సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యా భివృద్ధికి జేఎన్‌టీయూహెచ్ సరికొత్త కార్యచరణకు ఉపక్రమించింది. విద్యార్థులు కోర్సు పూర్తికాగానే ఉద్యోగం పొందాలంటే.. ఇంజనీరింగ్ కొనసాగుతున్న సమయంలోనే వారిలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలని జేఎన్‌టీయూహెచ్ నిర్ణయించింది. ఇందుకు పరిశ్రమల సహకారాన్ని తీసుకు నేందుకు సిద్ధమైంది. ఈ మేరకు శనివారం ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో సీఐఐ (కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ)తో ఒప్పందం కుదుర్చుకుంది.
కోర్సుకు సంబంధించి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సంబంధిత పరిశ్రమల్లో ప్రాజెక్టు, అప్రెంటిస్‌షిప్‌నకు అవకాశం కల్పిస్తారు. పారిశ్రామిక వేత్తలు, సీనియర్లతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జేఎన్‌టీయూహెచ్, సీఐఐల మధ్య ఒప్పందంతో విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య ఉన్న అంతరాలు తొలగిపోతాయని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
సీఐఐతో జేఎన్‌టీయూహెచ్ ఒప్పందం
Published Sun, Sep 24 2017 2:04 AM | Last Updated on Sun, Sep 24 2017 2:04 AM
Advertisement