‘పాలమూరు–రంగారెడ్డి’ జీవోపై సుప్రీంకోర్టుకు ఏపీ  | KWDT II turns down Andhra plea to stay Telangana GO allocating water | Sakshi
Sakshi News home page

‘పాలమూరు–రంగారెడ్డి’ జీవోపై సుప్రీంకోర్టుకు ఏపీ 

Published Fri, Sep 22 2023 6:10 AM | Last Updated on Fri, Sep 22 2023 11:48 AM

KWDT II turns down Andhra plea to stay Telangana GO allocating water - Sakshi

సాక్షి, అమరావతి: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలు కేటాయించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల(జీవో)ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ­యి­ంచింది. ఆ జీవోపై విచారణ చేపట్టడం తమ పరిధిలోకి రాదంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఇంటర్‌ లొకేటరీ అప్లికేషన్‌(ఐఏ)ను తిరస్కరిస్తూ కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌(కేడబ్ల్యూడీటీ–2) బుధవారం తీర్పు ఇచ్చింది.

ఈ అంశంపై మరో న్యాయస్థానాన్ని ఆశ్రయించే స్వేచ్చ ఏపీ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపుల వల్ల రాష్ట్ర హక్కులకు విఘా­­తం కలుగుతుందని నివేదించనుంది. ఆ జీవోను రద్దు చేయడం ద్వారా ఏపీ హక్కులను పరిరక్షించాలని సుప్రీంకోర్టుకు విన్నవించనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement