CII meeting
-
రాజకీయాలు వేరు.. పారిశ్రామిక విధానం వేరు: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సుదీర్ఘ లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీ రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారి ప్రతి పైసాకు రక్షణ కల్పిస్తామన్నారు. పారిశ్రామిక అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా.. అన్ని ప్రాంతాల్లో జరగాలని సూచించారు. తమది ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానమని.. హైదరాబాద్ తరహా రాష్ట్రమంతటా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలన్నారు రేవంత్. అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సహం అందిస్తామన్నారు. తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నామని తెలిపారు. అర్బన్ క్లస్టర్, సెమీ అర్బన్ క్లస్టర్, రూరల్ క్లస్టర్లుగా పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ప్రాంతం అర్బన్ క్లస్టర్‌గా, ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్, ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రాంతమంతా రూరల్ క్లస్టర్‌గా విభజించనున్నట్లు సీఎం చెప్పారు. ఎన్నికలు వేరు, రాజకీయాలు వేరు, పారిశ్రామిక విధానం వేరని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులతో సమీక్ష హైదరాబాద్‌కు నలువైపులా జనావాసాలకు దూరంగా నాలుగు డంప్ యార్డులు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష చేపట్టారు. హైదరాబాద్ నగరం మొత్తానికి జవహర్‌నగర్ డంప్ యార్డు ఒక్కటే ఉండడం వల్ల ఆ ప్రాంతంలో వాయు, నీటి కాలుష్యం జరుగుతోందని అన్నారు. చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. గచ్చిబౌలి టూ ఏయిర్‌పోర్టుకు మెట్రో అంత ఉపయోగకరంగా ఉండదని తెలిపారు. గౌలిగూడ, ఫలక్నామ, ఏయిర్పోర్టు రూట్లో మెట్రో వేస్తామని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 55 కిలోమీటర్ల మేరా మెట్రో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. చార్మినార్, గోల్కొండ, తారామతి బారామతి వంటి వాటిని కలుపుకుని టూరిజం సర్క్యూట్ యూనిట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ (పీపీపీ) మోడల్లో పెట్టుబడులు పెడతామని తెలిపారు. మూసీ నదిపై చెక్ డ్యాంలు నిర్మించి, వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. సీఎం ఆఫీసు మార్పు! తెలంగాణ డా.అంబేద్కర్ సచివాలయంలో 6వ అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని 9వ అంతస్తుకు మార్చుకునే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 9వ అంతస్తును సీఎం రేవంత్ పరిశీలించారు. 9వ అంతస్తులో ఆఫీసుకు జీఏడీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ 9 కావడంతో 9వ అంతస్తుకు తన ఆఫీసును మార్చుకుంటుంన్నారంటన్నాయి సచివాలయ వర్గాలు. చదవండి: రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ -
ప్రగతి పథంలో తెలంగాణ: మంత్రి కేటీఆర్
-
బిమ్స్టెక్తో ముందుకు!
న్యూఢిల్లీ: దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం(సార్క్)తో కొన్ని సమస్యలున్న నేపథ్యంలో బిమ్స్టెక్ దేశాల సాయంతో ప్రాంతీయ సహకారాన్ని మెరుగు పరుచుకునేందుకు భారత్ కృషి చేస్తుందని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. గడిచిన ఐదేళ్లలో అంతర్జాతీయంగా భారత్ స్థాయి పెరిగిందని ప్రజలు గుర్తించారని, అందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి మరోసారి అధికారమిచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా సంభవించిన పరిణామాలు మారిన సమీకరణాలతో చైనా ప్రాముఖ్యం పెరిగిందని, అదేవిధంగా భారత్ పలుకుబడి కూడా విస్తరించిందని అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) గురువారం ఇక్కడ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘ప్రాంతీయ అనుసంధానతకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. అయితే, సార్క్‌తో సమస్యలున్నాయి. అదేమిటో మనందరికీ తెలుసు. ఉగ్రవాద అంశాన్ని పక్కన పెట్టినప్పటికీ అనుసంధానత, వాణిజ్యం వంటి వాటిల్లోనూ ఇబ్బందులున్నాయి. అందుకే ఆర్థిక అభివృద్ధికి, ప్రాంతీయ సమగ్రతకు సార్క్ కంటే బిమ్స్‌టెక్‌నే కీలకంగా భావిస్తున్నాం’ అని తెలిపారు. డబ్లు్యటీవో ఆశించిన ఫలితాలను ఇవ్వనందునే పలు దేశాలు స్వేచ్ఛావాణిజ్య ఒప్పందా(ఎఫ్‌టీఏ)లను కుదుర్చుకునేందుకు చొరవచూపుతున్నాయని తెలిపారు. బిమ్స్టెక్లో బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, నేపాల్, భూటాన్ ఉన్నాయి. -
సీఐఐతో జేఎన్టీయూహెచ్ ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యా భివృద్ధికి జేఎన్టీయూహెచ్ సరికొత్త కార్యచరణకు ఉపక్రమించింది. విద్యార్థులు కోర్సు పూర్తికాగానే ఉద్యోగం పొందాలంటే.. ఇంజనీరింగ్ కొనసాగుతున్న సమయంలోనే వారిలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలని జేఎన్టీయూహెచ్ నిర్ణయించింది. ఇందుకు పరిశ్రమల సహకారాన్ని తీసుకు నేందుకు సిద్ధమైంది. ఈ మేరకు శనివారం ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో సీఐఐ (కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. కోర్సుకు సంబంధించి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సంబంధిత పరిశ్రమల్లో ప్రాజెక్టు, అప్రెంటిస్‌షిప్‌నకు అవకాశం కల్పిస్తారు. పారిశ్రామిక వేత్తలు, సీనియర్లతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జేఎన్టీయూహెచ్, సీఐఐల మధ్య ఒప్పందంతో విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య ఉన్న అంతరాలు తొలగిపోతాయని కడియం శ్రీహరి పేర్కొన్నారు. -
'దమ్ముంటే పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయ్'
-
'దమ్ముంటే పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయ్'
విజయవాడ: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సహించలేకపోతున్నదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పీ మధు విమర్శించారు. విద్యార్థులు, ఉద్యమకారులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నదని ఆయన మండిపడ్డారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు బోగస్ అని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని సుజనా చౌదరి పందులతో పోల్చడం అనాగరికమని మండిపడ్డారు. హోదా వచ్చేవరకు అందరం కలిసి పోరాడుదామని ఆయన పేర్కొన్నారు. -
అనుబంధ రంగాలకు ‘ప్రాధాన్యత’
సాక్షి, హైదరాబాద్ : నూతన పారిశ్రామిక విధానానికి వస్తున్న స్పందన నేపథ్యంలో పరిశ్రమలకు అనుబంధంగా ఉండే రంగాలకు (పాధాన్యత రంగాలు) కూడా ప్రత్యేక పాలసీలు రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పాలసీలపై కసరత్తు పూర్తి చేసి విధి విధానాలు ప్రకటించాలని నిర్ణయించింది. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, భౌగోళిక అనుకూలతలు, మానవ వనరులు, ముడి సరుకుల లభ్యత తదితరాలపై నిపుణులు ఇదివరకే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా రాష్ట్రంలో 14 పారిశ్రామిక అనుబంధ రంగాల పురోభివృద్ధికి అవకాశముందని అంచనా వేసి పారిశ్రామిక విధానంలో అంతర్భాగంగా చేర్చారు. లైఫ్ సెన్సైస్, ఐటీ, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, టెక్స్టైల్, ప్లాస్టిక్, గృహోపకరణాలు, లోహ పరిశ్రమ, వజ్రాభరణాలు, వేస్ట్ మేనేజ్మెంట్, పునరుత్పాదక ఇంధనం, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, రవాణా సౌకర్యాలకు సంబంధించిన రంగాలను ప్రాధాన్యత రంగాలుగా గుర్తించారు. నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ఇప్పటి వరకు రెండు విడతల్లో 36 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. వీటి ద్వారా రూ.2,588 కోట్ల పెట్టుబడులు, 8,638 మందికి ఉపాధి దక్కుతుందని అంచనా. ఈ నేపథ్యంలో గుర్తించిన 14 ప్రాధాన్యత రంగాలకు కూడా వేర్వేరుగా ప్రత్యేక పాలసీలు రూపొందిస్తే పెట్టుబడులు వెల్లువలా వస్తాయని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రతీ రంగానికి సంబంధించి ప్రభుత్వ విధానం, ప్రోత్సాహకాలు, రాయితీలు తదితరాలకు సంబంధించి ప్రత్యేక పాలసీల్లో పూర్తి స్పష్టత ఇవ్వనున్నారు. కాగా, పన్నుల వసూలు విధానంపై స్పష్టత లేకపోవడాన్ని పారిశ్రామిక వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా రూపొందిస్తున్న ప్రత్యేక పాలసీల్లో ఈ అంశంపైనా స్పష్టత ఇవ్వనున్నారు. మౌలిక సదుపాయాలపైనా దృష్టి.. రాష్ట్రాన్ని పెట్టుబడుల ధామంగా మార్చేం దుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడమే మార్గమని ప్రభుత్వం భావిస్తోం ది. పెట్టుబడులు ఆకర్షించేందుకే పరిమితం కాకుండా మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తామని చెప్తోంది. ఇందులో భాగంగా పారిశ్రామిక వాడలకు అనుబంధంగా ప్రత్యేక నివాస సముదాయాలు నిర్మించే ఆలోచనలో ఉంది. ఇటీవల జరిగిన సీఐఐ సమావేశంలో పారిశ్రామిక వాడల సమీపంలో శాటిలైట్ టౌన్‌షిప్‌ల ఏర్పాటు ఆలోచనను సీఎం ప్రస్తావించారు. ఇళ్ల నిర్మాణానికి పరిశ్రమలకే భూములు కేటాయించాలా లేక ప్రభుత్వమే నివాస సముదాయాలను అభివృద్ధి చేయాలా అనే అంశంపై కసరత్తు చేయనుంది.