టాటా నానో.. సీఎన్జీ కారు రెడీ! | Tata Nano emax CNG launched at Rs 2.45 lakh | Sakshi
Sakshi News home page

టాటా నానో.. సీఎన్జీ కారు రెడీ!

Published Wed, Oct 9 2013 1:56 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM

టాటా నానో.. సీఎన్జీ కారు రెడీ!

టాటా నానో.. సీఎన్జీ కారు రెడీ!

న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ నానో మోడల్‌లో డ్యుయల్ ఫ్యూయల్(పెట్రోల్, సీఎన్‌జీ) వేరియంట్, నానో సీఎన్‌జీ ఈమాక్స్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధరను రూ.2.40 లక్షలు-రూ.2.65 లక్షల రేంజ్‌లో నిర్ణయించామని కంపెనీ పేర్కొంది. అధిక వేగం అవసరమైనప్పుడు సీఎన్‌జీ నుంచి పెట్రోల్ ఇంధనానికి మారేలా ఇంజిన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఈఎంఎస్) ఈ నానో ప్రత్యేకత అని వివరించింది.

ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు, లక్నోల్లో ఈ కొత్త వేరియంట్ లభిస్తుందని పేర్కొంది. ప్రారంభం నుంచే నానో సంచలనం సృష్టిస్తోందని, ఈ కొత్త వేరియంట్ ఆ సంచలనానికి జత అయిందని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్(ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్-కమర్షియల్)  అంకుష్ అరోరా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ వరకూ మొత్తం 10,202 నానో కార్లను టాటా మోటార్స్ విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి మొత్తం 39,623 నానో కార్లు అమ్ముడయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement