నిరంతర అధ్యయనం కోసం తెలంగాణకు ఒక సాహిత్య అకాడమీ అవసరమన్నారు. తెలంగాణ ఉద్య మం వేళ వచ్చిన సాహిత్యాన్ని పుస్తక రూపంలోకి తీసుకురావాలని తెలుగు వర్సిటీకి సూచిం చారు. తెలంగాణ ఉద్యమంలో ఉపన్యాసాల కంటే ఆయుధాల లాంటి పాటలే ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేశాయని, వాటిని సీడీ రూపంలో తీసుకువస్తే బాగుంటుందన్నారు.
మలిదశ ఉద్యమానికి సిద్ధిపేట కేంద్రంగా వ్యవహరించిందని, ఈ ప్రాంతానికి చెందిన ఎంతో మంది ఉద్య మానికి నాయకత్వం వహించారని పేర్కొ న్నారు. మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ సిధారెడ్డి జీవితం ఎంతో నిరాడంబ రంగా ఉంటుందని, వ్యక్తిగతంగా ఆయన తనకు ఎన్నో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని అన్నారు. 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయని, అప్పుడు తెలంగాణ వ్యతిరేకుల ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు సిధారెడ్డి ఇచ్చిన స్ఫూర్తి మరవలేని దన్నారు. తెలంగాణ రచరుుతల వేదికను స్థాపించి కవులందరినీ ఒక వేదికపైకి తీసుకు వచ్చారన్నారు. వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ వెలుగులోనికి వచ్చిన తెలంగాణ సాహిత్యాన్ని గ్రంథం చేస్తామని, తెలుగు ప్రాచీన కేంద్రాన్ని మైసూరు నుంచి హైదరాబాదుకు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. కన్నీళ్లు, కష్టాలే తనను నడిపించాయని సిధారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కవి దేశపతి శ్రీనివాస్, విద్యావేత్త వెల్చాల కొండలరావు, నమస్తే తెలంగాణ దినపత్రిక సంపాదకులు కట్టా శేఖర్‌రెడ్డి, వర్సిటీ రిజిస్ట్రార్ వి.సత్తిరెడ్డి పాల్గొన్నారు.