హైదరాబాద్: యాదగిరిగుట్టను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు అధికారులు త్వరితగతిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 800 ఎకరాల అటవీ భూములను సేకరించారు. మరో 1200 ఎకరాల ప్రైవేటు భూములను సేకరించేందుకు వాటి ధరలను ఖరారు చేసే పనిలో ఉన్నారు.
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం పనుల పురోగతిపై సమీక్షించారు. భూసేకరణ, గుట్టపైన, కింద అభివృద్ధి పనులు, వేద పాఠశాలలు, భక్తుల వసతి గృహాల నిర్మాణం, ఇతర పనుల కోసం రూ.100 కోట్లు అవసరమని ఇప్పటికే గుర్తించారు. వీటిని వచ్చే బడ్జెట్‌లో కేటాయించాలని సమావేశంలో తీర్మానించారు.
గుట్ట అభివృద్ధికి 100 కోట్లు: ఇంద్రకరణ్‌రెడ్డి
Published Wed, Feb 11 2015 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM
Advertisement
Advertisement