dawn news
-
ముంబై దాడులపై నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
-
‘మా వాళ్లను వేధిస్తున్నారు’
ఇస్లామాబాద్ : భారత్‌ను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. భారత్‌లో నివసిస్తున్న తమ దౌత్యవేత్తలను, వారి కుటుంబాలను భారత్ వేధిస్తోందని పాక్ ఆరోపించింది. ఈ అంశాన్ని పాక్ ఇస్లామాబాద్‌లో భారత హైకమిషన్‌తో పాటు భారత విదేశాంగ శాఖ దృష్టికి తీసుకువెళ్లినట్టు డాన్ పత్రిక పేర్కొంది. తమ అధికారులపై వేధింపులు నిలిపివేయకపోతే తమ దౌత్యవేత్తలను, వారి కుటుంబాలను వెనక్కిపిలిపిస్తామని పాక్ హెచ్చరించినట్టు ఈ కథనం వెల్లడించింది. పాక్ డిప్యూటీ హైకమిషనర్ పిల్లలు స్కూలుకు వెళుతుండగా వారిని అడ్డగించి వేధింపులకు గురిచేశారని పాక్ దౌత్యవర్గాలు పేర్కొన్నాయి. మరికొందరు దౌత్య సిబ్బందినీ వేధిస్తున్నారని తెలిపాయి. న్యూఢిల్లీలో తమ సీనియర్ దౌత్యవేత్తనూ వేధించారని పాక్ ఆరోపించినట్టు డాన్ పేర్కొంది. పాకిస్తాన్ హైకమిషన్‌కు చెందిన పలు వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయని కూడా ఈ కథనం తెలిపింది. కాగా బిన్ లాడెన్, హఫీజ్ సయీద్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ బాధిత దేశంగా ప్రపంచం ముందు నిలవాలని ప్రయత్నిస్తోందని ఐరాస వేదికగా భారత్ ధ్వజమెత్తిన నేపథ్యంలో పాక్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. -
పార్లమెంటులో కొట్టుకున్నారు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పార్లమెంట్ గురువారం రణరంగాన్ని తలపించింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరినొకరు కొట్టుకుంటూ తోసుకున్నారు. ప్రధాని నవాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీచేయాలని ఐదుగురు ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ అయాజ్ సాదిక్‌ను కోరడమే ఇందుకు కారణమని డాన్ న్యూస్ తెలిపింది. ఈ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) నాయకుడు షా మహమూద్ ఖురేషి సభలో మాట్లాడుతుండగా ఆయన పార్టీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో అధికార పీఎంఎల్ఎన్ సభ్యుడు షాహిద్ ఖాన్ అబ్బాసి.. ఖురేషి వద్దకు వెళ్లి తమ పార్టీ సభ్యులను అదుపుచేయమని విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. తమ అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై అబ్బాసి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పీటీఐ సభ్యులు ఆరోపించారు. ఆ తరువాత ఇరు వర్గాల మధ్య బాహాబాహీ చోటుచేసుకున్నట్లు డాన్ న్యూస్ పేర్కొంది. సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. -
పాక్ సరిహద్దులో ఆత్మాహుతి దాడి: ఆరుగురు మృతి
పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ దేశ సరిహద్దుల్లోని బలూచిస్థాన్ ప్రావెన్స్ లోని చమన్ పట్టణంలో ఈ రోజు ఉదయం ఆత్మహుతి దాడిలో ఆరుగురు వ్యక్తులు మరణించారని స్థానిక మీడియా డాన్ న్యూస్ బుధవారం వెల్లడించింది. ఆ ఘటనలో అనేక మంది గాయపడ్డారని తెలిపింది. క్షతగాత్రులందరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పింది. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. కస్టమ్స్ హౌస్ వద్ద ఓ వ్యక్తి తనకు తాను పేల్చుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించింది. అయితే ఆ ఘటనకు పాల్పడింది తామే అని ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని డాన్ న్యూస్ తెలిపింది.