ఉనికి కోసమే పిచ్చి ఆరోపణలు | Jupally fires on Dk Aruna | Sakshi
Sakshi News home page

ఉనికి కోసమే పిచ్చి ఆరోపణలు

Published Sat, Apr 16 2016 2:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఉనికి కోసమే పిచ్చి ఆరోపణలు - Sakshi

ఉనికి కోసమే పిచ్చి ఆరోపణలు

డి.కె.అరుణపై జూపల్లి మండిపాటు

 సాక్షి, హైదరాబాద్: కేవలం ఉనికి చాటుకోవడం కోసమే కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌లో చేరడం కంటే బిచ్చమెత్తుకుని బతుకుతానని డి.కె.అరుణ చే సిన ప్రకటనపైనా మంత్రి స్పందించారు. ‘బిచ్చం ఎత్తుకోవడం కాదు, బిచ్చం ఎత్తుకునే వాళ్లను కూడా దోచుకునే నైజం వారిది’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాజీ ఎంపీ మందా జగన్నాథం, ఎమ్మెల్యే అంజయ్యతో కలసి విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ను చూసి కాదని, కాంగ్రెస్ మాటలను చూసే రాష్ర్ట ప్రజలు సిగ్గుపడుతున్నారని జూపల్లి అన్నారు.

అధికారం, పదవులే నైజంగా బతికిన వాళ్లు కాంగ్రెస్ నాయకులని విమర్శించారు. తరతరాలకు తరగని డబ్బులు సంపాదించుకున్నారని, తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ఏనాడూ కలసి రాని వాళ్లు తమకు చెప్పేదేందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. డి.కె. అరుణ సోదరుడు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరినా విమర్శిస్తున్నారని, చిట్టెం చేరికపై డి.కె.అరుణ, జానారెడ్డి ఎక్కడ లేని బాధను వెళ్లగక్కుతున్నారని మండి పడ్డారు. సీఎల్పీ పదవో, లేక పీసీసీ పదవో వస్తుందనే ఆశతోనే అరుణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారని, ఆ ఆశకూడా పోతే వారి దారికూడా ఇటే అని మంత్రి జూపల్లి వ్యాఖ్యానించారు. మరికొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. కాగా, నైతిక విలువలు ఉన్న వారు వాటి గురించి మాట్లాడితే మంచిదని మాజీ ఎంపీ మందా జగన్నాథం సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement