
కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో అందులోని 23 మంది మరణించారు. వాధ్ నుంచి దాదు వైపు వేగంగా వెళ్తున్న బస్సు ఖుజ్‌దార్ జిల్లాలోని ఖోరి వద్ద అదుపు తప్పిబోల్తా పడింది.
ఘటనాస్థలంలోనే 15 మంది మరణించారు. గాయపడిన 30 మందిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా మరో ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 23కు చేరింది. ఇంకా కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు.
చదవండి: తలవంచిన ఎల్చాపో భార్య.. నవ్వుతూ శిక్షకు సిద్ధం