gateway
-
ఎన్ఆర్ఐల ఈక్విటీ పెట్టుబడులకు ఇన్వెస్ట్ 19 వేదిక
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) భారత ఈక్విటీ మార్కెట్లలో నేరుగా ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా ఒక గేట్‌వేను ఆవిష్కరించనున్నట్టు ఇన్వెస్ట్ 19 ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్–డిసెంబర్ నాటికి ఈ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ కంపెనీ ఇప్పటికే ఆన్లైన్ మల్టీబ్రోకింగ్ సేవలు అందిస్తోంది. ఒకే క్లిక్‌తో భారత ఈక్విటీల్లో పెట్టుబడుల అవకాశాలను ఎన్ఆర్ఐలకు కలి్పంచాలన్న ప్రణాళికతో ఉన్నట్టు వివరించింది. నిరీ్ణత శాతం మేర దేశ పౌరులు విదేశాల్లో నివసిస్తున్నారని.. వారు భారత ఈక్విటీ మార్కెట్లలో సులభంగా ఇన్వెస్ట్ చేసుకునే మార్గం లేదని ఇన్వెస్ట్19 వ్యవస్థాపకుడు, సీఈవో కౌసలేంద్రసింగ్ సెంగార్ తెలిపారు. యూఎస్, బ్రిటన్, ఆ్రస్టేలియాలో ఒక శాతానికిపైనే భారత సంతతి ప్రజలున్నట్టు.. కెనడాలో అయితే 4 శాతానికి పైనే ఉన్నట్టు పేర్కొన్నారు. -
వరుణ్ చేతికి హోటల్ గేట్‌వే!
విశాఖపట్నం: విశాఖ సముద్ర తీరంలోని లగ్జరీ హోటల్ ‘తాజ్ గేట్‌వే’ను వరుణ్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ హోటల్‌ను దాదాపు రూ.121.10 కోట్లకు కొనుగోలు చేసినట్లు వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభుకిషోర్ తెలియజేశారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఆటోమొబైల్స్, వినోదం, ఆతిథ్యం సహా పలు రంగాల్లో ఉన్న వరుణ్ గ్రూప్‌నకు ప్రస్తుతం రెండు హోటల్ ప్రాపర్టీలున్నాయి. విశాఖ బీచ్‌రోడ్, భీమిలిలో ఉన్న ఈ రెండు హోటళ్లను నొవోటెల్ బ్రాండ్లతో ‘అకార్డ్’ గ్రూపు నిర్వహిస్తోంది. తాజాగా గేట్‌వే కూడా తమ ఖాతాలో చేరటంతో తమ హోటళ్లలోని మొత్తం గదుల సంఖ్య 600కు చేరిందని ప్రభుకిషోర్ తెలియజేశారు. తాజ్ బ్రాండ్‌తో టాటా గ్రూపు నిర్వహిస్తున్న హోటల్ గేట్‌వేలో ఇప్పటివరకు టాటాలకు 40, రెడ్డీస్‌కు 30 శాతం వాటాలుండగా మిగతాది పబ్లిక్ షేర్‌హోల్డింగ్. ‘‘గేట్‌వే కొనుగోలు గతనెల 29న ఖరారయింది. దీనికోసం చెన్నై, విశాఖ నుంచి రెండు సంస్థలు పోటీపడినా... మా సామర్థ్యాన్ని, వేగవంతమైన విస్తరణను చూసి మాకే విక్రయించటం సంతోషకరం. వచ్చే నాలుగేళ్లలో ఆతిథ్య రంగంలో మొత్తం 1000 రూమ్స్ మా చేతిలో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని ఆయన వివరించారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద 196 గదుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న నొవోటెల్‌ను ఈ డిసెంబరులో ప్రారంభించనున్నట్లు కూడా చెప్పారాయన. ఈ సమావేశంలో వరుణ్ గ్రూప్ డెరైక్టర్లు వరుణ్, వర్ష పాల్గొన్నారు. -
ఆగ్నేయాసియా గేట్వేగా మిజోరాం
ఐజ్వాల్/షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్డు, రవాణా సౌకర్యాల అభివృద్ధికి తమ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా మయన్మార్‌లోని సిత్వే పోర్టును మిజోరాంతో అనుసంధానించే కలడన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి విస్తృత ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. కంబోడియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి 10 ఆసియన్ కూటమి దేశాలకు మిజోరాం ముఖద్వారంగా మారనుందని మోదీ తెలిపారు. 60 మెగావాట్ల తుయిరియల్ జలవిద్యుత్ ప్రాజెక్టు ప్రారంభించాక అసోం రైఫిల్స్ గ్రౌండ్లో జరిగిన సభలో ప్రసంగించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం, త్రిపుర తర్వాత మిగులు విద్యుత్ ఉత్పత్తి అవుతున్న రాష్ట్రంగా మిజోరాం అవతరించిందన్నారు.. అనంతరం ఆయన మేఘాలయ రాజధాని షిల్లాంగ్ వెళ్లారు. పశ్చిమ మేఘాలయలోని తురా ప్రాంతాన్ని రాజధాని షిల్లాంగ్తో కలిపే 271 కిలోమీటర్ల డబుల్ లేన్ రోడ్డును జాతికి అంకితం చేశారు. షిల్లాంగ్ ఎయిర్‌పోర్టును భారీ విమానాలు సైతం దిగేలా విస్తరిస్తామన్నారు. ‡1971 ఇండో–పాక్ యుద్ధంలో పోరాడిన భారతీయ సైనికులకు మోదీ అభినందనలు తెలిపారు. విజయానికి గుర్తుగా ఏటా ‘విజయ్‌దివస్’గా జరుపుకుంటున్నారు. -
టూరిజం హబ్‌కు గేట్ వేగా ఎస్.యానాం
తీరంలో కలెక్టర్ పర్యటన ఉప్పలగుప్తం : ఎస్ యానాం సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే క్రమంలో తీర ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ శనివారం పరిశీలించి ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ద్వారా పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. చిర్రయానాం నుంచి ఓడలరేవు వరకూ ఉన్న సముద్ర తీరాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో రూ.రెండు వేల కోట్లతో చిర్రయానాంలో టూరిజం హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ప్రధాన రహదారులకు దగ్గరగా ఉన్న ఎస్.యానాం తీరాన్ని టూరిజం హబ్‌కు గేట్వేగా చెయ్యాలన్న ఎమ్మెల్యే ప్రతిపాదనపై కలెక్టర్ ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. తీరాన్ని ఆనుకుని ఉన్న వైట్ శాండ్ బీచ్ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుందని, రిసార్టుల ఏర్పాటు, పర్ర ప్రాంతంలో బోట్ షికారుతో ఎస్ యానాం తీరాన్ని టూరిజంలో అభివృద్ధి చెయ్యాలని గత ఏడాది ఉప ముఖ్యమంత్రి రాజప్పతో శంకుస్థ్ధాపన కూడా చేశారని ఎమ్మెల్యే కలెక్టర్ అరుణ్‌కుమార్‌కు వివరించారు. అమలాపురం నుంచి ఉన్న హైవే దారికి ఎస్.యానాం దగ్గరవుతుందని, పర్యాటకులకు ఈ మార్గం అనుకూలంగాను, దగ్గరగా ఉంటుందన్నారు. బీచ్ వరకూ సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుందని, తీరంలో రక్షణ గట్టు అభివృద్ధికి రూ.10లక్షలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే గ్రామంలో సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలిం చారు. పంచాయతీరాజ్ ఈఈ బి.సత్యనారాయణరాజు, డీఈజే మురళీకృష్ణలతో ఆయన మాట్లాడారు. ఇ¯ŒSచార్జి సర్పంచ్ పినిశెట్టి నరసింహరావు, ఎంపీటీసీ సభ్యుడు పలచోళ్ల వీరరాఘవుల నాయుడు, నీటిసంఘ చైర్మ¯ŒS దంగేటి చిట్టిబాబు, గ్రామ పెద్దలు ఉన్నారు. ఉపాధికి గండి పడుతుంది ఉప్పలగుప్తం : సముద్రపు పర్ర ప్రాంతం అన్యాకాంతం కావడంతో చేపల వేటకు గండిపడి ఉపాధికి గండి పడుతున్నదని కలెక్టర్ అరుణ్‌కుమార్‌కు మత్స్యకార సొసైటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మత్స్యకార నాయకుడు, ఎస్.యానాం మాజీ సర్పంచ్ లంకే భీమరాజు, సొసైటీ సభ్యులు పి.పోతురాజు, ఎం.భైరవ స్వామిలు వినతి పత్రం ఇచ్చి ఇక్కడ పరిస్థితులను వివరించారు.