న్యూఢిల్లీ: కొత్త ఎలక్ట్రానిక్ పరికరం తీసుకున్న ప్రతిసారీ, దానికి పనికొచ్చే మరో రకం చార్జర్‌ను కొత్తగా కొనాల్సిన అగత్యాన్ని తప్పించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు మొదలైన వివిధ పరికరాలన్నింటికీ కామన్‌గా ఒకే చార్జర్‌ను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది.
దీనిపై మొబైల్స్ తయారీ సంస్థలు సహా పరిశ్రమ వర్గాలతో ఆగస్టు 17న సమావేశం కానుంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. దేశీయంగా బహుళ చార్జర్ల వినియోగాన్ని, ఈ–వ్యర్థాలతో పాటు వినియోగదారులపై భారాన్ని కూడా తగ్గించే సాధ్యాసాధ్యాలను మదింపు చేసేందుకు ఈ భేటీ ఉపయోగపడగలదని పేర్కొన్నారు.
2024 నాటికి చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటికీ యూఎస్‌బీ–సీ పోర్ట్ తరహా చార్జర్ల వినియోగాన్ని అమల్లోకి తేనున్నట్లు యూరోపియన్ యూనియన్ ఇటీవలే ప్రకటించింది. అమెరికాలో కూడా ఇలాంటి డిమాండే ఉంది.
చదవండి👉 నాసిరకం ప్రెజర్ కుక్కర్ల అమ్మకాలు, అమెజాన్‌కు భారీ ఫైన్!
Comments
Please login to add a commentAdd a comment