Chief Chandrasekhar Rao
-
సీఎం ఇంటి వరకు సైకిల్‌యాత్ర
ఖానాపూర్ : ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకై అఖిలపక్షాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఢిల్లీకి తీసుకెళ్లాలని లేకపోతే మాదిగ విద్యార్థి సమైఖ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుంచి సీఎం కేసీఆర్ ఇంటి వరకు సైకిల్‌యాత్ర కొనసాగిస్తామని ఆ సంఘం జిల్లా కో-ఆర్డినేటర్ బిక్కి మురళికృష్ణ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రెస్‌భవన్‌లో చలో ఢిల్లీ కరపత్రాలు విడుదల చేశారు. జూన్ 10న సెంట్రల్ యూనివర్సిటీలో ప్రారంభమైన సైకిల్ యాత్ర జులై 18న సీఎం కేసీఆర్ ఇంటికి చేరడంతో ముగుస్తుందన్నారు. జిల్లాలోను ఈ నెల 4న జన్నారంలో ప్రారంభమై 7వ తేదీన బాసరలో ముగుస్తుందన్నారు. ఈ నెల 5న ఖానాపూర్‌లో సైకిల్‌యాత్ర ఉంటుందన్నారు. సైకిల్‌యాత్ర అనంతరం జులై 19 నుంచి అగస్టు 12 వరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహా ప్రదర్శన, ధర్నాలు, దీక్షలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల కన్వీనర్ చెట్పల్లి రాజశేఖర్, ఎంఎస్ఎఫ్ నియోజకవర్గ ఇన్చార్జి జన్నారపు ప్రవీణ్, నాయకులు మంద హరీశ్, చెట్పల్లి గణేశ్, జూకింది శ్రీకాంత్, సేర్ల సాయి తదితరులున్నారు. -
చదువుతోనే బంగారు తెలంగాణ
► అంకితభావంతో మంచి ఫలితాలు ► కొల్లాపూర్‌ను ఆదర్శంగా నిలపాలి ► విద్యాశాఖ సమీక్షలో మంత్రి జూపల్లి కొల్లాపూర్‌రూరల్: చదువుతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కలలుగంటున్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని మహబూబ్ ఫంక్షన్హాల్లో నియోజకవర్గ స్థాయి విద్యా శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథులుగా మం త్రి జూపల్లి కృష్ణారావు, డీఈఓ విజయలక్ష్మిబాయి, ఆర్వీఎం పీడీ గోవిందరాజులు హాజరయ్యారు. ఈసందర్భం గా జూపల్లి మాట్లాడుతూ ఉపాధ్యాయులంతా అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. నియోజకవర్గంలోని ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి వందశాతం అక్షరాస్యతను పెంచడానికి కృషిచేయాలని సూచించారు. కొల్లాపూర్‌ను ఆదర్శంగా నిలపాలి... 2016-17లో తెలంగాణ రాష్ట్రానికే కొల్లాపూర్ ఆదర్శవంతంగా ఉండేలా నియోజకవర్గంలోని ఉపాధ్యాయులతోపాటు ప్రజాప్రతినిధులు, ప్ర జలంతా కృషిచేయాలన్నారు. నియోజకవర్గంలో ని పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సమస్యలను పరిష్కరించటానికి తనవంతుగా కోటి రూపాయలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో మాట్లాడి రూ.3 కోట్లు మంజూరు చేయిస్తానన్నారు. గ్రామంలోని సగం మందికి ఉపాధి కల్పించాలన్నారు. ఆగస్ట్ 15 వరకు పాఠశాలల్లో టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి మండలానికి రూ.4 ఇచ్చేలా చూస్తామన్నారు. త్వరలో అన్ని మండలాల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. బెస్ట్ సూపర్వైజర్లుగా హెచ్ఎంలు: డీఈఓ గ్రామాలలో ఉన్న పాఠశాలల హెచ్ఎంలు బెస్ట్ సూపర్వైజర్లుగా వ్యవహరించి ఉపాధ్యాయులను ఐక్యం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని డీఈఓ విజయలక్ష్మిబాయి అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను డిప్యూటేషన్ల ద్వారా భర్తీ చేయాలని ఆమె ఆదేశించారు. సమావేశంలో ఆర్వీఎం పీడీ గోవిందరాజులు, ఎంపీపీలు చిన్న నిరంజన్‌రావు, వెంకటేశ్వర్రావు, రాంమోహన్‌రావు, జెడ్పీటీసీ హన్మంతునాయక్, సింగిల్‌విండో చైర్మన్ రఘుపతిరావు, డిప్యూటీ డీఈఓ రవీందర్, ఎంఈఓలు ఉన్నారు. ఆగస్టు నాటికి 4లక్షల ఎకరాలకు సాగునీరు కొల్లాపూర్ రూరల్: బీమా, జూరాల పెండింగ్ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి వచ్చే ఆగస్ట్ నాటికి 4లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొల్లాపూర్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఖరీఫ్ నాటికి ఎంజీఎల్‌ఐ బీమా పథకం ద్వారా కొల్లాపూర్ నియోజకవర్గ రైతాంగానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. -
ఐపాస్‌తో జొష్
ఆత్మకూరు, గీసుకొండ, హసన్‌పర్తి, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, రఘునాథపల్లి, సంగెం, జఫర్‌గఢ్, ములుగు, వెంకటాపురం, నెల్లికుదురు, మహబూబాబాద్, రేగొండ, మరిపెడ, కేసముద్రం, ఖానాపురం, కురవి, గణపురం, చేర్యాలలో పరిశ్రమల స్థాపనకు అనుకులించే స్థలాలు ఉన్నట్లుగా గుర్తించారు. రోడ్డు, రైలు రవాణా మార్గాలు ఉన్న ప్రాంతాలు ప్రామాణికంగా తీసుకున్నారు. - పారిశ్రామిక రంగం.. ఇక పరుగులు - నూతన పారిశ్రమికవేత్తల్లో చిగురిస్తున్న ఆశలు - 20 మండలాల్లో అనువైన ప్రాంతాలగుర్తింపు పోచమ్మమైదాన్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించిన నూతన పారిశ్రామిక విధానం జిల్లాలో పరిశ్రమల రంగానికి ఊతమివ్వనుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ సెల్ఫ్ సర్టిఫికేషన్(టీఎస్ ఐపాస్)తో జిల్లాకు మరిన్ని పరిశ్రమలు రానున్నాయి. ఇప్పటికే రెండో రాజధానిగా విరాజిల్లుతున్న వరంగల్‌లో పారిశ్రామికరంగం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేయడంతో జిల్లాలో దేశీయ పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో నూతన పరిశ్రమలను నెలకొల్పేందుకు తెలంగాణ రాష్ట్ర పారి శ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీఎస్ఐఐసీ) సమాయత్తమవుతోంది. ఈ సంస్థ ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక ప్రాంతాలకు అదనంగా 20 మండలాల్లో 24,679 ఎకరాల స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ములుగు రోడ్, ఆటోనగర్, మడికొండ, ధర్మసాగర్, జనగామ ప్రాంతాల్లో పరిశ్రమలు కొనసాగుతున్నాయి. ఐపాస్‌తో.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఐపాస్‌ను ప్రవేశ పెట్టింది. ఒకప్పుడు పరిశ్రమను స్థాపించాలంటే అన్ని అనుమతుల కోసం చాలా ఇబ్బందులు పడే వారు. ఇప్పుడు కొత్తగా ఐపాస్ తీసుకరావడంతో ఇబ్బందులు తగ్గా యి. ఒకప్పుడు జిల్లా పరిశ్రమల శాఖ, కాలుష్య ని యంత్రణ మండలి, విద్యుత్ ఇతర శాఖల నుంచి అనుతమలు తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు జిల్లా పరిశ్రమల కేంద్రంలో ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూ ర్తి వివరాలతో కూడిన దరఖాస్తును అందజేయాలి. దీంతో ఆ శాఖ వారు వారంతో రెండు రోజులు ఐపాస్ కోసం ప్రత్యేకంగా అన్ని శాఖ అధికారులను ఒక వేదిక పైకి తీసుకొచ్చి దరఖాస్తులు అందజేసి చి న్న పరిశ్రమ అయితే 15 రోజులు లోపు, పెద్ద పరి శ్రమ అయితే 30 రోజుల లోపు అన్ని పూర్తి చేసి ఇ వ్వాలి. లేనిచో సంబంధిత ఉద్యోగిపై రోజుకు రూ. 1000 చొప్పున కలెక్టర్ జరిమాన విధించనున్నారు. మూడు రకాలుగా గుర్తింపు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించే బాధ్యతను ప్రభుత్వం టీఎస్ఐ ఐసీకి అప్పగించింది. జిల్లా రెవెన్యూ అధికారుల స హకారంతో పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉ న్న ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. జిల్లాలో మూడు గ్రేడ్లుగా స్థలాలను గుర్తించారు. ఏ గ్రేడ్ విభాగంలో 9,259, బీ గ్రేడ్ విభాగంలో 11,091, సీ గ్రేడ్ విభాగంలో 4,329 ఎకరాల స్థలాలను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ భూములను టీఎస్ఐసీసీకి బదిలి చేస్తే వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించి ఔత్సాహిక పారిశ్రమిక వేత్తలకు అప్పగించనున్నారు. జిల్లాలో దాదాపు 40 వేలకు పైగా కొత్త పారిశ్రమిక విధానం ద్వారా పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినట్లు అవుతుంది. ఇక వలసలకు సెలవు ఉన్నత చదువులు చదివిన యువతకు జిల్లాలో ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో హైదారాబాద్, బెంగుళూరు, చెన్నయ్, ముంబయి, ఢిల్లీ, కోల్కత్త తదితర ప్రాంతాలతోపాటు అమెరికా, జపాన్, శ్రీలంక, దూబయ్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాలకు అప్పులు చేసి వలస వెళ్తున్నారు. ఇంకొంత మంది అంత దూరం వెళ్లలేక జిల్లాలో చిన్నచిన్న సంస్థల్లో పని చేస్తు కాలం వెళ్లదీస్తున్నారు. వీటన్నింటికి సెలవు పెట్టెయోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో జిల్లాకు పూనర్వైభవం రానుంది. ల్యాండ్ బ్యాంక్‌ను ప్రభుత్వంకు అందజేశాం.. జిల్లాలోని రెవె న్యూ అధికారుల సహాయంతో జిల్లాలో రవాణాకు అనుకుల ప్రాంతాలు గుర్తించి పరిశ్రమలు అనువైన ప్రాంతాల మండలాల పేర్లు, సర్వే నంబర్లతో కూడిన ల్యాండ్ బ్యాంక్‌ను ప్రభుత్వంకు అందజేశాం. ప్రభుత్వం కేటాయించగానే వాటిలో మౌలిక వసతులు కల్పించి పరిశ్రమల స్థాపనకు స్థలాలు కేటాయిస్తాం. జిల్లాలో 24,679 ఎకరాల ప్రభుత్వ భూమిని ల్యాండ్ బ్యాంక్‌గా గుర్తించాము. -డి.రవి, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ -
గుట్ట అభివృద్ధికి 100 కోట్లు: ఇంద్రకరణ్‌రెడ్డి
హైదరాబాద్: యాదగిరిగుట్టను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు అధికారులు త్వరితగతిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 800 ఎకరాల అటవీ భూములను సేకరించారు. మరో 1200 ఎకరాల ప్రైవేటు భూములను సేకరించేందుకు వాటి ధరలను ఖరారు చేసే పనిలో ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం పనుల పురోగతిపై సమీక్షించారు. భూసేకరణ, గుట్టపైన, కింద అభివృద్ధి పనులు, వేద పాఠశాలలు, భక్తుల వసతి గృహాల నిర్మాణం, ఇతర పనుల కోసం రూ.100 కోట్లు అవసరమని ఇప్పటికే గుర్తించారు. వీటిని వచ్చే బడ్జెట్లో కేటాయించాలని సమావేశంలో తీర్మానించారు. -
ఐఏవై కింద రాష్ట్రానికి 60 వేల ఇళ్లు
కేంద్రం ఔదార్యంతో తెలంగాణకు లబ్ధి కొత్తగా ఒక్క ఇల్లు నిర్మించకుండానే ఖాతాలోకి రూ.374 కోట్లు ఇందిరమ్మ ఇళ్లనే ఆ ఖాతాలో చూపబోతున్న అధికారులు హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రాష్ట్ర ఖజానాకు భారంగా పరిణమించిన తరుణంలో కేంద్రప్రభుత్వ ఔదార్యం కారణంగా రాష్ట్రఖాతాలోకి రూ.374 కోట్లు చేరనున్నాయి. అదనంగా 60 వేల ఇళ్లను ఇందిర ఆవాస్ యోజన (ఐఏవై) కింద మంజూరు చేయడం ద్వారా ఈ మొత్తాన్ని కేంద్రం ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో అయితే అదనంగా ఒక్క ఇంటిని కూడా నిర్మించాల్సిన అవసరం లేకుండా ఈ సొమ్మును పొందేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగున్నర లక్షల పేదల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. నాలుగు నెలలుగా వాటికి నయాపైసా విడుదల కాలేదు. దీంతో పనులు పడకేశాయి. బిల్లుల బకాయిలు రూ.450 కోట్లకు చేరుకున్నాయి. బిల్లుల కోసం లబ్ధిదారులు తిరుగుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. అది తేలితేగాని డబ్బు విడుదల చేయవద్దన్నట్టుగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరుణంలో కేంద్రం అదనంగా 60 వేల ఇళ్లను ఐఏవై కింద మంజూరు చేస్తానని తెలిపింది. కొన్ని రాష్ట్రాలు వాటిని తీసుకోనందున కోటా మిగిలిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరం 60 వేల ఐఏవై ఇళ్లు మంజూరు కాగా, తొలి విడత బడ్జెట్ కింద రూ.187 కోట్లను కొద్దిరోజుల క్రితమే విడుదల చేసింది. మలి దఫాగా మరో రూ.187 కోట్లు రానున్నాయి. ఇంకా అదనపు ఇళ్ల కోసం మరో రూ.374 కోట్లు ఇవ్వబోతోంది. దీంతో, ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లనే ఐఏవై కింద మార్చి ఆ మొత్తాన్ని పొందేందుకు గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. అంటే వివిధ దశల్లో ఉన్న నాలుగున్నర లక్షల ఇళ్లలోంచే వీటిని చూపుతారన్నమాట. ఆమేరకు కేంద్రానికి లెక్కలు కూడా సమర్పిస్తారు. దీంతో కేంద్రం రికార్డుల్లో ఐఏవై ఇళ్ల నిర్మాణం జరిగినట్టు నమోదవుతుంది. -
తెలంగాణ ఇంటర్ బోర్డుకు గ్రీన్‌సిగ్నల్
ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్ హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. దీనికి సంబంధించిన ఫైలుపై శనివారం సీఎం చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. త్వరలోనే బోర్డు ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం చెబుతుండగా... ఆ పరీక్షలను ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగానే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఇంటర్ బోర్డు అధికారులను రెండు రోజుల కిందటే విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. అయితే ప్రస్తుతమున్నది ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు కావడంతో.. ఎంతమేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను పాటిస్తారనే గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో తెలంగాణకు ప్రత్యేక ఇంటర్ బోర్డు ఏర్పాటుకు రెండు రోజుల కిందట న్యాయశాఖ ఆమోదం తెలిపింది. తాజా ఈ ఫైల్‌పై సీఎం సంతకం చేశారు. దీంతో తెలంగాణ ఇంటర్ బోర్డును ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధమైంది. కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమాలపై విచారణ ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని ఇంజనీరింగ్ కాలేజీలో రూ. 2 కోట్ల దుర్వినియోగంపై మంత్రి జగదీశ్‌రెడ్డి ఏసీబీ విచారణకు ఆదేశించారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆ కాలేజీలో నిధుల దుర్వినియోగం జరిగిందని మంత్రికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆ వ్యవహారంపై విచారణ జరపాలని మంత్రి ఏసీబీ డెరైక్టర్ జనరల్‌ను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.