
'దమ్ముంటే పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయ్'
విజయవాడ: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సహించలేకపోతున్నదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పీ మధు విమర్శించారు. విద్యార్థులు, ఉద్యమకారులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నదని ఆయన మండిపడ్డారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు.
విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు బోగస్ అని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని సుజనా చౌదరి పందులతో పోల్చడం అనాగరికమని మండిపడ్డారు. హోదా వచ్చేవరకు అందరం కలిసి పోరాడుదామని ఆయన పేర్కొన్నారు.