సీఎం ఇంటి వరకు సైకిల్‌యాత్ర
ఖానాపూర్ : ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకై అఖిలపక్షాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఢిల్లీకి తీసుకెళ్లాలని లేకపోతే మాదిగ విద్యార్థి సమైఖ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుంచి సీఎం కేసీఆర్ ఇంటి వరకు సైకిల్‌యాత్ర కొనసాగిస్తామని ఆ సంఘం జిల్లా కో-ఆర్డినేటర్ బిక్కి మురళికృష్ణ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రెస్‌భవన్‌లో చలో ఢిల్లీ కరపత్రాలు విడుదల చేశారు. జూన్ 10న సెంట్రల్ యూనివర్సిటీలో ప్రారంభమైన సైకిల్ యాత్ర జులై 18న సీఎం కేసీఆర్ ఇంటికి చేరడంతో ముగుస్తుందన్నారు.
జిల్లాలోను ఈ నెల 4న జన్నారంలో ప్రారంభమై 7వ తేదీన బాసరలో ముగుస్తుందన్నారు. ఈ నెల 5న ఖానాపూర్‌లో సైకిల్‌యాత్ర ఉంటుందన్నారు. సైకిల్‌యాత్ర అనంతరం జులై 19 నుంచి అగస్టు 12 వరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహా ప్రదర్శన, ధర్నాలు, దీక్షలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ మండల కన్వీనర్ చెట్‌పల్లి రాజశేఖర్, ఎంఎస్‌ఎఫ్ నియోజకవర్గ ఇన్‌చార్జి జన్నారపు ప్రవీణ్, నాయకులు మంద హరీశ్, చెట్‌పల్లి గణేశ్, జూకింది శ్రీకాంత్, సేర్ల సాయి తదితరులున్నారు.