ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. దీనికి సంబంధించిన ఫైలుపై శనివారం సీఎం చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. త్వరలోనే బోర్డు ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం చెబుతుండగా... ఆ పరీక్షలను ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగానే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఇంటర్ బోర్డు అధికారులను రెండు రోజుల కిందటే విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. అయితే ప్రస్తుతమున్నది ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు కావడంతో.. ఎంతమేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను పాటిస్తారనే గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో తెలంగాణకు ప్రత్యేక ఇంటర్ బోర్డు ఏర్పాటుకు రెండు రోజుల కిందట న్యాయశాఖ ఆమోదం తెలిపింది. తాజా ఈ ఫైల్‌పై సీఎం సంతకం చేశారు. దీంతో తెలంగాణ ఇంటర్ బోర్డును ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధమైంది.
కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమాలపై విచారణ
ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని ఇంజనీరింగ్ కాలేజీలో రూ. 2 కోట్ల దుర్వినియోగంపై మంత్రి జగదీశ్‌రెడ్డి ఏసీబీ విచారణకు ఆదేశించారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆ కాలేజీలో నిధుల దుర్వినియోగం జరిగిందని మంత్రికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆ వ్యవహారంపై విచారణ జరపాలని మంత్రి ఏసీబీ డెరైక్టర్ జనరల్‌ను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ ఇంటర్ బోర్డుకు గ్రీన్‌సిగ్నల్
Published Sun, Oct 19 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM
Advertisement
Advertisement