టూరిజం హబ్‌కు గేట్ వేగా ఎస్.యానాం
టూరిజం హబ్‌కు గేట్ వేగా ఎస్.యానాం
Published Sat, Mar 4 2017 10:51 PM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM
తీరంలో కలెక్టర్ పర్యటన
ఉప్పలగుప్తం : ఎస్ యానాం సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే క్రమంలో తీర ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ శనివారం పరిశీలించి ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ద్వారా పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. చిర్రయానాం నుంచి ఓడలరేవు వరకూ ఉన్న సముద్ర తీరాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో రూ.రెండు వేల కోట్లతో చిర్రయానాంలో టూరిజం హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ప్రధాన రహదారులకు దగ్గరగా ఉన్న ఎస్.యానాం తీరాన్ని టూరిజం హబ్‌కు గేట్‌వేగా చెయ్యాలన్న ఎమ్మెల్యే ప్రతిపాదనపై కలెక్టర్ ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. తీరాన్ని ఆనుకుని ఉన్న వైట్ శాండ్ బీచ్ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుందని, రిసార్టుల ఏర్పాటు, పర్ర ప్రాంతంలో బోట్ షికారుతో ఎస్ యానాం తీరాన్ని టూరిజంలో అభివృద్ధి చెయ్యాలని గత ఏడాది ఉప ముఖ్యమంత్రి రాజప్పతో శంకుస్థ్ధాపన కూడా చేశారని ఎమ్మెల్యే కలెక్టర్ అరుణ్‌కుమార్‌కు వివరించారు. అమలాపురం నుంచి ఉన్న హైవే దారికి ఎస్.యానాం దగ్గరవుతుందని, పర్యాటకులకు ఈ మార్గం అనుకూలంగాను, దగ్గరగా ఉంటుందన్నారు. బీచ్ వరకూ సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుందని, తీరంలో రక్షణ గట్టు అభివృద్ధికి రూ.10లక్షలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే గ్రామంలో సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలిం చారు. పంచాయతీరాజ్ ఈఈ బి.సత్యనారాయణరాజు, డీఈజే మురళీకృష్ణలతో ఆయన మాట్లాడారు. ఇ¯ŒSచార్జి సర్పంచ్ పినిశెట్టి నరసింహరావు, ఎంపీటీసీ సభ్యుడు పలచోళ్ల వీరరాఘవుల నాయుడు, నీటిసంఘ చైర్మ¯ŒS దంగేటి చిట్టిబాబు, గ్రామ పెద్దలు ఉన్నారు.
ఉపాధికి గండి పడుతుంది
ఉప్పలగుప్తం : సముద్రపు పర్ర ప్రాంతం అన్యాకాంతం కావడంతో చేపల వేటకు గండిపడి ఉపాధికి గండి పడుతున్నదని కలెక్టర్ అరుణ్‌కుమార్‌కు మత్స్యకార సొసైటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మత్స్యకార నాయకుడు, ఎస్.యానాం మాజీ సర్పంచ్ లంకే భీమరాజు, సొసైటీ సభ్యులు పి.పోతురాజు, ఎం.భైరవ స్వామిలు వినతి పత్రం ఇచ్చి ఇక్కడ పరిస్థితులను వివరించారు.
Advertisement