ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జి.బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు.
బాలరాజు, వెంకటేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జి.బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే తమకు పుట్టగతులుండవనే ఉద్దేశంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో వారు విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవులకు రాజీనామా చేయకుండా డీకే అరుణ పారిపోయారని, జూపల్లి కృష్ణారావు త్యాగం చేశారని, అలాంటి చరిత్ర ఉన్న ఆమె మంత్రి జూపల్లిపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తనకు, చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి ఎలాంటి విభేదాలు లేవని, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సంఘటన అనుకోకుండా జరిగిందని బాలరాజు తెలిపారు.