‘స్మార్ట్’గా మారుస్తా | 'Debt scheme will benefit 33 lakh ryots' | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్’గా మారుస్తా

Published Fri, Dec 12 2014 3:10 AM | Last Updated on Sat, Jul 28 2018 3:15 PM

‘స్మార్ట్’గా మారుస్తా - Sakshi

‘స్మార్ట్’గా మారుస్తా

చిత్తూరు, తిరుపతిని స్మార్‌‌టసిటీలు చేస్తా
పండ్ల తోటల హబ్‌గా జిల్లా
ఆన్‌లైన్‌లో రైతు ఉత్పత్తుల విక్రయాలు
రెండు రోజుల్లోనే చెరకు బకాయిల చెల్లింపులు
చిత్తూరు సభలో చంద్రబాబు హామీలు

సాక్షి, చిత్తూరు: చిత్తూరు, తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. జిల్లాను పండ్లతోటల హబ్‌గా చేస్తానని, డెయిరీకి ప్రోత్సాహం అందిస్తానని కూడా చెప్పారు. రెండు రోజుల్లో చెరకు రైతుల బకాయిలను చెల్లిస్తామని ప్రకటించారు. గురువారం చిత్తూరులో జరిగిన రైతు సాధికారత సభలో చంద్రబాబు మాట్లాడుతూ జన్మనిచ్చిన చిత్తూరును మరవనన్నారు. కరువు జిల్లాలో తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదన్నారు.

హంద్రీ-నీవా పూర్తిచేసి జిల్లా ప్రజలకు తాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పేదిలేదన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పారు. 80 నుంచి 90 శాతం మంది అర్హులకు పింఛన్లు ఇస్తున్నట్లు  చెప్పారు. రాబోయే కాలంలో ప్రతి కుటుంబంలో సభ్యులందరికీ ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. జిల్లాలో చక్కెర ఫ్యాక్టరీల పరిధిలో రూ.20 కోట్లు చెరకు బకాయిలను రెండు రోజుల్లో చెల్లించనున్నట్లు చెప్పారు. పండ్లతోటల రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించారు. 50 శాతం సబ్సిడీతో రైతులకు మైక్రోన్యూట్రిన్స్ సప్లై చేస్తామన్నారు.

వర్మీ కల్చర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాములు, కాలువలను ఆధునీకరించాలని నిర్ణయించామని చెప్పారు. జిల్లాలో 1,75లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఉందని, ఈ ఏడాది మరో 20 వేల ఎకరాల్లో డ్రిప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దా దాపు 40వేల ఎకరాల్లో స్ప్రింక్లర్లతో వ్యవసాయం అభివృద్ధి చేయనున్నట్లు బాబు చెప్పారు. జిల్లాను పండ్లతోటల హబ్‌గా చేస్తామని, మామిడి ఎగుమతులు పెరి గేలా చూస్తామని తెలిపారు.

రైతుల ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రూ. 16వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా ఇచ్చిన మాటమేరకు రుణమాఫీ చేసినట్లు చెప్పారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతామన్నారు. 40.38లక్షల మందికి రుణమాఫీ చేసినట్లు తెలిపారు. 22.79 వేల కుటుంబాలకు రుణవిముక్తి పత్రాలు ఇస్తున్నామన్నారు. పొరపాట్లు జరిగి ఉంటే రెండో దశలో పూర్తిచేస్తామన్నారు.

చిత్తూరు జిల్లా లో 3.5లక్షల మంది రైతులకు రుణవిముక్తి కలిగిందన్నారు. అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ శివప్రసాద్, జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణీ, ఎమ్మెల్యే డీఏ.సత్యప్రభ, కార్పొరేషన్ మేయర్ కఠారి అనురాధ, కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, జేసీ భరత్‌గుప్త, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, తుడా కార్యదర్శి మాధవీలత, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement