![అతిపొట్టి కారు](/styles/webp/s3/article_images/2017/09/3/71459877694_625x300.jpg.webp?itok=Q4ujBvdv)
అతిపొట్టి కారు
తిక్క లెక్క
రోడ్ల మీద తిరిగే కార్లలో ఎంత ‘నానో’లాంటి బుల్లి కారు అయినా కనీసం నాలుగైదు అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న కారు ఎత్తు మాత్రం అడుగున్నర కంటే కాస్తంత తక్కువే. కచ్చితంగా చెప్పాలంటే, దీని ఎత్తు 17.79 అంగుళాలు. జపాన్‌లోని అసాకుచికి చెందిన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విద్యార్థులు, అధ్యాపకులు దీనిని రూపొందించారు.
దీనికి ‘మిరాయి’ అని నామకరణం చేశారు. ‘మిరాయి’ అంటే జపానీస్ భాషలో ‘భవిష్యత్తు’ అని అర్థం. రోడ్ల మీద సంచరించడానికి కావలసిన అన్ని హంగులూ ఉన్న ఈ కారు అతి పొట్టి కారుగా గిన్నెస్ బుక్‌లోకి ఎక్కింది.