గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడగొడతా: కోమటిరెడ్డి | Komati Reddy Venkat Reddy on kcr | Sakshi
Sakshi News home page

గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడగొడతా: కోమటిరెడ్డి

Published Wed, Jul 5 2017 2:12 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

Komati Reddy Venkat Reddy on kcr

చిట్యాల/కనగల్‌: వచ్చే ఎన్నికల్లో తాను గజ్వేల్‌ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగి సీఎం కేసీఆర్‌ను ఓడగొడతానని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాలలో, కనగల్‌ మండలం తెలకంటిగూడెంలో వేర్వేరుగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బోగస్‌ సర్వేలతో ప్రజలను మభ్యపెడుతోందని మండిపడ్డా రు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా త్వరలో దండయాత్ర.. జైత్రయాత్ర పేరిట పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. నకిరేకల్, సూర్యాపేట నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. అడవుల నుంచి వచ్చిన ఎమ్మెల్యే మళ్లీ అక్కడికే వెళ్లే సమయం ఆసన్నమైందని, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంనుద్దేశించి వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement