గచ్చిబౌలిలో అరీట్ ఆస్పత్రిని ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్. చిత్రంలో ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.ప్రభాకర రాజు, చైర్మన్ డాక్టర్ విజేందర్ రెడ్డి తీగెల, ఎండీ వాసు గుత్తా
హఫీజ్‌పేట్(హైదరాబాద్): హైదరాబాద్ మహానగరం ‘గ్లోబల్ మెడికల్ హబ్’గా రూపొందిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నగరం ఇప్పటికే ఫార్మాహబ్‌గా, వ్యాక్సిన్ హబ్, ఐటీ హబ్‌గా గుర్తింపు సాధించిందని ఆయన గుర్తు చేశారు. గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్కు ఎదురుగా అరీట్ ఆస్పత్రిని మంత్రి హరీశ్‌రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో హైదరాబాద్‌లో మెడికల్ టూరిజం బాగా అభివృద్ధి చెందుతోందన్నారు.
దీంతో ట్యాక్సీ డైవర్లకే కాకుండా డాక్టర్లు, టెక్నీషియన్లు, వైద్య సిబ్బందికి పనులు పెరగడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వైద్య చికిత్స కోసం నగరానికి వస్తున్నారన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు పేద, మధ్యతరగతి వారికి తక్కువ ధరకే వైద్యం అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా వారు చర్యలు చేపట్టాలని కోరారు. హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయస్థాయి అరీట్ ఆస్పత్రి అందుదాటులోకి రావడం సంతోషించదగ్గ విషయమన్నారు.
అరీట్ ఆస్పత్రుల చైర్మన్ విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆస్పత్రి సేవలు పొందడంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడం, విశ్వసనీయ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. మేనేజింగ్ డైరెక్ట వాసుగుత్తా మాట్లాడుతూ అరీట్ ఆస్పత్రిలో ఆరోగ్య సంరక్షణకు మించిన సంరక్షణ ఉంటుందన్నారు. అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో తీసుకొచ్చామని చెప్పారు ఈ కార్యక్రమం అరీట్ ఆస్పత్రుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్‌రాజు, డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ వేముల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment