డీకే అరుణ భర్తకు నేతల పరామర్శ | Former Minister DK Aruna husband Bharata Simha Reddy injured in accident at Mahabubnagar district | Sakshi
Sakshi News home page

డీకే అరుణ భర్తకు నేతల పరామర్శ

Published Thu, Jun 8 2017 5:38 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

డీకే అరుణ భర్తకు నేతల పరామర్శ - Sakshi

డీకే అరుణ భర్తకు నేతల పరామర్శ

హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడిన గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ భర్త భరత్‌ సింహారెడ్డిని పలువురు నేతలు పరామర్శించారు. మంత్రి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డిలు గురువారం భరత సింహారెడ్డిని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భరతసింహారెడ్డి త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. 
 
కాగా భరత్‌సింహారెడ్డి బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న కారులో బెలూన్లు సకాలంలో తెరుచుకోవడంతో ప్రాణా పాయం తప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అప్పటికే రెండు కార్లు ఢీ కొనగా, భరతసింహా రెడ్డి ప్రమాణిస్తున్న కారు అందులో ఓ కారును ఢీ కొంది. దీంతో ఆయన ప్రయాణిస్తున్న కారు పూర్తిగా ధ్వంసం కాగా, భరతసింహారెడ్డి ఎడమ చేతికి గాయమైంది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement