ఆత్మకూరు, గీసుకొండ, హసన్‌పర్తి, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, రఘునాథపల్లి, సంగెం, జఫర్‌గఢ్, ములుగు, వెంకటాపురం, నెల్లికుదురు, మహబూబాబాద్, రేగొండ, మరిపెడ, కేసముద్రం, ఖానాపురం, కురవి, గణపురం, చేర్యాలలో పరిశ్రమల స్థాపనకు అనుకులించే స్థలాలు ఉన్నట్లుగా గుర్తించారు. రోడ్డు, రైలు రవాణా మార్గాలు ఉన్న ప్రాంతాలు ప్రామాణికంగా తీసుకున్నారు.
- పారిశ్రామిక రంగం.. ఇక పరుగులు
- నూతన పారిశ్రమికవేత్తల్లో చిగురిస్తున్న ఆశలు
- 20 మండలాల్లో అనువైన ప్రాంతాలగుర్తింపు
పోచమ్మమైదాన్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించిన నూతన పారిశ్రామిక విధానం జిల్లాలో పరిశ్రమల రంగానికి ఊతమివ్వనుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ సెల్ఫ్ సర్టిఫికేషన్(టీఎస్ ఐపాస్)తో జిల్లాకు మరిన్ని పరిశ్రమలు రానున్నాయి. ఇప్పటికే రెండో రాజధానిగా విరాజిల్లుతున్న వరంగల్‌లో పారిశ్రామికరంగం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేయడంతో జిల్లాలో దేశీయ పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో నూతన పరిశ్రమలను నెలకొల్పేందుకు తెలంగాణ రాష్ట్ర పారి శ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీఎస్‌ఐఐసీ) సమాయత్తమవుతోంది. ఈ సంస్థ ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక ప్రాంతాలకు అదనంగా 20 మండలాల్లో 24,679 ఎకరాల స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ములుగు రోడ్, ఆటోనగర్, మడికొండ, ధర్మసాగర్, జనగామ ప్రాంతాల్లో పరిశ్రమలు కొనసాగుతున్నాయి.
ఐపాస్‌తో..
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఐపాస్‌ను ప్రవేశ పెట్టింది. ఒకప్పుడు పరిశ్రమను స్థాపించాలంటే అన్ని అనుమతుల కోసం చాలా ఇబ్బందులు పడే వారు. ఇప్పుడు కొత్తగా ఐపాస్ తీసుకరావడంతో ఇబ్బందులు తగ్గా యి. ఒకప్పుడు జిల్లా పరిశ్రమల శాఖ, కాలుష్య ని యంత్రణ మండలి, విద్యుత్ ఇతర శాఖల నుంచి అనుతమలు తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు జిల్లా పరిశ్రమల కేంద్రంలో ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూ ర్తి వివరాలతో కూడిన దరఖాస్తును అందజేయాలి. దీంతో ఆ శాఖ వారు వారంతో రెండు రోజులు ఐపాస్ కోసం ప్రత్యేకంగా అన్ని శాఖ అధికారులను ఒక వేదిక పైకి తీసుకొచ్చి దరఖాస్తులు అందజేసి చి న్న పరిశ్రమ అయితే 15 రోజులు లోపు, పెద్ద పరి శ్రమ అయితే 30 రోజుల లోపు అన్ని పూర్తి చేసి ఇ వ్వాలి. లేనిచో సంబంధిత ఉద్యోగిపై రోజుకు రూ. 1000 చొప్పున కలెక్టర్ జరిమాన విధించనున్నారు.
మూడు రకాలుగా గుర్తింపు
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించే బాధ్యతను ప్రభుత్వం టీఎస్‌ఐ ఐసీకి అప్పగించింది. జిల్లా రెవెన్యూ అధికారుల స హకారంతో పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉ న్న ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. జిల్లాలో మూడు గ్రేడ్‌లుగా స్థలాలను గుర్తించారు. ఏ గ్రేడ్ విభాగంలో 9,259, బీ గ్రేడ్ విభాగంలో 11,091, సీ గ్రేడ్ విభాగంలో 4,329 ఎకరాల స్థలాలను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ భూములను టీఎస్‌ఐసీసీకి బదిలి చేస్తే వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించి ఔత్సాహిక పారిశ్రమిక వేత్తలకు అప్పగించనున్నారు. జిల్లాలో దాదాపు 40 వేలకు పైగా కొత్త పారిశ్రమిక విధానం ద్వారా పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినట్లు అవుతుంది.
ఇక వలసలకు సెలవు
ఉన్నత చదువులు చదివిన యువతకు జిల్లాలో ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో హైదారాబాద్, బెంగుళూరు, చెన్నయ్, ముంబయి, ఢిల్లీ, కోల్‌కత్త తదితర ప్రాంతాలతోపాటు అమెరికా, జపాన్, శ్రీలంక, దూబయ్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాలకు అప్పులు చేసి వలస వెళ్తున్నారు. ఇంకొంత మంది అంత దూరం వెళ్లలేక జిల్లాలో చిన్నచిన్న సంస్థల్లో పని చేస్తు కాలం వెళ్లదీస్తున్నారు. వీటన్నింటికి సెలవు పెట్టెయోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో జిల్లాకు పూనర్‌వైభవం రానుంది.
ల్యాండ్ బ్యాంక్‌ను ప్రభుత్వంకు అందజేశాం..
జిల్లాలోని రెవె న్యూ అధికారుల సహాయంతో జిల్లాలో రవాణాకు అనుకుల ప్రాంతాలు గుర్తించి పరిశ్రమలు అనువైన ప్రాంతాల మండలాల పేర్లు, సర్వే నంబర్‌లతో కూడిన ల్యాండ్ బ్యాంక్‌ను ప్రభుత్వంకు అందజేశాం. ప్రభుత్వం కేటాయించగానే వాటిలో మౌలిక వసతులు కల్పించి పరిశ్రమల స్థాపనకు స్థలాలు కేటాయిస్తాం. జిల్లాలో 24,679 ఎకరాల ప్రభుత్వ భూమిని ల్యాండ్ బ్యాంక్‌గా గుర్తించాము.
-డి.రవి, టీఎస్‌ఐఐసీ జోనల్ మేనేజర్
ఐపాస్‌తో జొష్
Published Tue, Jun 23 2015 4:06 AM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM
Advertisement