‘పాలమూరు’ పై విచారణకు ఆదేశించాలి
నాగం జనార్దన్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో వచ్చిన అవి నీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించి సీఎం కేసీఆర్ తన చిత్తశుద్ధిని, నిజాయితీని నిరూపించు కోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులో అవినీతిని కోర్టులు తప్పుపడితే కేసీఆర్ తప్పుకుంటా రా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా ఈ ప్రాజెక్టులోని అవినీతినిపై సత్వరం విచా రణ జరిపి చర్యలు తీసుకోవాలని డిసెంబర్ 21న విజిలెన్ప్ డీజీని కలసి కోరినట్లు తెలిపారు.
ఈ నివేదిను సీబీఐకి పంపి నిజాలు నిగ్గుతేల్చాలన్నారు. దీనికి సంబం ధించి 864 పేజీల నివేదికను సమర్పిం చానని, దీంట్లో ఒక్కపేజీ తప్పుగా ఉందని నిరూపించినా ఏ శిక్షకైనా సిద్ధమేనని చెప్పా రు. వచ్చేవారం జరగనున్న అసెంబ్లీ సమా వేశాల సందర్భంగా అన్ని రాజకీయపార్టీల సభ్యులను కలిసి సమాచారాన్ని ఇస్తామ నని అన్నారు.